వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చ‌ంద్ర‌బాబుతో దూరం సాధ్య‌మేనా : బాబు ర‌హ‌స్య చిట్టా విప్పుతారా: సుజ‌నా...ర‌మేష్ బీజేపీలో ఉండ‌గ‌ల‌రా.

|
Google Oneindia TeluguNews

టీడీపీలో అధినేత చంద్ర‌బాబు..ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ త‌రువాత రెండు స్థానాలు ఆ ఇద్ద‌రివే. టీడీపీ అధినేత‌తో వ్య‌క్తిగ‌తంగా..ఆర్దికంగా..రాజ‌కీయంగా వారి బంధం ఈనాటిది కాదు. చంద్ర‌బాబు కోట‌రీ ముఖ్యులు. ఇప్పుడు ఆ ఇద్ద‌రే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు కీ రోల్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వారిని బీజేపీ కొంత కాలంగా టార్గెట్ చేసింది. వారు బీజేపీకి స‌రెండ‌ర్ అయ్యార‌నేది టీడీపీ నేత‌ల వాద‌న‌. మ‌రి..ఇప్పుడు ఆ ఇద్ద‌రూ చంద్ర‌బాబు ఆర్దిక-రాజ‌కీయ ర‌హ‌స్యాల‌ను బీజేపీ అగ్ర‌నేత‌ల ముందు ఉంచుతారా. అది చంద్ర‌బాబుకు న‌ష్ట‌మేనా...

 సంచ‌ల‌నం: టీడీపీలో చీలిక‌: న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల గుడ్ బై: ఛైర్మ‌న్‌కు లేఖ‌..! <br> సంచ‌ల‌నం: టీడీపీలో చీలిక‌: న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల గుడ్ బై: ఛైర్మ‌న్‌కు లేఖ‌..!

చంద్ర‌బాబు కోట‌రీలో కీల‌కం...

చంద్ర‌బాబు కోట‌రీలో కీల‌కం...

సుజ‌నా చౌద‌రి..కొద్ది కాలం క్రితం వ‌ర‌కూ చంద్ర‌బాబు త‌రువాతి స్థానం పార్టీలో ఆయ‌న‌దే. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి ఆర్దికంగా..బీజేపీతో పొత్తు స‌మ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు వ‌ద్ద ఏ మాట అయినా చెప్ప‌గ‌లిగిన చొర‌వ ఆయ‌న‌కు ఉంది. అయితే, కొంత కాలంగా ఆయ‌న ఇడి..ఐటి కేసులు ఎదుర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీలోనే చౌద‌రికి వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నా చంద్ర‌బాబు చూసీ చూడ‌న‌ట్లుగా వ‌దిలేసారు. తాజా ఎన్నిక‌ల ముందు పార్టీ ప‌రిస్థితి బాగోలేద‌ని..దిద్దుబాటు చ‌ర్య‌లు సూచించినా అధినేత ప‌ట్టించుకోలేదు. బీజేపీతో తెగ దెంపులు స‌జ‌నా చౌద‌రికి స‌స‌మిరా ఇష్టం లేదు. దీని పైనా బాబుకు సూచించినా ఆయ‌న నో అన్నారు. కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టే అంశంలోనూ ఆయ‌న చంద్ర‌బాబు తో విబేధించారు. ఇక‌, ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోవ‌టం..త‌న‌కు ప్రాధాన్య‌త లేక‌పోవ‌టం..రాజ‌కీయంగా బీజేపీకి ప్ర‌త్యామ్నాయం ద‌గ్గ‌ర‌లో క‌నిపించ‌క‌పోవ‌టంతో ఆయ‌న బీజేపీలోకి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తానే కాదు..స‌హ‌చ‌రుల‌ను ఒప్పించారు.

సీఎం ర‌మేష్‌..న‌ష్ట‌మ‌ని గ్ర‌హించి..

సీఎం ర‌మేష్‌..న‌ష్ట‌మ‌ని గ్ర‌హించి..

క‌డ‌ప జిల్లాకు చెందిన సీఎం ర‌మేష్ ప‌క్కా వ్యాపారి. ఆయ‌న‌కు చంద్ర‌బాబుతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీ వాయిస్‌ను బ‌లంగా వినిపిస్తారు. చంద్ర‌బాబుకు ఆర్దిక తోడ్పాటు అందించే వారిలో ప్ర‌ముఖుడు. వైసీపీ నుండి గెలిచిన ఎంపీలు...ఎమ్మెల్యేల ఫిరాయింపులోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అయిదేళ్ల కాలంలో సీఎం ర‌మేష్ ప్ర‌భుత్వం నుండి అనేక కాంట్రాక్టులు పొందారు. వేల కోట్ల విలువైన ప‌నులు ఆయ‌న‌కు ద‌క్కాయి. అయితే ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ పాత కాంట్రాక్టులు..కేటాయింపుల మీద రివ్యూ చేస్తాన‌ని చెప్ప‌టం..సీఎం ర‌మేష్‌కు ద‌క్కిన రూ 2500 కోట్ల విలువైన కాంట్రాక్టును నిలిపివేయ‌టంతో ఇప్పుడు ఆయ‌న‌కు బీజేపీ వైపు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయితే, ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఎంత వ‌ర‌కు బీజేపీలో నెట్టుకొస్తార‌నేది కష్ట‌మే. ఇదే స‌మ‌యంలో ఆయ‌న పూర్తిగా టీడీపీతో దూర‌మ‌య్యే ప‌రిస్థితి అనుమాన‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

బాబు ర‌హస్యాలు విప్పుతారా..బీజేపీలోనే ఉంటారా

బాబు ర‌హస్యాలు విప్పుతారా..బీజేపీలోనే ఉంటారా

సీఎం ర‌మేష్..సుజ‌నా చౌద‌రి ఇద్ద‌రూ చంద్ర‌బాబుకు న‌మ్మ‌క‌స్తులు. కార‌ణాలు ఏవైనా వారు ఇప్పుడు బీజేపీలో చేర‌టం ఖాయ‌మైంది. అయితే..వారు బీజేపీలోకి వెళ్లినా..క‌మ‌ల‌నాధులు ఆశిస్తున్న‌ట్లుగా చంద్ర‌బాబు ర‌హ‌స్య చిట్టా వారు విప్పుతారా అనే చ‌ర్చ సాగుతోంది. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు న‌ష్టం జ‌రిగే ప‌ని వారిద్ద‌రూ చేయ‌గ‌ల‌రా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక‌, వీరు టీడీపీ క‌ష్టంలో ఉండ‌గా బీజేపీలో చేరాల‌ని నిర్ణ‌యించారు. ఇదే స‌మ‌యంలో వారిద్ద‌రూ పూర్తి కాలం బీజేపీలో ఉంటారా అదే సందేహ‌మే.

English summary
Chandra babu close associates in TDP Sujana Chowdary and CM Ramesh decided to join in BJP. But they really continue in BJP is became major question in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X