వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావు ఆనందం: ఏపీలో ఒకే కమ్యూనిటీకి 5'పద్మ'లు, 'తెలంగాణ' లిస్ట్ పక్కకు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనకు పద్మ విభూషణ్ రావడంపై ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు స్పందించారు. ఈ గౌరవం తన ఒక్కడితే కాదని, ఈనాడు, ఈటీవీలతో పాటు నేను చేపట్టిన మీడియా సస్థలన్నింటి పైన అవ్యాజమైన ప్రేమాభమానాలు కురిపించి, వాటికి వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు ప్రజలది అన్నారు.

అందుకే తన ఈ పురస్కారాన్ని తెలుగు ప్రజలందరికీ అంకితం ఇస్తున్నట్లు రామోజీ రావు చెప్పారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన భారతీయులకు కేంద్రం పద్మ పురస్కారాలను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Centre ignores Telangana's recommendation for Padma awards

ఏపీ, తెలంగాణల నుంచి చెరో ఆరుగురికి..

పద్మ అవార్డులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి చెరో ఆరుగురికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి... రామోజీ రావు (పద్మవిభూషణ్), యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (పద్మభూషణ్), వెంకట రామారావు (పద్మభూషణ్), ఆల్ల గోపాల కృష్ణ గోఖలే (పద్మశ్రీ), యార్లగడ్డ నాయుడమ్మ (పద్మశ్రీ), సునితా కృష్ణన్ ((పద్మశ్రీ) ఉన్నారు.

రామోజీరావుకు పద్మవిభూషణ్, సానియా, సైనాలకు పద్మభూషణ్ అవార్డులు, బాబు, కెసిఆర్ హర్షంరామోజీరావుకు పద్మవిభూషణ్, సానియా, సైనాలకు పద్మభూషణ్ అవార్డులు, బాబు, కెసిఆర్ హర్షం

తెలంగాణ నుంచి నాగేశ్వర్ రెడ్డి (పద్మభూషణ్), సైనా నెహ్వాల్ (పద్మభూషణ్), సానియా మీర్జా (పద్మభూషణ్), టివి నారాయణ (పద్మశ్రీ), మన్నన్ గోపీచంద్ (పద్మశ్రీ), లక్ష్మ గౌడ్ (పద్మశ్రీ) ఉన్నారు.

కాగా, ఏపీకి వచ్చిన ఆరు పద్మ అవార్డులలో ఒకే కమ్యూనిటీకి అయిదు అవార్డులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే, తెలంగాణ ప్రభుత్వం 56 పేర్లను ప్రతిపాదిస్తే అందులో ఒకటి మాత్రమే కేంద్రం ఆమోదించింది. మొత్తంగా ఏపీ నుంచి ఆరుగురికి, తెలంగాణ నుంచి ఆరుగురికి పద్మ అవార్డులు దక్కాయి. దర్శకులు ఎస్ఎస్ రాజమౌళికి కర్నాటక జాబితాలో పద్మశ్రీ వచ్చింది.

English summary
Telangana state got a raw deal in the Padma awards announced on Monday. The TS government had recommended 56 names for the Padma awards but got only one, a Padma Shri for artist K. Laxma Goud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X