వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీకి అక్క‌డ ఒక్క ఓటు..మ‌రో చోట రెండు ఓట్లు: టీడీపీ రిగ్గింగ్ ఎఫెక్టేనా : వెలుగులోకి సంచ‌ల‌నాలు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ పైన ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం చెల‌రేగుతోంది. తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు తెచ్చింది. అక్క‌డ రిగ్గింగ్ జ‌రిగింద‌ని..అందుకే రీపోలింగ్‌కు ఆదేశించామ‌ని సీఈవో స్ప‌ష్టం చేసారు. అయితే, అక్క‌డ ప్ర‌తీ సారి జరిగేదేంటి...

 చంద్ర‌గిరిలో ప్ర‌జాస్వామ్యం ఉందా..

చంద్ర‌గిరిలో ప్ర‌జాస్వామ్యం ఉందా..

చంద్ర‌గిరిలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఏక‌ప‌క్షంగా రీ పోలింగ్ ఎలా నిర్ణ‌యం తీసుకుంటారంటూ టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. ఎన్నిక‌ల సంఘం పైనా ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో..రాష్ట్ర ఎన్నికల ప్ర‌ధానాధికారి ద్వివేదీ..సీఎస్ అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ద‌ళితుల‌ను ఓట్లు వేయ‌నీయ‌లేద‌నే ఫిర్యాదును సీఈఓను పంపామ‌ని సీఎస్ స్ప‌ష్టం చేసారు. ఇక‌, సీఈఓ ద్వివేదీ చంద్ర‌గిరిలో రీపోలంగ్ కార‌ణాలు చెబుతూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. అస‌లు ప్ర‌జాస్వామ్యంలో ఇలా జ‌రుగుతుందా అని ప్ర‌శ్నించారు. ద‌ళితుల‌ను పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయ‌నీయ‌కుంగా రిగ్గింగ్‌కు పాల్ప‌డ్డార‌ని..వీడియో ఫుటేజ్‌లో స్ప‌ష్టంగా ఉంద‌ని వివ‌రించారు. అందుకు అక్క‌డ స‌హ‌క‌రించిన అధికారుల మీద కేసుల న‌మోదుకు అదేశించారు.

వైసీపీకి ఒక్క ఓటు..మ‌రో చోట రెండు ఓట్లు

వైసీపీకి ఒక్క ఓటు..మ‌రో చోట రెండు ఓట్లు

చంద్ర‌గిరిలో ఇప్పుడు రీ పోలింగ్‌కు ఆదేశించిన అయిదు కేంద్రాల్లో 2014లో సైతం టీడీపీకి అధిక్య‌త వ‌చ్చింది. అయితే సాధార‌ణంగా వ‌చ్చిన మెజార్టీ అయితే ఇబ్బంది లేదు. న‌మ్మ‌శ‌క్యం కాని విధంగా అక్క‌డ వైసీపీకి ఓట్లు రావ‌టం తో పార్టీ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇప్పుడు రీ పోలింగ్‌కు ఆదేశించిన వెంక‌టాపురంలోని 313వ పోలింగ్ బూత్‌లో
2014 ఎన్నిక‌ల్లో మొత్తం 320 ఓట్లు పోల‌వ్వ‌గా..అందులో టీడీపీకి 316 ఓట్లు రాగా, వైసీపీకి ఒక్క ఓటు వ‌చ్చింది. అదే విధంగా.. కొత్త‌కండ్రీగ‌లోని 316 పోలింగ్ కేంద్ర‌లో ఇప్పుడు రీ పోలింగ్ కు ఆదేశించారు. ఇదే కేంద్రంలో 2014లో మొత్తం గా 859 ఓట్లు పోల‌వ్వ‌గా అందులో టీడీపీకి 812 ఓట్లు రాగా, వైసీపీకి 33 ఓట్లు వ‌చ్చాయి. అదే విధంగా ఇప్పుడు రీ పోలింగ్ కు ఆదేశించిన క‌మ్మ‌ప‌ల్లి పోలింగ్ కేంద్రం 318 లో మొత్తం 931 ఓట్లు రాగా అందులో టీడీపీకి 741, వైసీపీకి 182 ఓట్లు వ‌చ్చాయి. రీ పోలింగ్‌కు ఆదేశించిన పోలింగ్ కేంద్రం అయిన ఎన్నార్ క‌మ్మ‌ప‌ల్లి పోలింగ్ కేంద్రం నెంబ‌ర్ 321లో 2014లో మొత్తం 626 ఓట్లు పోల‌వ్వ‌గా..అందులో టీడీపీకి 624 ఓట్లు అదే విధంగా వైసీపీకి రెండు ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. ఈ అయిదు కేంద్రాల్లో 2736 ఓట్లు పోల‌వ్వ‌గా అందులో టీడీపికి 2493, వైసీపీకి 218 ఓట్లు ద‌క్కాయి.

క‌లెక్ట‌ర్ మీద ఫిర్యాదు..

క‌లెక్ట‌ర్ మీద ఫిర్యాదు..

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఈ అయిదు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేత‌లు ద‌ళితుల‌ను ఓట్లు వేయ‌నీయ‌కండా రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్నారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. దీని పైన ప‌రిశీల‌న చేస్తే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీని పైన జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని వైసీపీ నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఇక‌, ఇప్పుడు రీ పోలింగ్‌లో ఇక్క‌డ ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారో..రెండు ద‌శాబ్దాలుగా ఈ కేంద్రాల్లో ఇదే విధంగా వ్య‌వ‌హారం సాగుతోంద‌ని వైసీపీ నేత‌లు ఫిర్యాదు చేసారు. ఎన్నిక‌ల సంఘం వీడియో ఫుటేజ్‌ను కోర్టుకు సైతం నివేదించాల‌ని నిర్ణ‌యించారు.

English summary
In Chandragiri constituency Election Commission ordered re polling in five polling booths. CEO confirmed Rigging in those five booths. In 2014 also same situation created in these five booths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X