వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారే ఎందుకు ల‌క్ష్యం, గెల‌వటానికి వీళ్లేదు : చ‌ంద్ర‌బాబు - జ‌గ‌న్ టార్గెట్‌ ఎవ‌రో తెలుసా..!

|
Google Oneindia TeluguNews

అటు ముగ్గురు..ఇటు ముగ్గురు. అటు నుండి వారు గెల‌వ‌కూడ‌దు. ఇటు నుండి వీరు గెల‌వ‌కూడ‌దు. చంద్ర‌బాబు -జ‌గ‌న్ తొలి టార్గెట్ వారే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వ్యూహా ప్ర‌తి వ్యూహాలు అమ‌లు చేస్తున్న ఈ ఇద్ద‌రు వ్య‌క్తిగ‌తంగా రెండు పార్టీల నుండి ముగ్గురు చొప్పున ల‌క్ష్యంగా చేసుకున్నారు. అధికారం ద‌క్కించుకోవ‌ట‌మే వీరి అస‌లి ల‌క్ష్యం అయినా.. అటు ముగ్గురు..ఇటు ముగ్గురు మాత్రం అసెంబ్లీలో కాలు పెట్ట‌టానికి వీళ్లేద‌ని చెబుతున్నార‌ని స‌మాచారం. ఇంత‌కీ ఆ పార్టీలో ఎవ‌రా ముగ్గురు..ఈ పార్టీలో ఆ ముగ్గురు ఎవ‌రు...ఏంటి ఆ ల‌క్ష్యం..

చంద్రబాబు గురి పెట్టిందెవ‌రి మీద అంటే...

చంద్రబాబు గురి పెట్టిందెవ‌రి మీద అంటే...

వారు టిడిపి లో ప‌ని చేసిన వారే. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఉన్న‌వారే. కానీ,ఇప్పుడు చంద్ర‌బాబు పేరు ఎత్తితేనే విరుచుకుప‌డుతున్నారు. ఇప్పుడు వారిని చంద్ర‌బాబు ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారు వ‌చ్చే ఎన్ని క‌ల్లో గెల‌వ‌టానికి లేద‌ని చెబుతున్నారు. అందులో మొద‌టి స్థానం వైసిపి ఎమ్మెల్యే రోజా. ముఖ్య‌మంత్రి సొంత జిల్లా న‌గ‌రి నుండి ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇప్ప‌డుఉ చంద్ర‌బాబు తో పాటుగా లోకేష్ కు ల‌క్ష్యంగా మారారు. రాజ‌కీయంగా ఇద్ద‌రిని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించ‌టం తో పాటుగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే కార‌ణంగా న‌గ‌రి స్థానం లో రోజా పై బ‌ల‌మైన అభ్య‌ర్ధి కోసం టిడిపి అన్వేసిస్తోంది. వాణి విశ్వ‌నాద్‌, దివ్య వాణి వంటి పేర్ల‌ను ప‌రిశ‌లించారు. ఇక‌, రెండో ల‌క్ష్యం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తొలుత టిడిపి నుండే రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన నాని..ఇప్పుడు చంద్ర‌బాబు పై అవ‌కాశం దొరికితే ఫైర్ అవుతున్నారు. నంద‌మూరి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నాని పై గుడివాడ‌లో గ‌ట్టి పోటీ ఇచ్చే వారిని బ‌రిలోకి దింపి నాని అసెంబ్లీలో అడుగు పెట్ట‌కుండా చూడాల‌నే గ‌ట్టి ప‌ట్ట‌ద‌ల తో చంద్ర‌బాబు - లోకేష్ ఉన్నార‌ని స‌మాచారం. ఇక‌, మూడో ల‌క్ష్యం..ద‌గ్గుబాటి కుటుంబం. కుటుంబ వైరుధ్యాల‌తో ద‌గ్గు బాటి- నారా వారి మ‌ధ్య అగాధం ఏర్ప‌డింది. ఇప్పుడు అది మ‌రింత పెరిగింది. దీంతో..ద‌గ్గుబాటు కుటుంబ ఏ పార్టీ నుండి పోటీ చేసినా అసెంబ్లీలో ఆ కుటుంబం వారెవ‌రూ కాలు పెట్ట‌కూడ‌ద‌న్న‌ది నారా వారి శ‌ప‌ధంగా ప్ర‌చారం జ‌రుగు తోంది. దీంతో..వీరిని ప్ర‌ధాన ల‌క్ష్యంగా చేసుకొని టిడిపి అడుగులు వేస్తోంది.

