వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో లోకేశ్ సందడి: వైసీపీ నేత‌ల‌తో ముచ్చ‌ట్లు: చ‌ంద్ర‌బాబు సైతం...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అసెంబ్లీలో లోకేష్ సందడి వైసీపీ నేత‌ల‌తో ముచ్చ‌ట్లు || Oneindia Telugu

ఏపీ అసెంబ్లీలో ఫిరాయింపుల పైన అధికార‌- ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య హోరా హోరీ ఆరోప‌ణ‌ల త‌రువాత ఆస‌క్తి క‌ర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు నుండి శాస‌న‌మండ‌లి సైతం ప్రారంభ‌మైంది. తాజా ఎన్నిక‌ల్లో ఓడిన చంద్ర‌బాబు త‌న యుడు లోకేశ్ ఎమ్మెల్సీగా స‌భ‌కు వచ్చారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉండ‌టంతో ఎమ్మెల్యేల‌తో పాటుగా ఎమ్మెల్సీలు సైతం శాస‌న‌స‌భా ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆస‌క్తిక‌రంగా లోకేశ్ త‌న‌కు ఎదురైన వైసీపీ నేత‌ల‌తో మాట‌లు క‌లిపారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన ప్ర‌తిప‌క్ష నేత సైతం ప‌ల‌క‌రించారు.

లాబీల్లో లోకేశ్ సండ‌ది..
ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత పెద్ద‌గా బ‌య‌ట‌కు రాని మాజీ ముఖ్య‌మంత్రి చంంద్ర‌బాబు త‌న‌యుడు..మాజీ మంత్రి లోకేశ్ అసెంబ్లీకి వ‌చ్చారు. ఆయ‌న తాజా ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయిన్ప‌టికీ ఎమ్మెల్సీ కావ‌టంతో ఆయ‌న చ‌ట్ట స‌భ‌ల్లో స‌భ్యుడిగా ఉన్నారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఏర్పా టు చేయ‌టంతో ఎమ్మెల్సీలు సైతం కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత తొలి సారి అసెంబ్లీకి వ‌చ్చారు.

Chandra Babu and Lokesh move friendly with YCP leaders in Assembly lobbies..

ఈ స‌మ‌యంలో కొత్త మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు లాబీల్లో ఉండ‌గా..అక్క‌డ‌కు వ‌చ్చిన లోకేశ్ వారిని అప్యాయంగా ప‌ల‌క‌రించారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఆనం రాంనారాయణరెడ్డితో క‌ర‌చాల‌నం చేసిన లోకేశ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎమ్మెల్సీ సోము వీర్రాజును నమస్తే అంటూ లోకేష్ పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. త‌న‌కు ఎదురైన వైసీపీ ఎమ్మెల్యేలను సైతం లోకేశ్ ఆత్మీయంగా ప‌ల‌క‌రించారు.

చంద్ర‌బాబు సైతం వైసీపీ నేత‌ల‌తో..
గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ముందుగానే స‌భ‌కు చేరుకున్న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అసెంబ్లీ హాల్‌లోకి వెళ్లేముందు ఆస‌క్తి క‌ర దృశ్యం చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగి రెడ్డి ఎదురయ్యారు. వారిద్దరూ నమస్తే అన్న అంటూ చంద్రబాబుకు నమస్కరించారు. చంద్రబాబు కూడా బాగున్నారా.. అంటూ ఎమ్మెల్యేలతో కరచాలనం చేసి, ఆత్మీయంగా పలకరించడం ఆసక్తికరంగా మారింది.

శాన‌స‌భ రెండో రోజున స్పీక‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా రెండు పార్టీల మ‌ధ్య ఫిరాయింపుల వ్య‌వ‌హారం పైన వాగ్వాదం జ‌రిగింది. ఒక ద‌శ‌లో చెవిరెడ్డి బాస్క‌ర రెడ్డి..టీడీపీఎల్పీ ఉప నేత అచ్చంనాయుడు మ‌ధ్య మాట‌లు తీవ్ర స్థాయికి చేరాయి. అయితే, టీడీపీ అధినాయ‌క‌త్వం అసెంబ్లీ లాబీల్లో వైసీపీ నేత‌ల‌తో ఇలా స్నేహ పూర్వ‌కంగా ఉండ‌టం పైనా వైసీపీ ఎమ్మెల్యేల్లో చ‌ర్చ మొద‌లైంది.

English summary
TDP Chief Chandra Babu and ex Minister Lokesh special attraction in Assembly lobbies to day. Both leaders positively received YCP Mlas and Ministers in Lobbies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X