వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యసేతు యాప్ వాడాల్సిందే.. ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు....

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల భద్రతతో పాటు కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఆరోగ్యసేతు యాప్ ను విస్తృతంగా ఉపయోగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ప్రతీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ యాప్ ను తమ సెల్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవడమే కాకుండా ప్రతీ రోజూ విధుల్లోకి వచ్చేముందు తప్పనిసరిగా పరీక్షించుకోవాలని కేంద్రం సూచించింది.

centre made complusory usage of arogya sethu app to all employees

ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఉద్యోగి తన తాజా వివరాలు నమోదు చేశాక యాప్ లో సురక్షితమని సూచిస్తేనే విధులకు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవాలి. యాప్ వాడుతున్నప్పుడు తమ ఇళ్లకు సమీపంలో ఎవరైనా కరోనా రోగులు ఉంటే యాప్ లో వాటి వివరాలు ప్రత్యక్షమవుతాయి. వీటి ఆధారంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైతే తాము కూడా క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం దీన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య సేతు యాప్ ను ఉద్యోగులకు తప్పనిసరి చేశాయి.

English summary
in wake of latest coronavirus outbreak centre has made compulsory usage of arogya sethu app for its employees across the country. centre says that every employee should test through this app before starting their duties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X