వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు పెన్ష‌న్లు మ‌ళ్లీ పెంచేసారు : జ‌గ‌న్ కు పోటీగా హామీలు : వైసిపి ని ట్రాప్ చేస్తున్నారా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : చంద్ర‌బాబు పెన్ష‌న్లు మ‌ళ్లీ పెంచేసారు!! | Oneindia Telugu

ఎన్నిక‌ల వేళ‌..ఏపిలో హామీల వ‌ద‌ర పారుతోంది. ఇప్ప‌టి వ‌రకు ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేయ‌ని టిడిపి..వైసిపి పార్టీ లు ఎదురు పార్టీల మేనిఫెస్టోల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో టిడిపి రోజుకో వ‌రాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకొచ్చి జ‌గ‌న్ కంటే ముందు ఉండాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు రెండు వేలకు పెంచిన పెన్ష‌న్ ను మ‌రో వెయ్యి రూపాయ‌ల పెంపు హామీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. స్వ‌యంగా టిడిపి అధినేత చంద్రబాబు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వైసిపి హామీ ల‌తో పోటీ ప‌డాల‌ని టిడిపి భావిస్తోంది.

పెన్ష‌న్ మూడు వేల‌కు పెంపు..

పెన్ష‌న్ మూడు వేల‌కు పెంపు..

పార్టీ ప్లీన‌రీ లో వైసిపి అధినేత జ‌గ‌న్ తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌స్తుతం వెయ్యి రూపాయ‌లుగా ఉన్న రెండు వేల‌కు పెంచుతాన‌ని హామీ ఇచ్చారు. ఆ త‌రువాత అధికారంలో ఉన్న ముఖ్య‌మంత్రి ఇదే నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తే ఏం చేస్తార ని కొంద‌రు జ‌గ‌న్ ను ప్ర‌శ్నించారు. దీనికి ప్ర‌తిగా చంద్ర‌బాబు రెండు వేల‌కు పెన్ష‌న్ పెంచితే..తాను మూడు వేలు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఫిబ్ర‌వ‌రి లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపిలో పెన్ష‌న్ ను రెండు వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకు న్నారు. అమ‌లు ప్రారంభించారు. దీంతో, ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ తాను అధికారంలోకి వ‌స్తే రెండు వేల పెన్ష‌న్ ను మూడు వేల వ‌ర‌కు పెంచుకుంటూ పోతామ‌ని చెబుతూ వ‌స్తున్నారు. దీంతో..దీనికి కౌంట‌ర్ గా టిడిపి కూడా పెన్ష‌న్ మొత్తా న్ని పెంచాల‌ని నిర్ణ‌యించారు. ఈ రోజు పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన టెలి కాన్ఫిరెన్స్‌లో చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. పెన్ష‌న్ ను మూడు వేల వ‌ర‌కు పెంచుతామ‌ని చెప్పుకొచ్చారు.

రోజకో హామీ పై లీక్‌..

రోజకో హామీ పై లీక్‌..

నాలుగు రోజుల క్రితం టిడిపి మేనిఫెస్టో విడుద‌ల కావాల‌సి ఉంది. అయితే, వైసిపి విడుద‌ల చేయ‌కుండా తాము చేయ కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. దీంతో..నాలుగు రోజులుగా రోజుకో ఒక్క హామీ ఐ లీక్ ఇస్తూ త‌మ పధ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకె ళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీని ద్వారా ప్ర‌జ‌ల్లో పాజిటివ్ ఇమేజ్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల పిపిఎస్ ను ర‌ద్దు చేస్తామ‌నే లీక్ ఇప్ప‌టికే ఇచ్చేసారు. ఇక‌, తాజాగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా చేస్తామ‌ని హామీ ఇస్తున్న‌ట్లు లీక్ ఇచ్చారు. ఇప్పుడు వైసిపి కి ధీటుగా పెన్ష‌న పెంపు పైనా వెల్ల‌డించారు. ప‌సుపు కుంకుమ ప్ర‌తీ ఏడాది ఇస్తామ‌ని..అన్న‌దాత సుఖీభ‌వ కొన‌సాగిస్తామ‌ని చెబుతూ వ‌స్తున్నారు.

నారా లోకేశ్ భర్త నారా చంద్రబాబు నాయుడా ..!?నారా లోకేశ్ భర్త నారా చంద్రబాబు నాయుడా ..!?

జ‌గ‌న్ ను ట్రాప్ చేసేందుకా..అమ‌లు కోస‌మేనా..

జ‌గ‌న్ ను ట్రాప్ చేసేందుకా..అమ‌లు కోస‌మేనా..

ఎన్నిక‌ల వేళ టిడిపి అధినేత ఇస్తున్న హామీలు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. మూడు నెల‌ల క్రిత‌మే ఏపి లో పెన్ష‌న్ల‌ను మూడు వేల‌కు పెంచాల‌నే లీక్ ద్వారా వైసిపి ని ట్రాప్ చేసేందుకే ఈ లీక్‌లు ఇస్తున్నారా అనే అనుమా నం క‌లుగుతోంది. జ‌గ‌న్ తొలుత ప్ర‌క‌టించిన రెండు వేల పెన్ష‌న్ ను చంద్ర‌బాబు అమ‌ల్లోకి తెచ్చారు. ఆ వెంట‌నే జ‌గ‌న్ మూడు వేల‌కు పెంచుతూ హామీ ఇచ్చారు. ఇప్పుడు చంద్ర‌బాబు మూడు వేలు అంటున్నారు. ఇలా చెప్ప‌టం ద్వారా జ‌గ‌న్ మ‌రోసారి పెన్ష‌న్ ను మ‌రింత పెంచుతూ హామీ ఇస్తే ఇక ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి ఉండ‌ద‌ని..జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త మీద దెబ్బ‌ ప‌డుతుంద‌ని టిడిపి అంచ‌నా వేస్తోంది. దీంతో..మేనిఫెస్టో లో అధికారికంగా ప్ర‌క‌టించ‌కుడా ఎన్నిక‌ల వేళ మైండ్ గేమ్ ద్వారా వైసిపిని ట్రాప్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు తాజా హామీ పై జ‌గ‌న్ ఎలా స్పంది స్తారో చూడాలి.

English summary
TDP Cheif Chandra babu says social pensions will be hike up to 3000. Chandra babu in teleconference with party leaders announce this decision. Now, all are waiting for jagan reaction on this new announcement .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X