వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్స్ రీ ఓపెనింగ్ పై రాష్ట్రాలకు కేంద్రం ట్విస్ట్- ఆ సర్వే తర్వాతే నిర్ణయం...

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభంపై పలు రాష్ట్రాలు తమ నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. ఏపీలోనూ జగన్ సర్కార్ సెప్టెంబర్ 5 నుంచి ఎట్టి పరిస్దితుల్లోనూ పాఠశాలలు ప్రారంబించేందుకు సిద్దమవుతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఎవరికి వారు తేదీలు ప్రకటిస్తున్నారు. అయితే ఇదంతా సాధ్యమయ్యే పనేనా అంటే మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. ఇవన్నీ గమనించే ఈ నెల 19వ తేదిన ఒక్క రోజు గడువుతో తల్లితండ్రుల అభిప్రాయాలు తీసుకుని చెప్పాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే ఒక్కరోజు సరిపోదని, మరింత గడువు కావాలని రాష్ట్రాలు కోరాయి.

అయోధ్యలో మందిర నిర్మాణంతో కరోనా వైరస్ నిర్మూలన: బీజేపీ ఎంపీ మీనా సంచలన వ్యాఖ్యలు..అయోధ్యలో మందిర నిర్మాణంతో కరోనా వైరస్ నిర్మూలన: బీజేపీ ఎంపీ మీనా సంచలన వ్యాఖ్యలు..

 స్కూల్స్ రీ ఓపెనింగ్ పై కేంద్రం ట్విస్ట్...

స్కూల్స్ రీ ఓపెనింగ్ పై కేంద్రం ట్విస్ట్...

కరోనా వైరస్ ప్రభావం మరో నెల నుంచి రెండు నెలల్లో తగ్గిపోతుందని అంచనా వేస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను పునః ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఈ మేరకు సన్నద్ధం చేస్తున్నాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా రాష్ట్రాలు పాఠశాలల పునః ప్రారంభ తేదీలను కూడా ప్రకటించేశాయి. అయితే ఇవన్నీ అమలవుతాయా అంటే నో అంటోంది కేంద్రం. విద్యార్దుల తల్లితండ్రుల్లో భయాందోళనలు నెలకొన్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను కేంద్రం తప్పుబడుతోంది.

 వారి అభిప్రాయం తప్పనిసరి..

వారి అభిప్రాయం తప్పనిసరి..

దేశవ్యాప్తంగా స్కూళ్ల రీఓపెనింగ్ విషయంలో విద్యార్ధుల తల్లితండ్రులకు తీవ్ర భయాందోళనలు ఉన్నాయి. చాలా చోట్ల ఈ ఏడాది స్కూళ్లు తెరవడం సరికాదని తల్లితండ్రులు అభిప్రాయపడుతున్నారు. కరోనా పూర్తిగా తగ్గే వరకూ స్కూళ్లు తెరిచినా తమ పిల్లలను పంపబోమని తల్లితండ్రులు కుండబద్దలు కొడుతున్నారు. అయితే రాష్ట్రాలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాయి. ఈ పరిస్దితుల్లో రాష్ట్రాలకు కేంద్రం తమ నిర్ణయంతో షాకిచ్చింది. విద్యాసంస్ధలు ఎప్పుడు తెరవాలన్న దానిపై తల్లితండ్రులతో సర్వే నిర్వహించాల్సి తీరాల్సిందేనని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా తేల్చిచెప్పింది. దీంతో చేసేది లేక ప్రభుత్వాలు సర్వేలకు రంగం సిద్దం చేస్తున్నాయి.

Recommended Video

Nirav Modi Assets Seized : నీరవ్‌ మోదీ ఆస్తులు జప్తు చేసిన ED || Oneindia Telugu
 మూడు అంశాలపై సర్వే...

మూడు అంశాలపై సర్వే...

విద్యాసంస్ధల పునః ప్రారంభంపై తల్లితండ్రుల నుంచి మూడు అంశాలపై అభిప్రాయ సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆన్ లైన్లో సర్వే ఫార్మాట్ కూడా పంపింది. ఇందులో ప్రధానంగా మూడు ప్రశ్నలున్నాయి. విద్యాసంస్ధలు తెరవాలా వద్దా, తెరిస్తే ఎప్పుడు, అసలు స్కూళ్లు తెరవకూడదా, ఒకవేళ స్కూళ్లు తెరిస్తే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనే అంశాలపై సర్వే ఫార్మాట్ సిద్ధం చేశారు. త్వరలో విద్యార్ధుల తల్లితండ్రులకు వివిధ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్, సోషల్ మీడియా ద్వారా ఈ సర్వేను పంపి అభిప్రాయాలు తీసుకుంటారు. వీటి ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెబుతోంది.

English summary
after several state governments announced to re open the schools in next three months, central government would like to take final decision after taking parents opinion on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X