వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా..కేసీఆర్ సిఫార్సులను జగన్ కాదనగలరా..! ఎవరికి ప్రాధాన్యత...ముఖ్యమంత్రి నిర్ణయమేంటి..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ పైన కొద్ది రోజులుగా ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇప్పటికే పోలవరం.. రాజధాని వ్యవహారాల్లో వివాదాలతో సతమతం అవుతున్న ముఖ్యమంత్రికి మరో సమస్యగా మారింది. కేంద్ర మంత్రులు అమిత్ షా తో పాటుగా నిర్మలా సీతారామన్.. గజేంద్ర సింగ్ షెకావత్ సహా నలుగురు ముఖ్యమంత్రులు కొద్ది రోజులు ఏపీ మఖ్యమంత్రి జగన్ తో టచ్ లో ఉంటున్నారు. వారు చెప్పిన విషయాలు .. చేస్తున్న సిఫార్సులకు జగన్ నో అని చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో ఎస్ అని సమాధానం ఇవ్వటం లేదు. దీంతో..జగన్ వారిలో ఎవరి మాట కాదనలేని స్థితి లో ఉన్నారు. దీంతో..ఇప్పుడు జగన్ ఎవరి మాటకు ప్రాధాన్యత ఇస్తారు...తుది నిర్ణయం ఏ రకంగా తీసుకుంటారు. ఇప్పుడు ఇదే ఆసక్తి కరంగా మారుతోంది.

జగన్ కు కేంద్ర మంత్రుల సిఫార్సులు...

జగన్ కు కేంద్ర మంత్రుల సిఫార్సులు...

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా తమ వారికి అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రుల మొదలు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పేర్లు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎవరి మాట కాదనలేక గతంలో బోర్డులో 19గా ఉన్న సభ్యుల సంఖ్య 25 కు పెంచారు. గతంలో చంద్రబాబు హాయంలో ఒక ఎంపీ..నలుగురు ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి తన కారణంగా ఇబ్బందులు పడిన.. తనకు అండగా నిలిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా కొందరు పారిశ్రామిక వేత్తల పేర్లను జగన్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక, ఇదే సమయంలో తెలంగాణ..కర్నాటక.. మహారాష్ట్ర..తమిళనాడు నుండి సభ్యులను అక్కడి ముఖ్యమంత్రుల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా
టిటిడి ఇవో, స్పేషల్ సియ‌స్ రెవిన్యు, ముగ్గురు ప్ర‌త్యేక ప్ర‌తినిధులు స‌భ్యులుగా ఉంటారు.

Recommended Video

జగన్ ప్రత్యేక హోదా అడగడానికి రీజన్ అదేనా..?? || Why AP CM Jagan Thoroughly Asking For Special Status
అమిత్ షా..కేసీఆర్ సిఫార్సులను ఆమోదిస్తే..

అమిత్ షా..కేసీఆర్ సిఫార్సులను ఆమోదిస్తే..

టిటిడి పాల‌క‌మండ‌లిలో స‌భ్యుల నియామ‌కం కోర‌కు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామ‌న్, గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్, తో పాటు తెలంగాణా సియం కేసిఆర్, క‌ర్నాట‌క సియం య‌డ్యూర‌ప్ప‌, త‌మిళ‌నాడు సియం ప‌ళ‌నిస్వామి, తో పాటు మ‌హారాష్ట్ర సియం ఫ‌డ్న‌వీస్ లు ప‌లువురి కోసం సియం జ‌గ‌న్ కు పేర్లు సిఫార్సు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిఫార్సు తో సివిల్ సర్వీసు అధికారి కృష్ణ‌మూర్తి ని కర్నాటక కోటా నుండి ఎంపిక చేసారు. చంద్రబాబు హయాంలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరి పేర్లను సిఫార్సు చేసారు. వారిలో కావేరీ సీడ్స్ సీడ్స్ ఛైర్మన్ జీవీ భాస్కర రావు..సిద్దిపేటకు చెందిన టీఆర్ యస్ నేత మోరంశెట్టి రాములు పేర్లు ప్రతిపాదించారు. వీరి విషయంలో జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడు నుండి ఇండియా సిమెంట్స్ అధినేత.. బిసిసిఐ మాజీ ఛైర్మ‌న్ శ్రీనివాసన్ పేరు ఖరారు చేసారు. గ‌త పాల‌క మండ‌లిలో స‌భ్యురాలిగా ఉన్న శ్రీ‌మ‌తి స్వ‌ప్నాసుధీర్ ముగ్యాతివార్ ని మ‌రోసారి టిటిడి పాల‌క మండ‌లిలో కోన‌సాగించాల‌ని సియం జ‌గ‌న్ ను మహారాష్ట్ర సియం మ‌హేంద్ర ఫ‌డ్న‌విస్ కోరారు.అమె నియామ‌కం పై జ‌గ‌న్ కోన‌సాగింపుపై పున‌రాలోచ‌న‌లో ఉన్నారు. అమె నియామకం గురించి చంద్రబాబుకు నాడు బీజేపీతో ఉన్న సంబంధాల కారణంగానే అవకాశం కల్పించారంటూ జగన్ అప్పట్లో ఆరోపణలు చేసారు. దీంతో.. ఆ నియామకం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

 తెలంగాణ నుండి శివకుమార్..ఏపీ నుండి వీరికే..

తెలంగాణ నుండి శివకుమార్..ఏపీ నుండి వీరికే..

తెలంగాణ నుండి వైసీపీ పేరుతో పార్టీ స్థాపించిన శివ కుమార్ పేరును జగన్ ఖరారు చేసారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వర రావు.. ఇన్పోసిస్ ఛైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి స‌తీమ‌ణి య‌న్ ఆర్ సుధామూర్తి ,హెట్రో డ్ర‌గ్స్ ఛైర్మ‌న్ పార్ద‌సార‌ధి రెడ్డి..స్వామి స్వ‌రుపానంద సిఫార్సు మేర‌కు నాదెళ్ల‌ సుబ్బారావు పేర్లు ఖరారయ్యాయి. ఇక ఏపీ నుండి ఎమ్మెల్యే లు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.ఎస్సీ ఎమ్మెల్యే కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్.స్థానిక ఎమ్మెల్యే కోటాలో భూమన కరుణాకర్ రెడ్డి, తుడా ఛైర్మ‌న్ గా ఉన్న ఎమ్మేల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి..ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి పేర్లను జగన్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా ఆకేపాటి అమర్నాధ రెడ్డి.. మల్లాది విష్ణు.. బొల్లా బ్రహ్మనాయుడు..ముదునూరి ప్రసాద రాజు.. అన్నే రాంబాబు పేర్లు తుది జాబితాలో చేరే అవకాశం ఉంది. దీని పైన ఈ రోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ కానున్నాయి.

English summary
Central Mininster and southersn CMs recommanded many names for consideration for TTD board members. AP Cm Jagan almost all clear the board members lilst with all equations. Given priority for old friends from karnataka and Tamilnadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X