• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో ప్రచారాలే టార్గెట్ .. చైన్ స్నాచర్ల హల్ చల్ .. కేఏ పాల్, షర్మిలకు కేటుగాళ్ళ షాక్

|
  Ap Assembly Election 2019 : కేఏ పాల్, షర్మిలకు కేటుగాళ్ళ షాక్ || Oneindia Telugu

  ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే సందట్లో సడేమియా అంటూ చైన్ స్నాచర్లు చేతివాటం చూపిస్తున్నారు. ఇక ఏకంగా ప్రచారం నిర్వహిస్తున్న నేతల సొమ్ములనే కాజేసేయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారంలో దొంగల చేతివాటం ప్రచార సభలకు వస్తున్న ప్రజలకు సైతం భయాందోళన కలిగిస్తోంది. దీంతో ప్రచారానికి వెళ్లాలంటే ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసి ఇంట్లో పెట్టుకుని వెళ్లాల్సిందేనన్న చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

  ప్రచారం లో దొంగల చేతివాటం .. నాయకులను వదలని స్నాచర్లు

  ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో ఇదే అదనుగా దొంగలు చేతి వాటం చూపిస్తున్నారు. నాయకుల ప్రచారానికి హాజరయ్యే జనం నగదు, నగలు దొచేస్తున్నారు. అంతేకాదు ఏకంగా నాయకుల సొమ్ములకే ఎసరు పెడుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీ ఎన్నికల ప్రచారంలో తనను గెలిపించండి సీఎం అవుతారన్న ప్రచారం చేసుకుంటున్న కెఎ పాల్ మెడలో చైన్ కొట్టేసారు చైన్ స్నాచర్లు. ఇక తాజాగా వైఎస్ షర్మిల రింగ్ కొట్టేసే ప్రయత్నం చేశారు.

  తానే సీఎం అని చెప్పుకునే కేఏ పాల్ చైన్ కొట్టేసిన కేటుగాళ్ళు

  తానే సీఎం అని చెప్పుకునే కేఏ పాల్ చైన్ కొట్టేసిన కేటుగాళ్ళు

  ఏపీలో ప్రధాన పార్టీల తో పాటుగా ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తాను ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎం అని ప్రచారం ముమ్మరం చేశారు..అయితే ప్రచారంలో భాగంగా కే ఏ పాల్ మీడియాతో మాట్లాడుతున్న తరుణంలో ఆయన మెడలో ఉన్న బంతిపూల దండలను తీసే టైంలో పాల్‌ చైన్ కూడా ఎవరో కొట్టేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పార్టీ అధినేత చైన్ మాయం చేసిన సంఘటన చైన్ స్నాచింగ్ ఎంతగా ఎన్నికల ప్రచారంలో జరుగుతుందో తెలియజేస్తుంది.

   ప్రచారంలో షర్మిల రింగ్ కాజేసే యత్నం .. సోషల్ మీడియా లో వైరల్

  ప్రచారంలో షర్మిల రింగ్ కాజేసే యత్నం .. సోషల్ మీడియా లో వైరల్

  ఇక తాజాగా వైసీపీ అధినేత, వైఎస్ జగన్ సోదరి షర్మిల గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కూడా దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించబోయారు. అభిమానులకు, కార్యకర్తలకు ఆమె బస్సులోంచి అభివాదం చేశారు . కొందరు ఆమెతో కరచాలనం కోసం ఎగబడ్డారు. ఆ సమయంలో

  అందరూ చూస్తుంగానే షర్మిల చేతి ఉంగరాన్ని లాగేందుకు దొంగలు యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆమె చేతిని వెనక్కి లాక్కున్నారు. ఆమె చేతి ఉంగరాన్ని లాగే యత్నం చేస్తున్న క్రమంలో ఆమె గట్టిగానే తన చెయ్యి వెనక్కు లాక్కున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

  జమ్మలమడుగులో వైయస్ భారతి ప్రచారం: చంద్రబాబును ప్రజలు ఛీదరించుకుంటున్నారు

  ప్రచారాల టార్గెట్ గా చైన్ స్నాచర్లు.. స్వీయ జాగ్రత్తలు అవసరం అంటున్న పోలీసులు

  ప్రచారాల టార్గెట్ గా చైన్ స్నాచర్లు.. స్వీయ జాగ్రత్తలు అవసరం అంటున్న పోలీసులు

  ఇక సభలలో, రోడ్ షోలలో ప్రచారం చేస్తున్న నాయకుల పరిస్థితే ఈ విధంగా ఉంటే సభలకు హాజరయ్యే ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా జేబులు కత్తిరించే వారు, చేతులకు మెడలో ఉన్న సొమ్ములు మాయం చేసే వారు ఏపీ లోని ఎన్నికల ప్రచారాలను టార్గెట్ గా చేసుకుని తిరుగుతున్నారు. సభలు , రోడ్ షో లలో పాల్గొనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. అయితే ఎక్కడా లేనివిధంగా ఏపీ ప్రచార సభల్లో నెలకొన్న దొంగల బెడద అటు నాయకులను, ఇటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  There are strange situations in the election campaign in AP. Prajashanti party president KA Paul Chain theft happened in the election campaign ,and now in the ycp campaign some of the chain snachers tried to theft sharmila's ring . Now the viedos are viral in social media . police alert the people to take care of the chain snachers in the election campaigns.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more