వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌జ‌లను ఇంత‌గా క‌ష్ట‌పెట్టామా..జ‌గ‌న్‌పై అభిమాన‌మా: ప‌వ‌న్ మేలు చేయ‌లేదు : చ‌ంద్ర‌బాబు ఆవేద‌న‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో వ‌చ్చిన ఫ‌లితాల మీద టీడీపీ అధినేత తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. అస‌లు ఫ‌లితాలు ఎందుకు ఇంత దారుణంగా వ‌చ్చాయి..ఎక్క‌డ త‌ప్పు చేసాం..ప్ర‌జ‌ల‌ను ఇంతగా క‌ష్ట‌పెట్టామా అంటూ ఆవేదన చెందారు. జ‌గ‌న్ పైన ఇంత అభిమానం ఉందా..ప‌వ‌న్ మేలు చేయ‌క‌పోగా న‌ష్టం చేసాడంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించిట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. టీడీపీ నేత‌లు త‌మ అధినేత‌ను క‌లిసిన స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆవేద‌న‌తో ఉన్నార‌ని చెబుతున్నారు.

ఇంత‌గా క‌ష్టపెట్టామా..జ‌గ‌న్ పై అభిమాన‌మా..
టీడీపీ అధినేత చంద్ర‌బాబు తో పార్టీ నుండి గెలిచిన కొంద‌రు నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో ఎన్నిక‌ల ఫ‌లితాల పైన విశ్లేష‌ణ జ‌రిగింది. చంద్ర‌బాబు ఇంకా ఫ‌లితాల షాక్ నుండి తేరుకోలేదు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో పార్టీ నేత‌లు సైతం ఆవేద‌న చెందారు. ఏంటీ ఫ‌లితాలు..గెలుస్తామ‌నుకున్నాం..లేకుంటే మేజిక్ ఫిగ‌ర్‌కు ప‌ది సీట్లు త‌గ్గుతాయ‌ని అంచ‌నా వేసాం. కానీ, ఫ‌లితాలు అర్దం కావ‌టం లేదు. ప్ర‌జ‌ల‌ను అంత‌గా కష్ట‌పెట్టామా..జ‌గ‌న్ పైన ఇంత అభిమాన‌మా..అంత‌లా ఎలా న‌మ్మారు. ఎక్క‌డ ఫెయిల‌య్యాం..అంటూ చంద్ర‌బాబు ఆవేద‌న‌తో మాట్లాడిన‌ట్లు చెబుతున్నారు. పార్టీ నేత‌లు సైతం స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌లు..కింది స్థాయి నేత‌ల తీరు పైన వ‌చ్చిన ఆరోప‌ణ‌లు దెబ్బ తీసాయ‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. మేరు అయిదేళ్ల పాటు ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ల‌భించ‌లేంటూ పార్టీ నేత‌లు వ్యాఖ్యానించ‌గా..ప్ర‌జ‌లకు అన్నీ తెలుసు..అన్నింటినీ బేరీజు వేసుకొనే తీర్పు ఇస్తారు..ఈ ఫ‌లితాల‌ను లోతుగా విశ్లేషించుకోవాల్సి ఉందంటూ చంద్ర‌బాబు స‌మాధానం ఇచ్చారు.

Chandra Babu did not expect this type of results..analysed with party leaders whats the reasons..

ప‌వ‌న్ మేలు చేయ‌లేదు..
జ‌న‌సేన విడిగా పోటీ చేయ‌టం ద్వారా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలుతుంద‌ని భావించాం. కానీ, ప‌వ‌న్ టీడీపీ మ‌ద్ద‌తు దారుడంటూ జ‌గ‌న్ చేసిన ప్ర‌చారం ప్ర‌జ‌లు న‌మ్మారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ప‌వ‌న్‌కు వెళ్ల‌కుండా జ‌గ‌న్‌కు వెళ్లింది. దీనికి తోడు టీడీపీకి ప‌డాల్సిన ఓట్లు కొన్ని ప్రాంతాల్లో జ‌న‌సేన వైపుకు వెళ్లాయి..అంటూ చంద్ర‌బాబు విశ్లేషించారు. ఒక‌, పార్టీ నేత‌లు మాత్రం త‌మ త‌ప్పు కాద‌ని..క్షేత్ర స్థాయిలోని జ‌న్మ‌భూమి కమిటీలు..ఆర్దికంగా ఎదురైన ఇబ్బందులు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో నేత‌ల పార్టీ మార్పులు ప్ర‌భావం చూపాయ‌ని విశ్లేషిస్తున్నారు. అనేక చోట్ల టీడీపీ అభ్య‌ర్దుల‌కు నిధులు అంద‌లేద‌ని..ఈ సారి పోల్ మేనేజ్‌మెంట్ వైసీపీ కంటే వెనుక‌బ‌డి ఉన్నామ‌ని అంగీక‌రిస్తున్నారు. అయితే, ఈ స్థాయిలో ఫ‌లితాలు వ‌స్తాయ‌ని తాము అంచ‌నా వేయ‌లేద‌ని టీడీపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
TDP Cheif Chandra Babu ab set with AP Results. Party leaders met Chandra Babu and discussed about results. Chandra Babu analysed many reasons for this mandate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X