చంద్ర‌బాబు సెల్ఫ్ గోల్‌: కొండ‌ను త‌వ్వారు..కానీ, : లోకేష్ ఎక్క‌డ : బుగ్గ‌న ఫైర్‌..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల పై వైసిపి నేత బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ తీవ్రంగా స్పం దించారు. ముఖ్య‌మంత్రి సెల్ఫ్ గోల్ చేసుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. డేటా చోరీలో ప్ర‌భుత్వ హ‌స్తం లేక‌పోతే అశోక్ ఎం దుకు పారిపోయార‌ని ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారం పై లోకేష్ ఎందుకు స్పందించ‌టం లేద‌ని నిల‌దీసారు బుగ్గ‌న‌.

చంద్ర‌బాబు సెల్ఫ్ గోల్..
ముఖ్య‌మంత్రి చంద్రబాబు మాటల్లో సెల్ఫ్‌గోల్‌ తప్ప మరేమీ లేదని, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని వైసిపి నేత బుగ్గ‌న రాజేంద్ర నాధ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై చేసిన విమర్శలకు ఆయన కౌంటర్‌ సమాధానమిచ్చారు. ఐటీగ్రిడ్స్‌ స్కాంలో టీడీపీ ప్రభు త్వ హస్తం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉ న్నా ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు అమరావతి పారిపోయారని ఆరోపించారు.

Chandra Babu done Self Goal in Data Theft : Buggana serious comments

ఏపీలో కనీ స సౌకర్యాలు కల్పించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజల సమస్యలు చంద్రబాబుకు పట్టలేదని విమర్శించారు. ఐటి వ్య‌వ‌హారం ఇంత ర‌భ‌స జ‌రుగుతుంటే సంబంధిత మంత్రి లోకేష్ ఎందుకు స్పందించ‌ర‌ని..ఆయ‌న ఎక్క‌డ ఉన్నార‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌ల వివ‌రాలు ఎలా వ‌చ్చాయి..
ఏపీలో కిడ్నాపులు, ఆస్తులు దొంగతనాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని..అంటే ఆయన పాలనలో శాంతిభద్రతలు లోపించాయని ఒప్పుకుంటున్నారని విమ‌ర్శించారు. టీడీపీ గజదొంగల పార్టీ అన్నారు. ప్రజల ఓటర్‌ ఐడీలు, ఆధార్‌ వివరాలు బయటకు ఎలా వచ్చాయంటే ప్రభుత్వం దగ్గర సమధానంలేదని దుయ్య‌బ‌ట్టారు. 50 లక్షల మంది డేటా ఉందా.. లేక 3 కోట్ల 50 లక్షల మంది డేటా ఉందా అని నిల‌దీసారు. సేవామిత్ర యాప్‌లో ఉన్న వ్యక్తిగత స మాచారాన్ని ఎందుకు తొలగించారని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం పథకాలు అందిన ప్రజల వివరాలు టీడీపీ యాప్‌లోకి ఎ లా వచ్చాయో చెప్పాల్సిన ఉంద‌న్నారు. దొంగతనం వేరేవాళ్లు చేసి ఉంటే ఐటీగ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ ఎందుకు పారిపో యాడో చెప్పాల‌న్నారు. ఓట్ల తొలగింపుపై విజయసాయిరెడ్డి సీఈసీకి ఫిర్యాదు చేయడం తప్పా అని బుగ్గ‌న ప్ర‌శ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+