India
  • search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఫొటో పీకేసిన కేశినేని నాని - ఆ స్థానంలో : పార్టీ నేతలతో కట్- ఒక తాడో పేడో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

విజయవాడ ఎంపీ కేశినేని రాజకీయ అడుగులు బెజవాడ పాలిటిక్స్ లో వేడి పుట్టిస్తున్నాయి. కేశినేని నాని 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా వరుసగా రెండో సారి గెలిచారు. జగన్ హవా సమయం లో ఆయన పార్లమెంటరీ పరిధిలో వ్యతిరేకత కనిపించినా..ఎంపీగా మాత్రం ఆయనకే మెజార్టీ ఓట్లు దక్కాయి. అయితే, రెండోసారి గెలిచిన సమయం నుంచి ఆయన పార్టీ తీరు పట్ల ఏదో సందర్భంలో అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రవాణా శాఖ అధికారుల తీరు పైన బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేసారు.

రెండో సారి గెలిచిన సమయం నుంచీ

రెండో సారి గెలిచిన సమయం నుంచీ

ఏకంగా తన కేశినేని ట్రావెల్స్ మూసేసి..ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేసారు. ఈశాన్య రాష్ట్రాల్లో బస్సుల రిజిస్ట్రేషన్ చేయించి ఏపీలో ఏ రకంగా అక్రమాలకు పాల్పడుతోంది అప్పట్లోనే కేశినేని బయట పెట్టారు. ఇక, ఎన్నికల తరువాత గుంటూరు ఎంపీ జయదేవ్ కు టీడీపీ అధినేత లోక్ సభ పార్టీ నేతగా నిర్ణయించారు. విజయవాడ నగరంలో పార్టీ నేతలు పార్టీ కోసం పని చేయటం లేదనేది నాని ఆరోపణ. నగర టీడీపీ నేతలు వర్సెస్ కేశినేని నాని అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారింది. దీని పైన చంద్రబాబు సీరియస్ గా చర్యలు తీసుకోకపోవటం కూడా నానికి రుచించటం లేదని చెబుతున్నారు.

ఇక టీడీపీకి దూరంగానే ఉంటారా

ఇక టీడీపీకి దూరంగానే ఉంటారా

ఇక, నాని కుమార్తె శ్వేత విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ సమయంలో ఎన్నికల్లో పార్టీ నేతలు సహకరించలేదనే మరో వాదన టీడీపీలో వినిపిస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితం కేశినేని తాను ప్రస్తుత ఎంపీ టర్మ్ పూర్తయ్యే వరకు మాత్రమే రాజకీయాల్లో ఉంటానని.. ఆ తరువాత పార్టీ నుంచి పోటీ చేయనని స్పష్టం చేసారు. తనతో పాటుగా తన కుమార్తె సైతం ఎన్నికల్లో పోటీకి దిగరంటూ తన సన్నిహితులకు స్పష్టం చేసారు. దీని పైన పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం ఇదే సమాచారం పంపినట్లు చెబుతున్నారు.

పార్టీ అధినాయకత్వంపైనే అసహనం

పార్టీ అధినాయకత్వంపైనే అసహనం


అయినా, పార్టీ అధినాయకత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించ లేదు. దీంతో..కేశినేని ఇక టీడీపీలో కొనసాగటం కష్టమనే అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. నానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కేంద్ర మంత్రులు గడ్కరీ..రాజ్ నాధ్ సింగ్ లాంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక దశలో ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ సాగింది. అయితే, ఈ టర్మ్ పూర్తయ్యే వరకూ తాను టీడీపీలోనే ఉంటానని నాని చెప్పినట్లుగా ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇక, తాజాగా.. విజయవాడలోని కేశినేని నాని కార్యాలయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

చంద్రబాబు ఫొటో స్థానంలో రతన్ టాటా

చంద్రబాబు ఫొటో స్థానంలో రతన్ టాటా

కార్యాలయం బయట గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని తాజాగా పీకేయించి, అదే స్థానంలో రతన్‌టాటాతో కలిసి ఉన్న తన ఫొటోను ఏర్పాటు చేశారు. కేశినేని భవన్‌ వెలుపల ఏర్పాటు చేసిన తన పార్లమెంటరీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలను కూడా తొలగించేశారు. వాటి స్థానంలో టాటా ట్రస్టు, తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన ఫొటోలను ఏర్పాటు చేసారు.

Tollywood Producers Meets AP minister Perni Nani
కేశినేని నాని రాజకీయ అడుగులు ఎటు వైపు

కేశినేని నాని రాజకీయ అడుగులు ఎటు వైపు

గతంలో రతన్ టాటాను విజయవాడకు తీసుకొచ్చిన కేశినేని నాని ఆయన ట్రస్టు ద్వారా తన నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలకు ఒప్పించారు. ఇప్పుడు ఆయన ఫొటో పెట్టటం ద్వారా కేశినేని నాని సైతం సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపుత్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా చంద్రబాబుతో సహా బెజవాడ టీడీపీ నేతలు ఫొటోలు సైతం తొలిగించటంతో ఇక వారితో దూరంగానే ఉండాలని నాని నిర్ణయించారా అనే చర్చ మొదలైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధినేత ఫొటో తొలిగించటం ఇప్పడుు బెజవాడ పాలిటిక్స్ తో పాటుగా టీడీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

English summary
Vijayawada TDP MP Kesineni NAi removed Chandra Babu photo at his office replaced with Ratan Tata Photo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X