వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో విశాఖ రైల్వే జోన్‌కు పచ్చజెండా, ఇన్నాళ్లు టీడీపీయే అడ్డుకుంది: విష్ణు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కడపకు ఉక్కు పరిశ్రమ, విశాఖపట్నంకు రైల్వే జోన్ రాకుండా అడ్డుకున్నది టీడీపీయేనని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ బుధవారం మండిపడ్డారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశం కోసం వారు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం చెప్పినా ఏపీ ప్రభుత్వం కార్పోరేషన్ ప్రారంభించకుండా ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోను రాకుండా అడ్డుకునేది టీడీపీయే అన్నారు. నాలుగు డివిజన్లు కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని, దీనిపై కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, రాష్ట్రం కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టు మొత్తం తామే పూర్తి చేస్తామని చంద్రబాబు గొప్పలకు పోవడం విడ్డూరమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తుందన్నారు.

ఆస్తులు పెంచేందుకే లీజుకు, చందన బ్రదర్స్ ఒప్పందం రద్దు: జలీల్ ఖాన్ఆస్తులు పెంచేందుకే లీజుకు, చందన బ్రదర్స్ ఒప్పందం రద్దు: జలీల్ ఖాన్

visakhapatnam railway station

సర్పంచ్‌ల చెక్ పవర్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. సొంత పార్టీ సర్పంచ్‌లో ముఖ్యమంత్రిపై తిరగబడ్డారన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన సరికాదన్నారు. అభివృద్ధిని నిరోధించే ప్రయత్నమే ప్రత్యేక ఆఫీసర్ల పాలన అని విమర్శించారు.

నరేగా చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం చేసిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని తాము కోరామన్నారు. విచారణ పూర్తయితే లోకేష్‌కు వచ్చిన అవార్డులు వెనక్కి తీసుకునే పరిస్థితి అన్నారు. కాపు రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు ఎవరినీ సంప్రదించకుండా 9 నెలలుగా ఆరాటం, పోరాటం అంటున్నారని ఎద్దేవా చేశారు.

English summary
Andhra BJP leader and MLA Vishnu Kumar Raju exuded confidence that the BJP led NDA will announce new Railway zone in Visakhapatnam soon. The BJP delegation led by Raju called on Railway Minister Piyush Goyal and submitted memorandum requesting the minister to fulfill the promise of granting railway zone for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X