• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విభజనహామీలపై కేంద్రం మరో అఫిడవిట్, విశాఖనుంచి సర్వీస్ నిలిపేస్తారా.. గల్లా

By Srinivas
|

న్యూఢిల్లీ: విభజన హామీలపై కేంద్రం సోమవారం సుప్రీం కోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం ఇటీవల కౌంటర్లు దాఖలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల రైల్వే జోన్, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తెలుగు రాష్ట్రాలకు స్టీల్ ఫ్యాక్టరీలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

చంద్రబాబునే అంటారా, ఎక్కడో చెప్పు: పవన్‌ను ఏకేసిన శివాజీ, సీఎంకు కేవీపీ లేఖ

తాజాగా, జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్ర మానవ వనరుల శాఖ కేంద్రానికి అఫిడవిట్ సమర్పించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొంది. ఏపీ, తెలంగాణలలో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు పరిశీలనలో ఉందని తెలిపారు. మిగతా విద్యాసంస్థల ఏర్పాటు, తరగతుల నిర్వహణ అంశాలను పేర్కొంది.

ఇప్పటి వరకు పచ్చజెండా ఊపలేదు

ఇప్పటి వరకు పచ్చజెండా ఊపలేదు

విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి విదేశీ విమానాల రాకపోకలకు అవకాశం కల్పించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లోకసభలో 377 నిబంధనకింద లిఖిత పూర్వకంగా ఈ అంశాన్ని లేవనెత్తారు.రాష్ట్ర విభజన తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలకు చొరవ తీసుకుంటామని కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేశారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో సౌకర్యాలు కల్పించినా ఇప్పటి వరకు విమాన రాకపోకలకు కేంద్రం పచ్చ జెండా ఊపలేదన్నారు.

నేవీ పైలట్లకు శిక్షణ ఇస్తారు కానీ, వాటిని అడ్డుకుంటారా?

నేవీ పైలట్లకు శిక్షణ ఇస్తారు కానీ, వాటిని అడ్డుకుంటారా?

విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి రెండు మూడు సర్వీసులు నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని గల్లా మండిపడ్డారు. విశాఖపట్నంలో నేవీ అధికారుల కొత్త ఆంక్షలతో స్పైస్ జెట్, శ్రీలంక ఎయిర్ లైన్స్ తమ సర్వీసులు నిలిపేసే ఆలోచనలో ఉన్నాయని, నేవీ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు గగనతలాన్ని వాడుకుంటున్నారని, విదేశఈ విమాన సర్వీసులను మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎందుకని నిలదీశారు.

కార్గో సర్వీసుల మాటేమిటి

కార్గో సర్వీసుల మాటేమిటి

విజయవాడ కేంద్రంగా కార్గో సర్వీసులను అందుబాటులోకి తెస్తామని చెప్పారని అది ఇప్పటి అమలు కాలేదని గల్లా అన్నారు. విజయవాడ ఎయిర్ పోర్టులో కార్గో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిందని, సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదన్నారు. ఎన్నో అంశాలను కేంద్ర విమానయాన శాఖ పరిశీలించాలన్నారు.

 కాపు రిజర్వేషన్లపై అవంతి శ్రీనివాస్

కాపు రిజర్వేషన్లపై అవంతి శ్రీనివాస్

లోకసభ జీరో అవర్‌లో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తక్షణమే షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Central Government on Monday filed affidavit in Supreme Court on National Institution in Telugu States as promised in AP ReOrganisation act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more