వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దమ్ముంటే ఏపీలో కేబినెట్ నుండి బిజెపి వైదొలగాలి',' బాబును విమర్శించడం మోసమే'

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: దమ్ముంటే ఏపీ మంత్రివర్గం నుండి బిజెపి మంత్రులు వైదొలగాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ బిజెపిని నేతలను డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రానికి బిజెపి తీవ్రమైన అన్యాయం చేస్తోందని చలసాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Recommended Video

BJP Leader Fires At TDP And Congress

ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఏపీకి అన్యాయం చేస్తోన్న బిజెపి నేతలు మాత్రం ఆ అన్యాయాన్ని సమర్ధిస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదానే సరైన సంజీవని అన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి మహరాష్ట్రలోని బుందేల్‌ఖండ్‌కు 20 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పోస్టర్‌ను అమరావతిలో శుక్రవారం నాడు ఆ సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విడుదల చేశారు.

బిజెపి మంత్రులు బాబు కేబినేట్ నుండి వైదొలగాలి

బిజెపి మంత్రులు బాబు కేబినేట్ నుండి వైదొలగాలి

దమ్ముంటే బిజెపి మంత్రులు చంద్రబాబునాయుడు కేబినేట్ నుండి వైదొలగాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

జగన్ కేంద్రానికి కోవర్ట్, సోము వీర్రాజు వైసీపీ ఏజంట్, రాష్ట్రాన్ని పడగొట్టాలని చూస్తున్నారు: బుద్దాజగన్ కేంద్రానికి కోవర్ట్, సోము వీర్రాజు వైసీపీ ఏజంట్, రాష్ట్రాన్ని పడగొట్టాలని చూస్తున్నారు: బుద్దా

బాబును విమర్శించడం మోసమే

బాబును విమర్శించడం మోసమే

ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించడమంటే ఒక రకంగా మోసం చేయడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రాం మాధవ్ చెప్పినట్టు రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

నాపై దాడులు చేసినా పట్టించుకోను, ఇది పద్దతికాదు: పవన్ కళ్యాణ్నాపై దాడులు చేసినా పట్టించుకోను, ఇది పద్దతికాదు: పవన్ కళ్యాణ్

న్యాయం చేయాలని కేంద్రాన్ని నిలదీస్తాం

న్యాయం చేయాలని కేంద్రాన్ని నిలదీస్తాం

ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు తోట నరసింహం చెప్పారు. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపైతే ఉప ఎన్నికలు రావన్నారు. అందుకే ఏప్రిల్‌లో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామంటున్నారని ఆయన విమర్శించారు. తాము పార్లమెంట్‌లో ఉండే పోరాటం చేస్తామని తోట నరసింహం వెల్లడించారు.

ప్రత్యేక హోదా ఎజెండా

ప్రత్యేక హోదా ఎజెండా

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను రాజకీయ పార్టీలు తెర మీదికి తెస్తున్నాయి. ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో బిజెపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.

English summary
AP special status agitation leader Chalasani Srinivas demanded that the BJP ministers withdraw from the Chandrababu Naidu cabinet. Ap special status poster released on Friday at Amaravathi .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X