• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మోడీ విశాఖ పర్యటనకు ముందే ఏపీకి పెద్ద శుభవార్త!: రైల్వే జోన్ ఇచ్చినా.. ఆప్షన్స్ చూస్తున్న బాబు

|

విశాఖపట్నం: త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 1వ తేదీన ఆయన విశాఖపట్నానికి రానున్నారు. 2014లో విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి పలు హామీలు ఇచ్చింది. ఆ హామీలను ఒక్కటొక్కటి మోడీ ప్రభుత్వం నెరవేర్చుతోంది. హామీల అమలుకు పదేళ్ల సమయం ఉన్నప్పటికీ ఈ అయిదేళ్లలోనే ఎన్నో పనులు చేశామని బీజేపీ చెబుతోంది. అయితే ప్రత్యేక హోదా అంశం ఏపీలో కీలకంగా మారింది. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికి దానికి మించి నిధులు ఇచ్చామని కేంద్రం చెప్పింది.

మోడీ పర్యటనకు ముందే ఏపీకి శుభవార్త

మోడీ పర్యటనకు ముందే ఏపీకి శుభవార్త

తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు ముందు కేంద్రం ఏపీకి మరో శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ఇటీవల గుంటూరులో పర్యటించిన ప్రధాని అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇప్పుడు మరో శుభవార్త వెలువడనుందని తెలుస్తోంది. అయితే మోడీ పర్యటనకు ముందే ఆ శుభవార్త ఉంటుందా లేక తన విశాఖ సభలోనే మోడీ ప్రకటన చేస్తారా తెలియాల్సి ఉంది.

విష్ణు కుమార్ రాజు ఏం చెప్పారంటే

విష్ణు కుమార్ రాజు ఏం చెప్పారంటే

ఈ సందర్భంగా బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆదివారం మాట్లాడారు. తాము (బీజేపీ నేతలు) రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిశామని చెప్పారు. ఏపీలో ప్రధాని మోడీ సభ కంటే ముందే రైల్వే జోన్ పైన ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. రైల్వే జోన్ ఇచ్చేది తామే, తెచ్చేది తామే అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కేంద్రం రైల్వే జోన్ ప్రకటిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మోడీని నిలదీసేందుకు దారులు వెతుకుతున్న టీడీపీ

మోడీని నిలదీసేందుకు దారులు వెతుకుతున్న టీడీపీ

ఈ నేపథ్యంలో మోడీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ ఆప్షన్స్ వెతుక్కుంటోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి గంటాలు ఆ దిశగా హింట్ ఇచ్చారు. మోడీ విశాఖ సభలో రైల్వే జోన్ గురించి ఆందోళనలు ఉంటాయని భావించారు. కానీ రైల్వే జోన్ ప్రకటిస్తే కనుక ఇతర అంశాలపై దృష్టి సారించాలని, వాటిపై నిలదీయాలని చంద్రబాబు సూచనలు చేస్తున్నారు. మార్చి 1వ తేదీన విశాఖలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరం ట్రైబల్ యూనివర్సిటీ ఏం చేశారో చెప్పాలని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. విశాఖకు మెట్రో రైల్ ఎందుకు ఇవ్వలేదో అడగాలన్నారు. రూ.350 కోట్లు ఎందుకు వెనక్కి తీసుకు వెళ్లారో నిలదీయాలన్నారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఏం చేశారో అడగాలన్నారు. హుధుద్ తుఫానుకు రూ.1000 కోట్లు ఏవో అడగాలన్నారు.

రైల్వే జోన్ ఇచ్చినా నిరసనలు

రైల్వే జోన్ ఇచ్చినా నిరసనలు

ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో నిరసన సెగలు తప్పవని మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా అన్నారు. ప్రధాని విశాఖ సభలో రైల్వే జోన్ ప్రకటించినా నిరసనలు తప్పవని చెప్పారు. ప్రధాని పేరు ఉచ్చరించడానికే జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ జోస్యం ఫలించదని, మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Narendra Modi is likely to give a green signal to the Vishakhapatnam railway zone during his visit to the city on March 1. There have been indications to this effect as the BJP leaders have impressed upon the party high command to make the important announcement crucial to the existence of the party in Visakhapatnam and north Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more