వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా శుద్ద అబద్దం: ఇదేనా మీ చిత్తశుద్ది?.. బీజేపీని లెక్కలతో కడిగేసిన టీడీపీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: నిధులిచ్చామని కేంద్రం.. లేదూ.. అబద్దపు లెక్కలు చెబుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఇద్దరిలో ఎవరిది నిజమో తేల్చేందుకు ఇప్పుడో జేఎఫ్‌సి(జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ క‌మిటీ). ఇరు వర్గాల నుంచి ఎవరి లెక్కలెంతో తమకు పంపిస్తే.. అందులో నిజానిజాలేంటో నిర్దారించడమనేది ఇప్పుడు జేఎఫ్‌సి చేయబోతున్న పని.

Recommended Video

BJP MP Haribabu Press Meet On AP Projects With Statistics

ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం తమకు అందిన నిధుల లెక్కల్ని జేఎఫ్‌సి కంటే ముందే జనం ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా.. కేంద్రం నుంచి ఇప్పటిదాకా అందిన నిధులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా లెక్కగట్టాయి. ఈ లెక్కల్లో తేలింది ఇదనేలాగా తాజాగా ఓ కథనం తెరపైకి వచ్చింది.

ఇచ్చింది ఇంతే..:

ఇచ్చింది ఇంతే..:

నవ్యాంధ్ర కోసం ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ.20వేల కోట్లే అని ప్రభుత్వ వర్గాలు లెక్కలు తేల్చాయట. అందులోనూ కేంద్రం చొరవ తీసుకుని ప్రత్యేకంగా కేటాయించింది కేవలం రూ.10వేల కోట్లేనట.

గత శనివారం నాడు ఢిల్లీలో బీజేపీ ప్రకటించిన నిధుల లెక్కల్ని పూర్తిగా తప్పని నిరూపించేందుకు ప్రభుత్వ వర్గాలు ఈ లెక్కలు బయటకు తీశాయట. ఈ లెక్కల ప్రకారం బీజేపీ చెప్పిన దానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన దానికి తీవ్ర అగాథం ఉందని చెబుతున్నాయి.

 5.6శాతం మాత్రమే ఇచ్చారు..:

5.6శాతం మాత్రమే ఇచ్చారు..:

కేంద్రం కేటాయించిన రూ.20వేల కోట్లలో రూ.10వేల కోట్లను సాధారణంగా అన్ని రాష్ట్రాలకూ ఇచ్చినట్టే మాకూ ఇచ్చారనేది ప్రభుత్వ వర్గాల వాదన. కేవలం మరో రూ.10వేల కోట్లు మాత్రమే బీజేపీ ఇప్పటిదాకా రాష్ట్రానికి అదనంగా ఇచ్చిందని చెబుతున్నారు.

అదే సమయంలో బీజేపీ వాళ్లేమో.. రాష్ట్రానికి 3.55లక్షల కోట్ల మేర నిధులు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, కానీ ఇప్పటిదాకా అందినదాన్ని బట్టి చూస్తే.. వాళ్లిచ్చిన మొత్తం కేవలం 5.6శాతం మాత్రమేనని చెబుతున్నారు.

రీయింబర్స్ ఎందుకు చేయలేదు..:

రీయింబర్స్ ఎందుకు చేయలేదు..:


ఇక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన కేంద్రం.. ఇందుకోసం నాబార్డు రుణ సదుపాయం కూడా ఏర్పాటు చేశామని చెబుతోంది. ఆ రుణాన్ని తామే చెల్లిస్తామని కూడా అప్పట్లో ప్రకటించింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై సొంతంగా ఖర్చు చేసిన రూ.7,179 కోట్లే తిరిగి చెల్లించలేదని ప్రభుత్వ వర్గాలు మండిపడుతున్నాయి.

విదిల్చారంతే..:

విదిల్చారంతే..:


అడిగిన ప్రతీసారి.. ఏదో విదిల్చారే తప్ప పూర్తి స్థాయి నిధులు మాత్రం కేంద్రం కేటాయించిందే లేదని ప్రభుత్వ వర్గాలు కుండబద్దలు కొడుతున్నాయట. అప్పుడో వంద కోట్లు.. ఇప్పుడో 300కోట్లు అన్న చందంగా నిధులు ఇచ్చేసి.. ఏదో చేసేశామని గొప్పలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

మొత్తంగా ఈ నాలుగేళ్లలో కేవలం రూ.4332కోట్లు మాత్రమే కేంద్రం నుంచి రాష్ట్రానికి రీయింబర్స్ అయిందని చెబుతున్నారు. ఇప్పటికీ రూ.2847కోట్లు కేంద్రం నుంచి రీయింబర్స్ కావాల్సి ఉంది.

పోలవరంపై ఇదేనా చిత్తశుద్ది?:

పోలవరంపై ఇదేనా చిత్తశుద్ది?:

రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై ఖర్చు చేసిన నిధులనే పూర్తిగా రీయింబర్స్ చేయలేని కేంద్రం.. ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులేమి లేవని చెబుతున్నారు. ఓవైపు అంచనా వ్యయం పెరిగిందని చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వాన్నే అనుమానంగా చూస్తున్నారు తప్ప.. ఆ వ్యయాన్ని ఇంతవరకూ ఆమోదించలేదంటున్నారు.

లక్ష కోట్లన్నారు.. ఇచ్చిందేమో!

లక్ష కోట్లన్నారు.. ఇచ్చిందేమో!

జాతీయ రహదారుల కోసం రూ.1లక్ష కోట్లు ఇచ్చినట్టు బీజేపీ చెప్పడాన్ని ప్రభుత్వ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఇచ్చింది రూ.3వేల కోట్లనేనని, లెక్కలు మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నారని అంటున్నారు.

విశాఖ-చెన్నై కారిడార్‌, కోస్టల్‌ ఎకనమిక్‌ జోన్‌, నాగాయలంక మిస్సైల్‌ యూనిట్‌కు మొత్తం రూ.15,226 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతున్న లెక్కలు శుద్ద అబద్దం అని తేల్చేశారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇందుకోసం విడుదల చేయలేదంటున్నారు.

ఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబు ఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబు

వాటి పరిస్థితి కూడా అంతే..:

వాటి పరిస్థితి కూడా అంతే..:


మిగతా వాటిల్లాగే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి కూడా బొటాబొటి నిధులే వచ్చాయంటున్నారు. కేటాయించింది రూ.17,292 కోట్లు నిధులైతే.. ఇచ్చింది మాత్రం కేవలం రూ.1500కోట్లేనని అంటున్నారు. ఇక రెవెన్యూ లోటు విషయంలోనూ కేంద్రం లెక్కలు తప్పుల తడకలే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

English summary
Andhrapradesh govt is extremely unhappy with Central govt regarding the funds. TDP Members and govt officials are saying that central statistics are completely misleading
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X