వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌య‌స్ నేత‌ల‌తో క‌లిస్తే..అంతే : పార్టీ నేత‌ల‌కు చంద్ర‌బాబు అల్టిమేటం: మ‌ంత్రులే బంధువులు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..టిడిపి అధినేత చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. కెటిఆర్ -జ‌గ‌న్ మీటింగ్ పై మండిప‌డిన టిడిపి నేత‌లు..త‌మ పై విమ‌ర్శ‌లు రాకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. అందులో భాగంగా.. టిఆర్‌యస్ నేత‌ల‌తో కలిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. ఇదే స‌మ‌యంలో ఏపి క్యాబి నెట్ లోని కొంద‌రు మంత్రులు తెలంగాణ‌లోకి కొంద‌రు మంత్రుల‌తో ఉన్న బంధుత్వాల‌ను గుర్తు చేస్తున్నారు.

టిఆర్‌య‌స్ నేత‌ల ప‌ర్య‌ట‌న‌ల్లో పాల్గొంటే..అంతే..

టిఆర్‌య‌స్ నేత‌ల ప‌ర్య‌ట‌న‌ల్లో పాల్గొంటే..అంతే..

టిడిపి అధినేత‌..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క హెచ్చ‌రిక చేసారు. తాజాగా ఏపికి వ‌చ్చిన తెలంగాణ మంత్రి త‌ల‌సా ని శ్రీనివాస యాద‌వ్ ఏపి ముఖ్య‌మంత్రి పై ప‌లు ఆరోప‌ణ‌లు చేసారు. ఆయ‌నకు విజ‌య‌వాడ‌..తూర్పు గోదావ‌రి జిల్లాల కు చెందిన ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు ఘ‌న స్వాగ‌తం పలికారు. దీంతో..టీఆర్‌ఎస్‌ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనరాదని...ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని చంద్ర‌బాబు తేల్చిచెప్పారు. బంధుత్వా లు, స్నేహాల పేరుతో పార్టీని ఫణంగా పెట్టొద్దన్నారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బ తీసే చర్యలను సహించేది లేదన్నా రు. తెలంగాణలో జాబితా నుంచి 26 కులాలను తొలగించి బీసీలకు అన్యాయం చేశారన్న చంద్ర‌బాబు..వారే ఏపికి వ‌చ్చి అదే బీసీలపై కపటప్రేమ చూపిస్తున్నారని సీఎం తీవ్రస్థాయిలో మండి పడ్డారు.

ఇక్క‌డి మంత్రులు..అక్క‌డి మంత్రుల‌తో బంధుత్వాలు..

ఇక్క‌డి మంత్రులు..అక్క‌డి మంత్రుల‌తో బంధుత్వాలు..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బంధుత్వా లు, స్నేహాల పేరుతో పార్టీని ఫణంగా పెట్టొద్దని వ్యాఖ్యానించారు. అయితే, ఏపి క్యాబినెట్‌లో ఆర్దిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు- తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మ‌ధ్య బంధుత్వం ఉంది. ప్ర‌స్తుత టిటిడి చైర్మ‌న్ ..య‌న‌మ‌ల కు వియ్యంకులు. టిటిడి ఛైర్మ‌న్ సుధాక్ యాద‌వ్ - త‌ల‌సాని మ‌ధ్య బంధు త్వం ఉంది. ఒక‌, తెలంగాణ లోని టిఆర్‌య‌స్ నేత‌లు..ఏపిలోని టిడిపి లోని అనేక మంది నేత‌ల మ‌ధ్య ద‌శాబ్దాలుగా స్నేహ బంధాలు ఉన్నాయి. త‌ల‌సాని విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన స‌మయంలో ర్యాలీ నిర్వ‌హించిన వారు.. అదే విధంగా గోదావ‌రి జిల్లాలో స్వాగ‌తం ప‌లిక‌న వారు త‌ల‌సాని సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. అందులో టిడిపి -వైసిపి కి చెంది న వారు ఉన్నారు. ఇప్పుడు సీయం చేసిన వ్యాఖ్య‌ల‌తో ఈ బంధుత్వాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

టిడిపి పై మ‌చ్చ లేకుండా..వైసిపి ని కార్న‌ర్ చేస్తూ..

టిడిపి పై మ‌చ్చ లేకుండా..వైసిపి ని కార్న‌ర్ చేస్తూ..

ఇప్పుడు రాష్ట్ర - జాతీయ రాజ‌కీయాల్లో కెసిఆర్ వ‌ర్సెస్ చంద్ర‌బాబు అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది. దీంతో..రాజ‌కీయం గా ఒక‌రిని మరొక‌రు దెబ్బ తీయ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏపికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నార‌ని..అటువంటి టిఆర్‌య‌స్ తో జ‌గ‌న్ క‌లుస్తున్నార‌నే ప్ర‌చారం ద్వారా సెంటిమెంట్ పండించేందుకు టిడిపి ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టి కే చంద్ర‌బాబు హ‌రికృష్ణ మ‌ర‌ణం స‌మ‌యంలో కెటిఆర్ తో పొత్తు గురించి ప్ర‌తిపాదించిన విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో వైసిపి - టిఆర్‌య‌స్ మ‌ధ్య స్నేహం గురించి విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని టిడిపి అధినాయ‌క‌త్వం పార్టీ శ్రేణుల‌కు సూచించింది. ఈ ప‌రిస్థితుల్లో టిడిపి అధినేత రాజ‌కీయంగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నారు. ఇదే స‌మ‌యంలో..విజ‌య‌వాడ కన‌క‌దుర్గ దేవాలయం అధికారుల‌కు సీయంఓ కొన్ని సూచ‌న‌లు చేసింది. దేవా లయం ప్రాంగ‌ణంలో రాజ‌కీయ ఆరోప‌ణ‌లు తావు లేకుండా చూడాల‌ని ఆదేశించారు.

English summary
AP C.M Chandra Babu naidu warned party leaders to do not participate TRS leaders programmes in name of relation or friendship. He decided to counter TRS - YCP political relation ship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X