గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఛలో పల్నాడు టెన్షన్ .. టీడీపీ నేతల అరెస్ట్ కు రంగం .. అలెర్ట్ అయిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

నిర్భందించినంత మాత్రాన,ఈ పోరాటం ఆగదన్న చంద్రబాబు || TDP Chief Chandrababu Warns Jagan Government

ఏపీలో ఛలో పల్నాడు టెన్షన్ పుట్టిస్తోంది. ఇక టిడిపి నిర్వహిస్తున్న ఛలో పల్నాడు,ఛలో ఆత్మకూరుకు పోటీగా వైసీపీ నేతలు కూడా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం తమను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ఆందోళనలు నిర్వహించి తీరుతామని టిడిపి నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఛలో పల్నాడు , ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఈ ఆందోళన అడ్డుకోవడానికి విఫల యత్నం చేస్తున్నారు.

గుంటూరులో టెన్షన్.. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ .. ఐదుగురికి గాయాలుగుంటూరులో టెన్షన్.. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ .. ఐదుగురికి గాయాలు

ఛలో పల్నాడు భగ్నం చేసే యత్నం ... భారీగా మోహరించిన పోలీసులు

ఛలో పల్నాడు భగ్నం చేసే యత్నం ... భారీగా మోహరించిన పోలీసులు

ఛలో పల్నాడు సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా టీడీపీ నేతల్ని పోలీసులు రౌండప్ చేశారు. ఎక్కడికీ కదలకుండా పోలీసులు మార్కింగ్ చేసేశారు. ఇప్పటికే పల్నాడులోని తెలుగుదేశం పార్టీ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక గుంటూరు లో ఉన్న ముఖ్య నేతలపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యనేతల కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. టీడీపీ కార్యాలయం, బాధితుల శిబిరం, టీడీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసుల్ని మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

 టీడీపీ పునరావాస శిబిరంలో 200 మంది .. నేడు టీడీపీ ఛలో పల్నాడు

టీడీపీ పునరావాస శిబిరంలో 200 మంది .. నేడు టీడీపీ ఛలో పల్నాడు

బుధవారం తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతల దాడులకు గురైన బాధితులను తీసుకొని ఆత్మకూరు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆత్మకూరులో వైసీపీ దాడులకు భయాందోళనకు గురైన 70 కుటుంబాలకు అండగా చంద్రబాబు ఛలో ఆత్మకూరు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో దాదాపుగా 200 మంది ఉన్నారు.

దాడులపై రగిలిపోతున్న టీడీపీ .. అమీతుమీ తేల్చుకునేందుకు చంద్రబాబు రెడీ

దాడులపై రగిలిపోతున్న టీడీపీ .. అమీతుమీ తేల్చుకునేందుకు చంద్రబాబు రెడీ

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల పై దాడులు పెరిగిపోయాయని, మమ్మల్ని చంపేస్తారా రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వైసిపి పాలనలోకి వచ్చిన దగ్గరనుండి ఇప్పటివరకు టీడీపీ శ్రేణులు పై జరుగుతున్న దాడులపై సహనం కోల్పోయిన టిడిపి నాయకులు వైసీపీ తీరుపై చాలా ఆగ్రహంతో ఉన్నారు.ఇక దాడులకు గురైన వారందరినీ పోలీసులు గ్రామాలకు తీసుకెళ్లాలన్న చంద్రబాబు డిమాండ్ ను మొదట పోలీసులు లైట్ తీసుకున్నారు. కానీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బాధితులను పునరావాస శిబిరం నుంచి గ్రామాలకు తీసుకెళ్తామని, ఎటువంటి ఇబ్బందిలేకుండా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

అక్రమ కేసులను ఎత్తివేసి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్

అక్రమ కేసులను ఎత్తివేసి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్

అయితే ప్రతీకార దాడుల సమస్య ఒక్క పల్నాడులో మాత్రమే లేదని రాష్ట్రం మొత్తం ఉందని టీడీపీ చెబుతోది. అక్రమ కేసులను ఎత్తివేయటమే కాకుండా బాధితులకు,నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు టిడిపి నాయకులు. దాంతో బాధితులు పోలీసులతో వెళ్లేందుకు సిద్ధపడలేదు. అయితే గుంటూరులోని బాధితుల శిబిరం వద్ద.. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పదుల సంఖ్యలో వాహనాలు సిద్ధం చేశారు. బలవంతంగా వారిని ఆయా గ్రామాలకు తీసుకెళ్లి విడిచి పెట్టేందుకు ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ నేతలు మాత్రం పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి విభిన్న మార్గాల ద్వారా ఆత్మకూరుకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

చంద్రబాబును ఏ క్షణంలో అయినా అదుపులోకి తీసుకునే అవకాశం .. వైసీపీ రివర్స్ ప్లాన్

చంద్రబాబును ఏ క్షణంలో అయినా అదుపులోకి తీసుకునే అవకాశం .. వైసీపీ రివర్స్ ప్లాన్

చంద్రబాబును పోలీసులు ఇంటి వద్ద కానీ శిబిరం వద్ద కానీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా మరో తరహా రాజకీయం ప్రారంభించారు. పోటీగా వైసీపీ నేతలు కూడా ఓ ర్యాలీకి సిద్ధమయ్యారు. తాము కూడా.. టీడీపీ బాధితులతో కలిసి చలో ఆత్మకూరు నిర్వహిస్తున్నామని... ఆ పార్టీ నేతలు ప్రకటించారు. దీని కోసం పోలీసుల్ని పర్మిషన్ కూడా అడిగామని వారంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీలో ఛలో పల్నాడు ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది.

English summary
On Wednesday, the Telugu Desam Party leaders are making arrangements to take the victims of the YCP leaders' attacks and go to Atmakur. The decision to organize Chandrababu Chalo Atmakur has been supported by 70 families affected by the YCP attacks in Atmakur. TDP leaders are ready to participate in this rally. There are about 200 people in the rehabilitation camp already set up by the Telugu Desam Party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X