వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చ‌ంద్ర‌బాబుకు గ్రేట్ రిలీఫ్‌.. జ‌గ‌న్ దూకుడుకు బ్రేక్..!? కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దూకుడుకు కేంద్రం బ్రేకులు వేస్తోంది. గ‌త ప్ర‌భుత్వ హాయంలో జ‌రిగిని అవీనితి వెలుగులోకి తెచ్చేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ ఉప సంఘం ఏర్పాటు చేసారు. అందులో భాగంగా పిపీఏ ఒప్పందాల మీద ఆరా తీస్తున్నారు. ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నా..అధిక మొత్తంలో పీపీఏలు చేసుకున్నార‌నేది జ‌గ‌న్ వాద‌న‌. దీనికి సంబంధించి లోతుగా అధ్య‌యనం చేసి నివేదిక ఇవ్వాల‌ని..ఎక్క‌డైనా అవినీతి జ‌రిగి ఉంటే నాటి విద్యుత్ శాఖ మంత్రి తో పాటుగా అధికారుల‌ను అవ‌స‌ర‌మైతే ముఖ్య‌మంత్రి పైన న్యాయ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇక‌, ఇప్పుడు కేంద్రం ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుంది. విచార‌ణ వ‌ద్దంటూ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాసింది.

పీపీఏల మీద జ‌గ‌న్ విచార‌ణ‌..

పీపీఏల మీద జ‌గ‌న్ విచార‌ణ‌..

టీడీపీ హాయంలో జ‌రిగిన ప‌వ‌ర్ ప‌ర్చేస్ అగ్రిమెంట్ల మీద ముఖ్య‌మంత్రి అధ్య‌య‌న క‌మిటీ వేసారు. నిపుణుల క‌మిటీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద ఆరా తీస్తున్నారు. ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నా.. అవినీతికి పాల్ప‌డ‌టం వ‌ల‌నే ఆ స్థాయి ధ‌ర‌ల‌తో ఒప్పందాలు చేసుకున్నార‌ని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు. దీంతో..విచార‌ణ కు ఆదేశించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా న్యాయ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, దీని పైన గ‌తంలోనే కేంద్ర ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శి లేఖ రాసారు. విచార‌ణ పేరుతో ఒప్పందాల‌ను స‌మీక్షిస్తే కాంట్రాక్టుల‌ను గౌర‌వించ‌టం లేద‌నే భావ‌న‌తో మొత్త‌గా న‌ష్టం జ‌రుగుతుంద‌ని సూచించారు. దీనిని సీరియ‌స్ గా తీసుకున్న జ‌గ‌న్ నేరుగా కేంద్రంతోనే ఈ విష‌యం పైన తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించారు.

 ప్ర‌ధాని ఆమోదంతో విచార‌ణ‌...కానీ, మ‌రోసారి

ప్ర‌ధాని ఆమోదంతో విచార‌ణ‌...కానీ, మ‌రోసారి

కేంద్ర ఇంధ‌న కార్య‌ద‌ర్శి పీపీఏల విచార‌ణ పైన అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ లేఖ రాయ‌టంతో..గ‌త నెల‌లో తిరుమ‌ల‌లో శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ప్ర‌ధాని మోదీతో ముఖ్య‌మంత్రి ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌ధాని సైతం అవినీతి జ‌రిగి ఉంటే ఖ‌చ్చితంగా విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. దీంతో.. ఆ వెంట‌నే జ‌గ‌న్ విచార‌ణ క‌మిటీ వేసారు . ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. పీపీఏలను రద్దు చేయడం చట్ట విరుద్ధమవుతుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే రద్దు చేసి ప్రాసిక్యూషన్‌ చేయొచ్చు న ని.. లేని పక్షంలో కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల టారిఫ్‌ను పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ కుదుర్చుకున్న పీపీఏలు న్యాయమో కాదో మీకు అర్ధమవుతుందన్నారు. సోలార్‌, పవన విద్యుత్ టారిఫ్ లను స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తారని ఆ లేఖలో ఆర్కే సింగ్ స్పష్టం చేశారు.

చంద్ర‌బాబుకు రిలీఫ్‌..మారుతున్న స‌మీక‌ర‌ణాలు

చంద్ర‌బాబుకు రిలీఫ్‌..మారుతున్న స‌మీక‌ర‌ణాలు

ఇప్పుడు జ‌గ‌న్ ప్రారంభించిన విచార‌ణ నిలిపివేయాల‌ని కేంద్ర మంత్రి సూచించ‌టం ద్వారా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కు పెద్ద రిలీఫ్‌గా భావించాలి. పీపీఏలో అవినీతిని బ‌య‌ట‌కు తీసి చంద్ర‌బాబు మెడ‌కు ఉచ్చు వేయాల‌ని జ‌గ‌న్ భావించారు. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి స్వ‌యంగా రంగంలోకి దిగి విచార‌ణ ఆపమంటూ లేఖ రాసారు. దీని వెనుక రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం ప్ర‌భుత్వంలో సాగుతోంది. న‌లుగురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలోకి వెళ్లం ద్వారా..వారే చంద్ర‌బాబు కోసం ఈ ర‌కంగా కేంద్ర మంత్రుల పైన ఒత్తిడి తెస్తున్నారా అనే సందేహం వ్య‌క్తం అవుతోంది. మ‌రి..ఇప్పుడు మారుతున్న ఈ స‌మీక‌ర‌ణాల‌తో సీఎం జ‌గ‌న్ కేంద్ర మంత్రి లేఖ పైన ఏర‌కంగా స్పందిస్తారు..ఎలా ముందుకెళ్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
Central Minister RK Singh letter to AP CM Jagan to stop enquiry on PPA's which taken place in Chandra Babu Tenure. Now interest created on Jagan future step in this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X