• search
  • Live TV
ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అరెస్టు చేసాక అచ్చెన్న హీరో : రఘురామ వర్గాన్ని శత్రవులుగా -రేషన్ కార్డు తీసేస్తారు : చంద్రబాబు..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన అయిదేళ్ల శ్రమను నాశనం చేసారంటూ వ్యాఖ్యానించారు. పోలవరంలో అవినీతి అంటూ కమిటీలు వేసారని.. ఎలుకను కూడా పట్టుకోలేదంటూ ఎద్దేవా చేసారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని...అన్నదాతలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వానికే ఊరి వేద్దామని పిలుపునిచ్చారు. రైతులకు తాను అండగా ఉంటాననీ, ముందున్నవన్నీ మంచి రోజులేననీ భరోసా ఇచ్చారు.కేసులకు భయపడకుండా పోరాడాలని.. తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

తన వర్గం..రఘురామ వర్గాలను శత్రువులుగా

తన వర్గం..రఘురామ వర్గాలను శత్రువులుగా

తాను ఒక వర్గం వ్యక్తిని కాబట్టి..ఆ సామాజిక వర్గం మొత్తం జగన్ కు శత్రువులనేని వ్యాఖ్యానించారు. అలాగే రఘురామ రాజు వర్గం మరో శత్రువులని ఆరోపించారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే హీరో అయ్యాడని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరో నేత చింతమనేని పైనా కేసులు పెట్టారని గుర్తు చేసారు.

ఇలా ఎంత మంది పైన కేసులు పెడతారని ప్రశ్నించారు. ఎంతమందిని భయపెడతారని చంద్రబాబు నిలదీసారు. తాను అనుకుంటే జగన్ అసలు బయటకు వచ్చేవాడా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 72 శాతం పూర్తి చేసిచ్చిన పోలవరాన్ని సైతం అవినీతి, రివర్స్‌ టెండరింగ్‌ అంటూ.. తాత్సారం చేశారని ధ్వజమెత్తారు.

రేషన్ కార్డు తీసేస్తారు - ఆ తరువా పథకాలు

రేషన్ కార్డు తీసేస్తారు - ఆ తరువా పథకాలు

పూర్తయిన పనులనూ నాశనం చేశారు. డయాఫ్రం వాల్‌ ఇసుకలో పూడుకుపోయిందని వివరించారు. దాన్ని వెలికితీయాలంటే రూ.800 కోట్లు కావాలని కేంద్రం తాజా నివేదిక ఇస్తే బాధేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సన్నబియ్యం అన్నారు... ఇప్పుడు సన్నబియ్యంతో పాటు ఉన్న బియ్యం కూడా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

కిలో రూ.40 నుంచి రూ.50కి కొనే బియ్యానికి 12 రూపాయలు ఇస్తామని చెబుతున్నారని..బియ్యం తీసుకోవట్లేదనే సాకుతో రేపు రేషన్‌కార్డు తీసేస్తారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత.. ఉపకారవేతనాలు, పింఛన్లు ఏవీ రావంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

శ్రీలంక పరిస్థితి ప్రస్తావనతో..

శ్రీలంక పరిస్థితి ప్రస్తావనతో..

జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని... రూ.7 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు. ఇవన్నీ ఎవరు తీర్చాలని ప్రశ్నించారు. శ్రీలంక పరిస్థితిని చంద్రబాబు ప్రస్తావించారు. దివాలా తీసిందని చెప్పుకొచ్చారు. తండ్రి హయాంలోనే రూ 40 వేల కోట్లు దోపిడీ చేస్తే ఇప్పుడు..ఎంత చేస్తారో ఆలోచన చేయాలని సూచించారు.

తన జన్మదినం నాడు ఏలూరు జిల్లా నెక్కలం గొల్లగూడెం గ్రామంలో జరిగిన రచ్చబండలో పాల్గొన్న చంద్రబాబు..ఇక నుంచి నెలకు రెండు జిల్లాల పర్యటనల పైన నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా మహానాడు పూర్తయిన తరువాత జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. ఈ సారి మహానాడు ఒంగోలులో రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు.

English summary
TDP Chief Chandra Babu allegated CM Jagan govt corruption is in peak, says CM treating some section people as enemies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X