వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ హైదరాబాద్‌తో సహా ఎన్నో ఆస్తులను కోల్పోయింది: ఆజాద్

|
Google Oneindia TeluguNews

Recommended Video

బిజేపి చేసిన హామీలను తుంగలో తొక్కింది: ఆజాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైదరాబాద్‌తో సహా ఎన్నో కోల్పోయిందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై రాజ్యసభలో చర్చించారు. కొత్తగా ఏర్పడిన ఏపీ రాష్ట్రంపై సానుకూలంగా వ్యవహరించాలని ఆజాద్ ప్రభుత్వాన్ని కోరారు. తనకు ఆంధ్రప్రదేశ్‌తో మంచి అనుబంధం ఉందని సభకు గుర్తు చేశారు. చర్చసందర్భంగా మాట్లాడిన ఆజాద్... హైదరాబాద్‌తో పాటు ఏపీ ఎన్నో ఆస్తులను కోల్పోయిందని చెప్పారు. రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు ఆజాద్. ఆనాడు ఏపీకి పదేళ్లపాటు హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ ఇప్పుడు ఆ ప్రస్తావనే మరిచిందని విమర్శించారు.

Centre should act in favor of AP,says Azad

1953లో మద్రాసు రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయి కర్నూలు రాజధానిగా కొత్త రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసిన ఆజాద్... మరోసారి పునర్విభజనకు గురైందన్నారు. విభజనతో ఏపీ ప్రధాన వనరులను కోల్పోయిందని ఆ లోటును పూడ్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ విభజన పూర్తయి నాలుగేళ్లు సమయం కావొస్తున్నప్పటికీ రెండు శాతం నిధులు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని కేంద్రంపై నిప్పులు చెరిగారు ఆజాద్. రెవిన్యూ లోటు కూడా కేవలం రూ.400 కోట్లు మాత్రమే చెల్లించారని ఫైర్ అయ్యారు. కేంద్రం ముష్టి వేసినట్లు నిధులు విడుదల చేస్తోందని దుయ్యబట్టిన ఆజాద్.. ఆ నిధులు ఏ మూలకు సరిపోవని మండిపడ్డారు.

English summary
The AP state has lost everything on all fronts said congress MP Gulam Nabi Azad. Azad who participated in the debate on AP reorganisation act, the Kashmir MP said that its time for the central govt to act in favour of Andhra Pradesh. He also said that the centre had failed in allocating funds to the state of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X