గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛలో పల్నాడు ...దేవినేని అవినాష్ ను అడ్డుకున్న పోలీసులు ... వాగ్వాదం , అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఛలో పల్నాడు టెన్షన్ పుట్టిస్తోంది. ఇక టిడిపి నిర్వహిస్తున్న ఛలో పల్నాడు,ఛలో ఆత్మకూరుకు పోటీగా వైసీపీ నేతలు కూడా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించటం ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతుంది . పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం తమను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ఆందోళనలు నిర్వహించి తీరుతామని టిడిపి నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఛలో పల్నాడు , ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఈ ఆందోళన అడ్డుకోవడానికి విఫల యత్నం చేస్తున్నారు.

Recommended Video

నిర్భందించినంత మాత్రాన,ఈ పోరాటం ఆగదన్న చంద్రబాబు || TDP Chief Chandrababu Warns Jagan Government

ఇక ఛలో ఆత్మకూరు కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున శ్రేణులతో బయలుదేరిన దేవినేని అవినాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోసంచలో ఆత్మకూరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తరలివెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద ఆయనను అడ్డుకున్న పోలీసులు ఆయన వెనుదిరిగి వెళ్ళిపోవాలని, ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. . పోలీసులకీ, దేవినేని అవినాష్‌కి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలతో కలిసి రోడ్డు పైన బైఠాయించి అవినాష్ ఆందోళనకు దిగారు. దీంతో అవినాష్‌ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చంద్రబాబు ఇంటి వద్ద హై టెన్షన్ : లోకేశ్ ను అడ్డుకున్న పోలీసులు : భైఠాయింపు..!!చంద్రబాబు ఇంటి వద్ద హై టెన్షన్ : లోకేశ్ ను అడ్డుకున్న పోలీసులు : భైఠాయింపు..!!

Chalo palnadu .. Police have arrested TDP leader Devineni Avinash

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆత్మకూరుకు బయలుదేరారు. ఆత్మకూరులో టెన్షన్ వాతావరణం ఉన్న నేపధ్యంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. టీడీపీ కీలక నేతలతో సహా పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో పల్నాడు కార్యక్రమం భగ్నం చెయ్యటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
Police have arrested Devineni Avinash, who is leaving with a large range for the Chalo Atmakur program. There was a fierce clash between the police and Devineni Avinash who blocked Avinash, Avinash agitated on the road with TDP activists protesting against the police. Avinash was forcibly arrested and rushed to the police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X