వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రభుత్వం పై కేంద్రం ఆగ్రహం: ఓట్లు కంటే రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యం: మీ భారమే మేం మోస్తున్నాం..!

|
Google Oneindia TeluguNews

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం పైన ఇంకా రగడ సాగుతూనే ఉంది. ఈ అంశం తొలి నుండి ఏపీ ప్రభుత్వం మీద కఠినంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓట్లు..ఎన్నికల కంటే రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒప్పందాలను రద్దు చేసుకుంటూ వెళ్తే దేశంలో.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు.ఉచిత విద్యుత్‌ ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వ్యవహారాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా.. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. నేరుగా పీపీఏ అంశాన్ని ప్రస్తావించకుడా ఏపీ ప్రభుత్వమే భారం మోస్తోందని..ఇది తమకు భారంగా ఉన్నందువల్ల కొంత భారాన్ని కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా పీపీఏ ల వ్యవహారం కేంద్ర..ఏపీ ప్రభుత్వాల మధ్య దూరం పెంచుతోంది.

రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం..
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయడం పట్ల కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు, ఎన్నికల కంటే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యమని స్పష్టం చేశారు. ఒప్పందాలను రద్దు చేసుకుంటూ వెళ్తే దేశంలో,..రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించకపోతే పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తారని మంత్రి హెచ్చరించారు. విద్యుత్‌ కంపెనీలకు రాష్ట్రాలు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా విద్యుత్‌ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. పరిశ్రమలపై అధిక విద్యుత్‌ చార్జీలు విధించడం సరికాదన్నారు. సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, పునరుత్పాద విద్యుదుత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర ప్రభుత్వ పీపీఏల సమీక్ష నిర్ణయాన్ని తొలి నుండి తప్పుబడుతున్నారు. దీని మీద ఏపీ ప్రభుత్వం మాత్రం తమ వాదన మీదే నిలబడింది. ముఖ్యమంత్రి జగన్ సైతం ఇదే విషయాన్ని నేరుగా ప్రధానికి పలుమార్లు వివరించారు.

Central minister RK Sigh once again serious comments on AP Govt regarding PPAs review decision

కేంద్రానికి ఏపీ ప్రభుత్వ లేఖ..
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేసిన సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటి వరకు అంతర్గత చర్చలతో వివరణ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..ఇప్పుడు కేంద్రానికి నేరుగా లేఖ రాసింది. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌కు రాసిన లేఖలో తమ విధానం స్పష్టం చేసారు. అదే సమయంలో పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో కేంద్రం బాధ్యతను తాము తలకెత్తుకుని మోస్తున్నామని వివరించారు. ది తమకు భారంగా ఉన్నందువల్ల కొంత భారాన్ని కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేసింది. దేశం మొత్తమ్మీద ఏటా 60 వేల మిలియన్‌ యూనిట్ల పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగిస్తుంటే.. అందులో ఒక్క ఆంధ్రలోనే 15 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను మేం వినియోగిస్తున్నామని మంత్రి బాలినేని వివరించారు. ఇలా.. ఏపీ ప్రభుత్వం తమ విధానం సరైనదనే రీతిలో కేంద్రానికి లేఖ ద్వారా స్పష్టం చేసింది. దీని ద్వారా ఈ వ్యవహారం ఇప్పుడు కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత గ్యాప్ పెంచే అవకాశం కనిపిస్తోంది.

English summary
Central minister RK Sigh once again serious comments on AP Govt regarding PPA's review decision. He says state future is most important than votes. At the same time AP Govt also reacted through letter about their problesm is renewble energy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X