వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వైన్ ఫ్లూ: గాంధీలో విదేశీ మహిళ మృతి, బులెటిన్ విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. హైదరాబుదోలని గాంధీ ఆసుపత్రిలో బుధవారం ఓ మహిళ స్వైన్ ఫ్లూతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆమె జింబాబ్వే దేశానికి చెందిన మహిళ (36). చిత్తూరు జిల్లా పలమనేరులో తల్లీకూతుళ్లకు స్వైన్ ఫ్లూ రావడంతో వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు.

Centre reviews swine flu control measures

స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

స్వైన్‌ఫ్లూతో ఒక మహిళ మృతి చెందింది. నగరంలోని కాటేదాన్ శ్రీరాంనగర్‌కు చెందిన మహిళ సంతోష్‌ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ రోజు ఉదయం గాంధీ ఆస్పత్రిలో ఎనిమిది నెలల బాలుడు కూడా స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన విషయం తెలిసిందే.

స్వైన్ ఫ్లూ పైన తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 2047 మందికి పరీక్షలు నిర్వహించగా 686 మంది స్వైన్ ఫ్లూ బారినపడ్డారు. మంగళవారం నాడు 71 మందికి పరీక్షలు చేయగా 18 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు 36 మందికి వరకు మరణించారు.

స్వైన్‌ఫ్లూ వార్డును పరిశీలించిన మంత్రి పరిటాల సునీత

అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వార్డును మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. రోగులతో మాట్లాడి చికిత్స గురించి ఆరా తీశారు. ప్రస్తుతం అనంతపురం ఆస్పత్రిలో ఇద్దరు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ప్లూ వల్ల ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, మందులు లభిస్తున్నాయని మంత్రి పరిటాల సునీత చెప్పారు. వ్యాధి పట్ల ప్రజలు భయవడాల్సిన అవసరం లేదన్నారు. కాగా, స్వైన్ ఫ్లూ పైన కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.

English summary
The Centre on Tuesday reviewed the steps being taken by States to control and treat H1N1 (swine flu) cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X