కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌ర్నూలులో సీయం తేల్చేసారు: స‌మీక్ష‌కు ఆ ఏడుగురు డుమ్మా: అస‌లు కార‌ణం అదేనా..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తి క‌ర అంశాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ త‌రువాత జిల్లాలో పోలింగ్ స‌ర‌ళి పైన చ‌ర్చించేందుకు టిడిపి నుండి పోటీ చేసిన అభ్య‌ర్దులంతా రావాల‌ని ముందుగానే పార్టీ నుండి స‌మాచారం పంపారు. అయితే, ఏడుగురు అభ్య‌ర్దులు రాలేదు. ఇక‌, చంద్ర‌బాబు ఎన్నిక‌ల పోలింగ్ స‌ర‌ళి పైన త‌న వ‌ద్ద ఉన్న స‌మాచారంతో ఫ‌లితాల‌ను తేల్చి చెప్పేసారు.

క‌డ‌ప‌..క‌ర్నూలు లో చంద్ర‌బాబు..

క‌డ‌ప‌..క‌ర్నూలు లో చంద్ర‌బాబు..

ఒంటిమిట్ట‌లో సీతారాముల క‌ళ్యాణానికి హాజ‌రైన చంద్ర‌బాబు క‌డ‌ప జిల్లా నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. వారి నుండి జిల్లాలోని ప‌ది అసెంబ్లీ..రెండు లోక్‌స‌భ స్థానాల్లో పోలింగ్ స‌ర‌ళి పైన ఆరా తీసారు. ప్ర‌త్యేకించి పులివెందుల‌.. జ‌మ్మ‌ల‌మ‌డుగు స్థానాల పైనా ఆయ‌న వివ‌రాలు సేక‌రించారు. క‌డ‌ప టిడిపి ఎంపీ అభ్య‌ర్ధికి ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్ని ఓట్లు పోల‌య్యాయ‌నే విష‌యం పైన జిల్లా నేత‌లు చంద్ర‌బాబుకు విశ్లేషించారు. ఇక, క‌ర్నాట‌క లోని రాయ‌చూర్‌కు వెళ్లే దారిలో క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లులో ఆ జిల్లా అభ్య‌ర్దుల‌తో చంద్ర‌బాబు స‌మావేశం అయ్యారు. అక్క‌డ సైతం జిల్లా నుండి 14 అసెంబ్లీ స్థానాలు..రెండు లోక్‌స‌భ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్య‌ర్దుల‌కు మ‌ద్ద‌తుగా పోలింగ్ ఎలా జ‌రిగిందీ.. స‌ర‌ళి ఏంటి అనే అంశం పైన ఆరా తీసారు. ఆ స‌మ‌యంలో ప్ర‌త్యేకించి నంద్యాల లోక్‌స‌భ ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు..కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి ఎంపీగా బ‌రిలో ఉండ‌టంతో ఓట్ల క్రాసింగ్ ఏమైనా జ‌రిగిందా అని తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేసారు.

ఆ ఏడుగురు అభ్య‌ర్దులు డుమ్మా..

ఆ ఏడుగురు అభ్య‌ర్దులు డుమ్మా..

చంద్ర‌బాబు క‌ర్నూలు జిల్లాకు వ‌స్తున్న‌ట్లు..పోటీలో ఉన్న టిడిపి అభ్య‌ర్దులు అంద‌రూ స‌మావేశానికి రావాల‌ని టిడిపి రాష్ట్ర కార్యాల‌యం నుండి మందుగానే స‌మాచారం ఇచ్చారు. అయితే, ఈ స‌మీక్ష‌కు అభ్యర్థులు అఖిల ప్రియ, బుడ్డా రాజేశేఖర్‌ రెడ్డి, కేఈ శ్యాంబాబు, టీజీ భరత్‌, తిక్కారెడ్డి, మీనాక్షి నాయుడు, కేఈ ప్రతాప్‌లు గైర్హాజయ్యారు. సమావేశానికి వచ్చిన నాయకులతోనే వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు సీఎం బయలుదేరి వెళ్లారు. వారితో ఇర‌వై నిమిషాల పాటు స‌మీక్ష చేసిన ముఖ్య‌మంత్రి తన వ‌ద్ద ఉన్న స‌మ‌చారంతో పాటుగా క్షేత్ర స్థాయిలో అభ్య‌ర్దుల వ‌ద్ద ఉన్న పోలింగ్ స‌ర‌ళి గురించి విశ్లేషించారు. అయితే, ఏడుగురు అభ్య‌ర్దులు స‌మీక్షకు రాక‌పోవ‌టం పై చ‌ర్చ మొద‌లైంది. పోలింగ్ నాడు అఖిల ప్రియ‌..గంగుల వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుఉంది. ఇక‌, తిక్కారెడ్డి చికిత్స‌లో ఉన్నారు. వీరు రాకపోవ‌టం వెనుక కార‌ణాలు ఏంటి..ముఖ్య‌మంత్రికి స‌మాధానం చెప్ప‌లేక రాలేదా ..ఏమైనా ఇత‌ర కార‌ణాలు ఉన్నాయా అనే కోణంలో చ‌ర్చ సాగుతోంది.

బాబు తేల్చి చెప్పింది ఇదే..

బాబు తేల్చి చెప్పింది ఇదే..

మ‌రో సారి టిడిపి అదినేత చంద్ర‌బాబు మ‌రోసారి త‌న గెలుపు పైన ధీమా వ్య‌క్తం చేసారు. క‌ర్నూలు జిల్లా నేత‌ల‌తో జిల్లా లోని హ‌రిత హోట‌ల్‌లో స‌మావేశ‌మైన చంద్ర‌బాబు తిరిగి పార్టీ అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చారు.
బయటనుంచి వస్తున్న పుకార్లను నమ్మవద్దని అన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 120 స్థానాలకు పైగా గెలుస్తామని, టీడీపీనే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు.

English summary
TDP Chief Chandra babu once again said that party will come in power. Babu visited kadapa and kurnool districts. Babu met with party leaders and discussed about polling trends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X