• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేతాజీ మిస్టరీ: ఫైళ్లపై వెంకయ్య హర్షం, తెలియని వారి కోసం మరిన్ని విషయాలు

By Nageswara Rao
|

హైదరాబాద్: మమతా ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన 64 ఫైళ్లను బయటపెట్టడంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆ ఫైళ్లలో ఉన్న సమాచారాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు.

నేతాజీ జీవిత విశేషాలు, మరణంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న నేతాజీ పైళ్లను కూడా బయటపెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. అంతకంటే ముందుగా ఫైళ్లలో ఏముందో పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

బ్రిటిష్ పాలకులను ఎదురించి, వారిపై పోరాడేందుకు ఓ ప్రత్యేక సైన్యాన్ని సుభాష్ చంద్రబోస్ సృష్టించాడని చిన్నప్పుడు మనందరం చదుకున్నాం. భారతదేశ స్వాతంత్ర్యాన్ని చూడకుండానే ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చరిత్ర చెబుతోంది.

అయితే ఆయన మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి 64 రహస్య పత్రాలను విడుదల చేసింది. నేతాజీ గురుంచి మనకు తెలియని కొన్ని నిజాలు.

Centre needs to tread cautiously on Netaji files: Venkaiah Naidu

* నేతాజీ మరణం భారతదేశ చరిత్రలోనే ఓ పెద్ద మిస్టరీ.
* నేతాజీ మరణానికి సంబంధించి 64 ఫైళ్లను బెంగాల్ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఇంకా 130 ఫైళ్లు కేంద్రం వద్ద ఉన్నాయి.
* నేతాజీ 1945లో అదృశ్యమయ్యారు.
* అంతకుముందు కాంగ్రెస్‌కు రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆపై జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీలతో అభిప్రాయభేదాలు వచ్చి దూరమయ్యారు.
* స్వాతంత్యం కోసం 'ఇండియన్ నేషనల్ ఆర్మీ'ని ప్రారంభించారు.
* స్వాతంత్య ఉద్యమంలో బ్రిటీష్ వారు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు.
* 1941 ప్రాంతంలో ఆయన బ్రిటిష్ సైనికుల నుంచి మారువేషంలో తప్పించుకుని పెషావర్, ఆఫ్గనిస్థాన్, రష్యాల మీదుగా జర్మనీ వెళ్లారు.
* ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆగస్టు 18, 1945న కూలిపోయి, తీవ్ర గాయాలతో మరణించారని చెప్పగా, దీన్ని ఆయన అనుయాయులు, బంధువులు ఎవరూ నమ్మలేదు.
* నేతాజీ కుటుంబీకులపై నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో పూర్తి నిఘా కొనసాగింది.
* నేతాజీ బతికే ఉన్నాడని నెహ్రూ నమ్మబట్టే, తమపై దీర్ఘకాలంపాటు నిఘా ఉంచారన్నది ఆయన బంధువుల ప్రధాన ఆరోపణ.
* నిన్న బహిర్గతమైన 64 సీక్రెట్ ఫైళ్లలో నెహ్రూ ప్రభుత్వం ఉంచిన నిఘాకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.
* నేతాజీ అదృశ్యమైన తరువాత ఎంతో కాలంపాటు ఆయన బతికే వున్నారని బంధువులు వాదిస్తున్నారు.
* ఓ ఆధ్యాత్మిక గురువుగా 'గున్మామీ' పేరిట ఆయన ఫరీదాబాద్ లో ఉన్నారని, 1980లో మరణించారని ఓ వాదన వినిపిస్తుంటుంది.
* ఆయన తిరిగి వస్తే తొలి ప్రతీకారం నెహ్రూపైనే తీర్చుకుంటాడని ఆయన బంధువులు భావిస్తుండేవారు.
* ఈ విషయాలు కేంద్రం వద్ద ఉన్న ఫైళ్లలో ఉండటంతోనే 50 ఏళ్లకు పైగా సాగిన పాలనలో నేతాజీకి సంబంధించిన ఒక్క రహస్యమూ బయటకు రాలేదు.
* ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించగానే రహస్య ఫైళ్లు కదలడం గమనార్హం.

English summary
The Centre will take a decision on declassification of files related to Netaji Subhash Chandra Bose only after studying its impact on India’s relations with other countries, Union Minister M Venkaiah Naidu said in Hyderabad on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X