వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో వరుసగా: చంచల్‌గుడా జైలు విఐపి బ్యారక్ ఖాళీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విఐపి ఖైదీలతో క్రిక్కిరిసి పోయిన హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు విఐపి బ్యారక్ ఇప్పుడు బోసిపోయింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో పాటు వరుసగా ఒక్కరొక్కరికి బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. దీంతో విఐపి బ్యారక్‌లో విఐపి ఖైదీ ఇద్దరే ఉన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బంధువు బివి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే ఆ బ్యారక్‌లో మిగిలిపోయారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. దీంతో ఆయన శుక్రవారం జైలు నుంచి బయటకు వస్తున్నారు. జగన్‌ చాలా రోజుల క్రితమే బైయిల్‌పై బయటకు వచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడు సునీల్ రెడ్డి, సస్పెన్షన్‌కు గురైన ఉన్నతాధికారి బిపి ఆచార్య, మాజీ మైన్స్ డైరెక్టర్ విడి రాజగోపాల్, కోనేరు ప్రసాద్‌లు ఇప్పటికే బెయిల్‌పై బయటకు వచ్చారు.

ys jagan

సోమవారం బెయిల్ మంజూరు కావడంతో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్, ఉన్నతాధికారి కెవి బ్రహ్మానందరెడ్డి మంగళవారంనాడు జైలు నుంచి బయటకు వచ్చారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఆరోగ్య కారణాలపై బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చారు. వివిధ కేసుల్లో అరెస్టయిన నూకారపు సూర్యప్రకాష్ ఈ ఏడాది ప్రారంభంలో జైలు నుంచి విడుదలయ్యారు.

విఐపి ఖైదీలు బయటకు రావడంతో దాన్ని వేరే ప్రయోజనాలకు వాడాలని జైలు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. విఐపి ఖైదీలను దృష్టిలో పెట్టుకుని జైలు ఆవరణలో కొత్త భవన నిర్మాణం జరుగుతోందని అంటున్నారు.

English summary
The once buzzing with life special category prisoners barrack at the Chanchalguda jail has practically become empty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X