వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు నేత‌ల అల్టిమేటం: ఆ ఇద్ద‌రినీ త‌ప్పిస్తారా..మ‌మ్మ‌ల్ని త‌ప్పుకోమంటారా: బాబు తో భేటీ ఫిక్స్‌..!

|
Google Oneindia TeluguNews

టీడీపీలో అసంతృప్త కాపు నేత‌ల బుజ్జ‌గింపులు ప్రారంభ‌మ‌య్యాయి. అధినేత పిలుస్తున్నారు..క‌లిసి వెళ్లండి అంటూ ఫోన్లు చేస్తున్నారు. దీంతో..కాపు నేత‌లు సైతం త‌మ‌కు చంద్ర‌బాబు నుండి పిలుపు వ‌చ్చిన అంశం పైన తోటి నేత‌ల‌తో చ‌ర్చిస్తున్నారు. గ‌తంలో తాము అనుకున్న డిమాండ్ల‌నే అంద‌రూ ప్ర‌స్తావించాల‌ని నిర్ణ‌యించారు. పార్టీలో కాపు నేత‌ల కు జ‌రిగిన న‌ష్టాన్ని వివ‌రించాల‌ని డిసైడ్ అయ్యారు. పార్టీలో ఆ ఇద్ద‌రు నేత‌ల‌ను త‌ప్పించాల‌ని..లేకుంటే తాము త‌ప్పు కుంటామ‌ని విష‌యాన్ని ఖ‌రా ఖండిగా చెప్పాల‌ని తీర్మానించారు. మ‌రి..చంద్ర‌బాబు వీరి డిమాండ్‌ను అంగీక‌రిస్తారా..

కాపు నేత‌లకు ఆహ్వానాలు..

కాపు నేత‌లకు ఆహ్వానాలు..

టీడీపీ అధినాయ‌క‌త్వం మీద అసంతృప్తి..ఆగ్ర‌హంతో ఉన్న కాపు నేత‌ల‌ను టీడీపీ అధినాయ‌క‌త్వం బుజ్జ‌గించే చ‌ర్య లు ప్రారంభించింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు విదేశాల్లో ఉన్న స‌మ‌యంలో కాపు నేత‌లు కాకినాడ‌లో ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మావేశంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు అభ్య‌ర్దుల పైన వివ‌క్ష చూపించి..సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి చంద్ర‌బాబు..లోకేశ్ ఏ ర‌కంగా స‌హ‌కారం అందించిందీ చ‌ర్చించుకున్నారు. పార్టీ మారేందుకే వారు స‌మావేశ‌మ‌య్యార‌నే వాద‌న ఉన్నా..వారు దానిని తోసిపుచ్చారు. త‌మ స‌మ‌స్య‌ల మీద చంద్ర‌బాబుతో చ‌ర్చ‌కు అభ్యంత‌రం లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే, చంద్ర‌బాబు విదేశాల నుండి వ‌చ్చిన త‌రువాత ఏర్పాటు చేసిన స‌మా వేశానికి సైతం వారు హాజ‌రు కాలేదు. దీంతో..ఇప్పుడు చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. వారిని త‌న వ‌ద్ద‌కు రావాల‌ని క‌బురు చేస్తున్నారు. కొంద‌రు నేత‌ల‌తో చంద్ర‌బాబు స్వ‌యంగా మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.

ఆ ఇద్ద‌రినీ త‌ప్పించాల్సిందే..

ఆ ఇద్ద‌రినీ త‌ప్పించాల్సిందే..

కాపు నేత‌లు ఎన్నిక‌లు పూర్త‌యిన స‌మ‌యం నుండి ప్ర‌ధానంగా లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్నారు. లోకేశ్ పార్టీలో అతిగా జోక్యం చేసుకోవటం వ‌ల‌నే పార్టీకి న‌ష్టం జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల వేళ‌..లోకేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు పైన కాపు నేత‌లు ఆగ్రహంతో ఉన్నారు. త‌న సామాజిక వ‌ర్గ నేత‌ల‌కే లోకేశ్ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని..ఎన్నిక‌ల్లో ఓట‌మికి బాధ్య‌త వ‌హించి లోకేశ్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుండి త‌ప్పుకోవాల‌నేది వారి డిమాండ్ గా తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో కాపు నేత‌లు గ‌త ప్ర‌భుత్వంలో ఆర్దిక శాఖా మంత్రిగా ప‌ని చేసిన య‌న‌మ‌ల సైతం త‌న‌కు న‌చ్చిన వారికే నిధుల మంజూరులో ప్రాధాన్య‌త ఇచ్చార‌ని..ప్ర‌ధానంగా గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపు నేత‌ల విజ్ఞ‌ప్తుల‌ను ప‌ట్టించు కోవ‌టం లేద‌ని వారి ఆవేద‌నగా తెలుస్తోంది. య‌న‌మ‌ల అనుభ‌వం పార్టీకి ఏర‌కంగానూ ప్ర‌యోజ‌నం చేయ‌దంటూ కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్‌...య‌న‌మ‌ల ఇద్ద‌రినీ పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గించాల‌ని లేకుంటే..తాము పార్టీలో ఇక కొన‌సాగే ప‌రిస్థితి లేద‌నే విష‌యాన్ని అధినేత మందే కుండ బ‌ద్ద‌లు చేయాల‌ని కాపు నేత‌లు డిసైడ్ అయ్యారు.

కాపు నేత‌లు ఇప్ప‌టికే డిసైడ్ అయిపోయారా..

కాపు నేత‌లు ఇప్ప‌టికే డిసైడ్ అయిపోయారా..

టీడీపీలోని మెజార్టీ కాపు నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ మీద ఇప్ప‌టికే ఒక స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. టీడీపీలో ఇక కొన‌సాగే అవ‌కాశం లేద‌ని..స‌మ‌యం చూసి పార్టీ మారుతార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల రోజులే కావ‌టంతో జ‌గ‌న్ పాల‌న మీద ఇంకా నిర్దిష్ట‌మైన అభిప్రాయానికి వారు రాలేద‌ని చెబుతున్నారు. వైసీపీలో ఇప్ప‌టికే త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు ఉండ‌టంతో ఇక‌, తాము బీజేపీలోకి వెళ్ల‌టం మంచిద‌నే భావ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరి స‌మావేశాలు..భ‌విష్య‌త్ నిర్ణ‌యాల వెనుక‌
కేంద్ర మాజీ మంత్రి...వీరితో స‌న్నిహిత సంబంధాలు ఉన్న ప్ర‌ముఖ వ్య‌క్తి స‌హ‌కారం ఉన్న‌ట్లుగా స‌మాచారం. దీంతో. చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు ఇప్పుడు వారు అధినేత‌తో ఏం చెబుతారు..ఆయ‌న ఎలా స్పందిస్తారు.. వీరి నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు ఆసక్తి క‌రంగా మారింది.

English summary
Chandra babu called Kapu leaders to meet their problems in party. Some of the kapu leaders not interest to meet him. But other leaders decided to meet babu and share their views.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X