జ‌గ‌న్ ల‌క్ష్యం ఆ నేత‌లే..!

జ‌గ‌న్ ల‌క్ష్యం ఆ నేత‌లే..!

వైసిపి నుండి గెలిచి టిడిపిలోకి ఫిరాయించి త‌న‌నే టార్గెట్ చేసిన ఆ ముగ్గురి పై జ‌గ‌న్ స్పెష‌ల్ గా ఫోక‌స్ పెట్టారు. త‌న సొంత జిల్లాలో త‌నతో పాటు ఉండే ప్ర‌స్తుత మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి జ‌గ‌న్ తొలి ల‌క్ష్యంగా చెబుతున్నారు. జ‌గ‌న్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్న ఆదినారాయ‌ణ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపిగా అయినా..ఎమ్మెల్యేగా అయినా ఏ విధం గా పోటీ చేసినా ఓడించాల్సిందేన‌ని జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రెండో ల‌క్ష్యం..మంత్రి సుజ‌య రంగారావు. వైసిపి ఎమ్మెల్యేగా బొబ్బిలి నుండి గెలిచిన ఆయ‌న పార్టీ ఫిరాయించి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. చివ‌రి నిమిషం వ‌ర‌కు పార్టీ లోనే ఉంటాన‌ని హామీ ఇచ్చి మోసం చేసార‌నే భావ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు. దీంతో..సుజ‌య రంగారావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌నీయ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ సంక‌ల్పం. ఇక‌, మంత్రి దేవినేని ..జ‌లీల్ ఖాన్ ల‌పై జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌లీల్ ఖాన్ కు సీటు ద‌క్కుతుందో లేదో అనుమాన‌మే అనే చ‌ర్చ పార్టీలో ఉంది. ఇక‌, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా ను ఓడించ‌గలిగితే..వైసిపికి అక్క‌డ అది బ‌లంగా మారుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో..కృష్ణా జిల్లాలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు.

జంప్ జిలానీలే ప్ర‌ధాన ల‌క్ష్యంగా..

జంప్ జిలానీలే ప్ర‌ధాన ల‌క్ష్యంగా..

గ‌తంలో టిడిపిలో ప‌ని చేసి వైసిపి లో చేరి ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఈ సారి టిడిపి నేత‌లు ప్ర‌ధాన టార్గెట్ గా మారు తున్నారు. వైసిపి లో వాయిస్ బ‌లంగా వినిపించే అనిల్ కుమార్ యాద‌వ్, బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి, అంబ‌టి రాంబాబు, సీయం సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, బొత్సా స‌త్య‌నారాయ‌ణ, శిల్పా బ్ర‌దర్స్‌ వంటి వారి నియోజ‌క‌ర్గాల్లో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. వీరిని వారి నియోజ‌క వ‌ర్గాల్లోనే ఆత్మ ర‌క్ష‌ణ‌లో పడేస్తే వైసిపి పై పైచేయి సాధించ‌వ‌చ్చ‌నేది ఆయ‌న వ్యూహంగా క‌నిపిస్తోంది. అదే విధంగా టిడిపి లో మంత్రులు..అచ్చంనాయుడు, గంటా, పుల్లారావు, అమ‌ర‌నాధ రెడ్డి, అఖిల ప్రియ‌, సునీత‌, ఫ‌రూక్ తో పాటుగా ఎమ్మెల్యేలు బుచ్చ‌య్య చౌద‌రి, య‌ర‌ప‌తినేని శ్రీనివ‌సరావు, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, ప‌య్యావుల కేశ‌వ్ వంటి వారిని వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కే ఎన్నిక‌ల్లో ప‌రిమితం చేయాల‌నేది వైసిపి నేత‌ల వ్యూహం. దీంతో..రెండు పార్టీలు ప్ర‌త్య‌ర్ధి పార్టీలోని కీల‌క నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని త‌మ పార్టీల అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న‌..కార్యాచ‌ర‌ణ సిద్దం చేసుకుంటున్నాయి.

English summary
TDP and YCP Chief's politically target some leaders in opposite parties. To defeat them both tdp and ycp leaders setting strategy in coming elections. Now, these leaders issue become more interesting in two parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X