అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Anantapur:శభాష్ చంద్రుడు.. కోవిడ్-19 పై అనంత కలెక్టర్‌‌కు కేంద్రం ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లా దేశంలోనే కరువు జిల్లాల్లో రెండో స్థానంలో ఉన్న జిల్లాగా పేరుంది. ప్రస్తుతం ఈ జిల్లాను కరోనావైరస్ కూడా కుదిపేస్తోంది. కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తున్నా సరే... దానికి అడ్డుకట్ట వేస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ జిల్లా ప్రజలకు ఊరటనిస్తున్నారు. కరోనా కట్టడికి ఆయన తీసుకున్న చర్యలపై కేంద్రం సైతం సలామ్ కొట్టింది. అంతేకాదు ఆయన్ను ప్రశంసించింది. ఇంతకీ ఆయనెవరో తెలుసా..? ఇంకెవరు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.

గంధం చంద్రుడిపై కేంద్రం ప్రశంసలు

గంధం చంద్రుడిపై కేంద్రం ప్రశంసలు

గంధం చంద్రుడు అనంతపురం జిల్లా కలెక్టర్. కరువు జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచే జిల్లాలో ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తూ మంచి గుర్తింపు పొందారు. అంతేకాదు ప్రజల సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మంచి కలెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గంధం చంద్రుడిని పలుమార్లు ప్రశంసించింది. తాజాగా అనంతపురం జిల్లాలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ గంధం చంద్రుడు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం నజర్ వేసింది. కరోనా కట్టడికి చంద్రుడు అమలు చేస్తున్న చర్యలు భేష్ అని కొనియాడింది కేంద్రం. ఈ మేరకు ట్వీట్ చేసింది.

కరోనా బాధితులకు గేమ్స్

కరోనా బాధితులకు గేమ్స్

కరోనావైరస్ సెంటర్లలో బాధితులు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారని తెలుసుకున్న కలెక్టర్ గంధం చంద్రుడు వీరికోసం మంచి ఆలోచన చేశారు. మానసికంగా ఉల్లాసంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటే పేషెంట్లలో ఒంటరితనం అనేది దూరం అవుతుందని భావించిన కలెక్టర్ చంద్రుడు... ఒక మ్యాజిక్ సిస్టంను కోవిడ్ కేర్ సెంటర్లలో అమర్చారు. మంచి సంగీతం వింటూ పేషెంట్లు ఒంటరి తనాన్ని మర్చి పోతున్నారు. అంతేకాదు టెన్నిస్, షటల్, వాలీబాల్, క్యారమ్స్‌లాంటి ఇండోర్ గేమ్స్‌ను కూడా కోవిడ్ సెంటర్లలో పరిచయం చేశారు. ఇష్టమున్న వారు ఇష్టమొచ్చిన గేమ్స్ ఉదయం సాయంత్రం ఆడేలా వీలు కల్పించారు. అంతేకాదు కరోనావపేషెంట్లలో కాన్ఫిడెన్స్ నింపేలా కౌన్సిలర్లను సైతం ఏర్పాటు చేశారు.

Recommended Video

#AmitabhBachchan : కరోనా నుంచి కోలుకున్న Amitabh Bachchan! || Oneindia Telugu
గేమ్స్‌తో త్వరగా కోలుకునే అవకాశం

గేమ్స్‌తో త్వరగా కోలుకునే అవకాశం

పేషెంట్స్‌ను ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేందుకు కలెక్టర్ తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి గేమ్స్ మ్యూజిక్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కరోనా బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని కేంద్రం పేర్కొంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు కరోనా వైరస్ పాజిటివ్స్ అని వారిని పిలవాలని.. పేషెంట్లు అని పిలవకూడదని కలెక్టర్ చాలా గొప్పగా చెప్పడాన్ని కేంద్రం కొనియాడింది. మొత్తానికి ఇటు అనంత ప్రజల మన్నన పొందిన కలెక్టర్ గంధం చంద్రుడిని కేంద్రం కూడా గుర్తించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Centre had lauded the actions taken by Anantapur district Collector Gandham Chandrudu to contain the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X