వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుహ్యంగా రాజకీయాల్లోకి కాలువ శ్రీనివాసులు: బోయలను ఎస్టీల్లో చేర్చడం వెనుక కీలకపాత్ర

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి అనుహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో కాలువ శ్రీనివాసులు అనుహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు.బోయలను ఎస్‌టీలలో చేర్చే విషయమై అసెంబ్లీ తీర్మాణం చేయడంతో జీవితంలో తీరని కోరిక నెరవేరిందని కాలువ శ్రీనివాసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తీర్మాణాన్ని కాలువ శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి 2014 ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులు పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి కాలువ శ్రీనివాసులు విజయం సాధించారు.

రాజకీయాల్లోకి అనుహ్యంగా వచ్చిన కాలువ శ్రీనివాసులు బోయలను ఎస్టీలో చేర్చే విషయంలో కీలకంగా వ్యవహరించారు. మరో వైపు సాగు నీటి సౌకర్యాన్ని కల్పించే విషయమై కాలువ శ్రీనివాసులు ప్లాన్ చేస్తున్నారు.

చంద్రబాబుకు నమ్మిన వ్యక్తి, అదృష్టం వెతుక్కొంటూ వస్తోంది, ఎవరా మంత్రి?చంద్రబాబుకు నమ్మిన వ్యక్తి, అదృష్టం వెతుక్కొంటూ వస్తోంది, ఎవరా మంత్రి?

అనుహ్యంగా రాజకీయాల్లోకి కాలువ శ్రీనివాసులు

అనుహ్యంగా రాజకీయాల్లోకి కాలువ శ్రీనివాసులు

అనంతపురం జిల్లాలో ప్రముఖ దినపత్రికలో కాలువ శ్రీనివాసులు పనిచేస్తున్న సమయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నుండి ఓ రోజు ఒక ఫోన్ వచ్చింది.అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఆ ఫోన్ సారాంశం.1998-99 కాలంలో ఈ ఫోన్ వచ్చింది. అయితే తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలని కాలువ శ్రీనివాసులు చంద్రబాబునాయుడును కోరారు. రెండు రోజుల తర్వాత కాలువ శ్రీనివాసులు పోటీకి ఓకె చెప్పారు. టిడిపిలో చేరి అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు.రాజకీయాల్లోకి చేరడమే కాదు అనంతపురం ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అసెంబ్లీకి తొలిసారిగా కాలువ శ్రీనివాసులు

అసెంబ్లీకి తొలిసారిగా కాలువ శ్రీనివాసులు

ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేస్తున్న కాలువ శ్రీనివాసులు తొలిసారిగా 2014 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. బోయలు అత్యధికంగా ఉన్న రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశారు. అయితే ఈ స్థానంలో దీపక్ రెడ్డి పోటీ చేస్తారని భావించారు.అయితే దీపక్‌రెడ్డిని కాదని చంద్రబాబునాయుడు కాలువ శ్రీనివాసులుకు టిక్కెట్టును కేటాయించారు. ఈ స్థానంలో కాలువ శ్రీనివాసులు విజయం సాధించారు.చంద్రబాబునాయుడు తొలుత కాలువ శ్రీనివాసులుకు చీప్ పదవిని కట్టబెట్టారు. పల్లె రఘునాథ‌రెడ్డిని మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత కాలువ శ్రీనివాసులను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.

బోయలను ఎస్టీలో చేర్చడం కాలువ శ్రీనివాసులు ఆశయం

బోయలను ఎస్టీలో చేర్చడం కాలువ శ్రీనివాసులు ఆశయం

బోయలను ఎస్టీల జాబితాలో చేర్చాలనేది మంత్రి కాలువ శ్రీనివాసులు ఆశయం. టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేసే సమయంలో ఎస్టీల జాబితాలో బోయలను చేర్చాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ అంశాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు కాలువ శ్రీనివాసులు.విద్య..వైద్య...ఉపాధి సౌకర్యాలు లేక అల్లాడిపోతున్న బోయలను ఎస్‌టీలలో చేర్పించాలనేది తన రాజకీయ జీవితంలో పెద్ద కల అని చంద్రబాబుతో చెప్పుకున్నారు. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు బోయలను షెడ్యూల్‌ తెగలలో చేర్పిస్తానని తెలుగుదేశంపార్టీ మ్యానిఫెస్టోలో పెట్టారు.

అసెంబ్లీలో తీర్మాణం పెట్టిన కాలువ శ్రీనివాసులు

అసెంబ్లీలో తీర్మాణం పెట్టిన కాలువ శ్రీనివాసులు


ప్రత్యేక క్యాబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. మంత్రిమండలి ఆమోదం తర్వాత అసెంబ్లీ తీర్మానం అవసరం లేకపోయినప్పటికీ ...ప్రవేశపెడితే అందరికీ తెలుస్తుందని..ఇచ్చిన హామీ నెరవేర్చినట్టు అవుతుందని మంత్రివర్గంలో కాలువ శ్రీనివాసులు చెప్పారు. అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని తానే ప్రవేశపెడతానని చంద్రబాబు చెప్పి...ఆ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపచేశారు. వెను వెంటనే ముఖ్యమంత్రి చాంబర్‌కు వెళ్లారు కాలువ శ్రీనివాసులు.. తన కల నెరవేరిందని ముఖ్యమంత్రికి ఆనందంగా చెప్పారు.

 బైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం

బైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం

గమ్మగట్టు మండలం భైరవాని తిప్ప ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేసి.. ఆ మండలాన్ని సస్యశ్యామలం చేయాలనేది మంత్రి కాలువ శ్రీనివాసులు ప్లాన్ చేస్తున్నారు.గత ఏడాది ఆగస్టు 30న చంద్రబాబు రాయదుర్గం వెళ్లారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టు ద్వారా 11 నెలలలో నీరు ఇస్తామని ప్రకటించారు. సాంకేతిక ఇబ్బందులతో అది సాధ్యం కాలేదు. అదృష్టం కలిసి వచ్చి ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి.. ఆ ప్రాజెక్టు నిండింది. వేదవతి నదిపై యాభై ఏళ్ల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు కేవలం మూడుసార్లు మాత్రమే నిండింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు నుంచి శనివారం నీరు విడుదల చేశారు. వచ్చే ఏడాదికి హంద్రీనీవా నుంచి నీరు తీసుకువచ్చి ఈ ప్రాజెక్టును నింపుతామని మంత్రి చెబుతున్నారు.

English summary
Andhra Pradesh Assembly unanimously passed a resolution requesting the Union government to include Valmiki Boya community in the category of scheduled tribes (STs). Introducing the resolution in the House on Saturday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X