వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి మరో శుభవార్త, విశాఖ రైల్వే జోన్‌కు ఒకే!: అలా ఐతేనే.. మారిన బాబు వ్యూహం, ఆ తర్వాతే

|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ ఎంపీలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీకీ తీవ్ర అన్యాయం జరిగిందని, తమకు న్యాయం చేసే వరకు తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు, ఏపీలో టీడీపీ, వైసీపీలను ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు ఏపీకి చేయాల్సిన న్యాయంపై అధిష్టానంతో మాట్లాడారు.

Recommended Video

TDP Unsure About Govt's Assurance On AP Bifurcation Act

చదవండి: ఢిల్లీ సాక్షిగా జగన్‌కు షాక్! రెండ్రోజుల్లో బాబు కీలక నిర్ణయం: అక్కడ సోనియా, ఇక్కడ పవన్ కళ్యాణ్

ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీకి సాయంపై ముందుకు కదిలింది. లోటు భర్తీకి సిద్ధమైంది. ఏపీ ప్రాజెక్టులకు రూ.1269 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు మరో శుభవార్త వచ్చే వచ్చే అవకాశముంది. విశాఖ రైల్వే జోన్‌పైనా కసరత్తు ప్రారంభించనుంది.

చదవండి: టీడీపీ ఎంపీలకు షాక్: నేనెవర్ని చెప్పడానికి.. జైట్లీతో మాట్లాడి చేతులెత్తేసిన అద్వానీ

ఏపీకి రైల్వే జోన్ ఇలా

ఏపీకి రైల్వే జోన్ ఇలా

ఏపీ ఎంపీల ఆందోళన, బీజేపీ అధిష్టానం, కేంద్రం చర్చల నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారని తెలుస్తోంది. ఈ రైల్వే జోన్‌కు ఒడిశా నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ జోన్‌తో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏపీ ఎంపీలు వివరించారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజన్లతో కలిపి జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి.

అలా ఒడిశా నేతల అంగీకారం

అలా ఒడిశా నేతల అంగీకారం

వాల్తేరు డివిజన్‌లోని ఎక్కువ శాతం ఇప్పుడున్న జోన్‌లోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు. దీనికి ఒడిశా నేతలు కూడా అంగీకరించారని అంటున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చాంబర్లో అమిత్ షా, అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి, పీయూష్ గోయల్‌లు చర్చించారు. రైల్వే జోన్‌పై రెండు వారాల్లో ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ ప్రారంభించి త్వరలో ప్రకటన చేయనున్నారట.

ఈ మూడు నెలల్లోనే

ఈ మూడు నెలల్లోనే

ఇదిలా ఉండగా, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అన్నింటిపై మనకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మూడు నెలల తర్వాత బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తుందని, ఏం సాధించినా ఇప్పుడే సాధించాలని భావిస్తున్నారు. ఏపీ నుంచి వెళ్లిన ఆర్థిక అధికారులతో కేంద్ర అధికారులు చర్చిస్తున్నారు. కేంద్రమంత్రులు కూడా ఏపీ పట్ల సానుకూలంగానే ఉన్నారు. కానీ కొన్ని అంశాలు యూపీఏ హయాంలో చట్టంలో పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి.

ప్రధాని మోడీ పైనే ఒత్తిడి తేవాలి

ప్రధాని మోడీ పైనే ఒత్తిడి తేవాలి

విశాఖకు రైల్వే జోన్ పరిశీలిస్తామని ఉంది తప్పితే, ఇవ్వాలని లేదు. అలాగే ప్రత్యేక హోదా విషయంలోని. దీంతో ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి. యూపీఏ స్పష్టంగా పెడితే ఇలాంటి ఇబ్బందులు ఉండకపోయేవని బీజేపీ అంటోంది. అయితే, ఈ హామీలు నెరవేరాలంటే ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాల్సిందేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు, వారికి పలువురి నుంచి ఇలాంటి సూచనలు కూడా అందుతున్నాయట.

మారిన బాబు వ్యూహం కర్నాటక తర్వాత.. మారిన బాబు వ్యూహం

మారిన బాబు వ్యూహం కర్నాటక తర్వాత.. మారిన బాబు వ్యూహం

ఎంపీల పోరాటం కారణంగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికల వరకు చంద్రబాబు వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యమైనన దెబ్బ తగిలితే చంద్రబాబు మళ్లీ పునరాలోచన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీకి నిధులు, రైల్వే జోన్ వంటి అంశాలపై కేంద్రం ఇప్పుడు సానుకూలంగా ఉంది. అయినా పూర్తిగా విభజన హామీలపై పోరాడాల్సిందేనని చంద్రబాబు చెబుతున్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్న తరుణంలో కర్నాటక ఎన్నికల తర్వాత బాబు పరిస్థితిని చూసి తాడేపోడే తేల్చుకుంటారని అంటున్నారు.

English summary
A railway zone with Visakhapatnam as headquarters seems to be imminent as the BJP high command and the Centre mellowed down a bit following vigorous protests undertaken by MPs from Andhra Pradesh in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X