అమరావతికి కేంద్రం భారీ ఊరట-నిర్మాణానికి నిధులు కేటాయింపు- మూడు రాజధానుల వేళ
ఏపీలో అమరావతి రాజధాని స్ధానంలో నూడు రాజధానుల నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడిన వైసీపీ ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇప్పటికే అమరావతిలో పెట్టిన ఖర్చు వృథా అవుతుందని భావిస్తున్న తరుణంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం తాజా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతికి భారీ ఊరట
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అమరావతి రాజధాని నిర్మాణం వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక ఆగిపోయింది. ఆ తర్వాత మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. దీంతో పేరుకి రాజధానిగా ఉన్నా అమరావతిలో అభివృద్ధి ఆగిపోయినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న సాయం మేరకు అమరావతికి నిధులు కేటాయిస్తూ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి ఊపిరి పీల్చుకుంటోంది.

అమరావతికి నిధుల కేటాయింపులు
అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ దానికి అవసరమైన నిధుల్ని విడుదల చేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022-23లో రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులు కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం ఎంతెంత నిధులు ఇస్తున్నారో కూడా పేర్కొన్నారు. దీంతో ఈ నిధుల్ని ఏపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ లో పేర్కొన్న ప్రకారం ఈ నిధులు విడుదల కావాల్సి ఉంటుంది.

అమరావతిలో దేనికి ఎంతెంత ?
అమరావతి
రాజధానిలో
నిర్మాణాల
కోసం
ఈ
బడ్జెట్
లో
కేంద్రం
ఇచ్చిన
నిధుల
వివరాలు
ఆసక్తికరంగా
ఉన్నాయి.
కొత్త
సచివాలయం
నిర్మాణం
కోసం
రూ.1224
కోట్లు,
ప్రభుత్వ
ఉద్యోగుల
ఇళ్ల
నిర్మాణం
కోసం
రూ.1123
కోట్లు,
జీపీవోఏకు
భూసేకరణ
కోసం
రూ.6.69
కోట్లు
కేటాయిస్తూ
కేంద్రం
నిర్ణయం
తీసుకుంది.
దీంతో
ఈ
మేరకు
నిధులు
విడుదల
కావాల్సి
ఉంది.
ఇప్పటికే
అమరావతి
నుంచి
సచివాలయం
తరలింపు
కోసం
ఏపీ
ప్రభుత్వం
నిర్ణయం
తీసుకున్న
నేపథ్యంలో
ఈ
నిధుల్ని
దేనికి
వాడతారన్న
దానిపై
ఉత్కంఠ
నెలకొంది.

మూడు రాజధానుల వేళ కేంద్రం సంచలనం
ఏపీలో
మూడు
రాజధానుల
ఏర్పాటు
కోసం
వైసీపీ
ప్రభుత్వం
ప్రయత్నాలు
చేస్తోంది.
ఈ
మేరకు
కేంద్రానికి
కూడా
సీఎం
జగన్
ఎప్పటికప్పుడు
సమాచారం
కూడా
ఇస్తున్నారు.
మూడు
రాజధానులకు
మద్దతివ్వాలని
జగన్
కోరుతున్నారు.
అలాగే
నిధుల
కేటాయింపు
కోసం
ఇప్పటికే
వినతులు
కూడా
ఇచ్చారు.
అయితే
హైకోర్టులో
విచారణ
నేపథ్యంలో
ప్రభుత్వం
మూడు
రాజధానుల
బిల్లులు
వెనక్కి
తీసుకుంది.
ఇలాంటి
తరుణంలో
కేంద్రం
తీసుకున్న
నిర్ణయం
ఆసక్తి
రేపుతోంది.
గతంలో
రాజధానుల
ఏర్పాటు
రాష్ట్ర
ప్రభుత్వం
చేతుల్లోనే
ఉందంటూ
పలుమార్లు
చెప్పిన
కేంద్రం.
అమరావతికి
నిధుల
కేటాయింపుతో
ఏం
సందేశం
పంపిందన్న
చర్చ
జరుగుతోంది.