• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్ర‌బాబు ఎందుకిలా..సీయ‌స్ తో స‌హా అంద‌రూ కుమ్ముక్కేనా: ఏకాకి అవుతున్నారా..!

|

40 ఏళ్ల అనుభ‌వం. టిడిపి అధినేత ప‌దే ప‌దే చెప్పుకొనే మాట‌. అంత అనుభ‌వం ఉన్న నేత కొద్ది రోజులు గా చేస్తున్న వ్యాఖ్య‌ల పై ఇప్పుడు జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కుమ్మ‌క్కు రాజ‌కీయా లంటూ విస్తృతంగా ప్ర‌చారం చేసారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా ఎన్నిక‌ల సంఘం పై విమ‌ర్శ‌లు..అంతటి తో ఆగ‌లేదు. ఏకంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పైనా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు ఎందుకిలా..

రాష్ట్ర వ్యాప్తంగా 79.64 శాతం పోలింగ్ : టాప్ లో ప్ర‌కాశం: అత్య‌ల్పం .. విశాఖ జిల్లాలో..!

అంద‌రూ కుమ్మ‌క్కేనా...

అంద‌రూ కుమ్మ‌క్కేనా...

ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన నాటి నుండి ప్ర‌ధాని మోదీ లక్ష్యంగా చంద్ర‌బాబు రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్రారంభించారు. ఏపికి సాయం చ‌య‌టం లేద‌ని...ఏపి ని ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నారంటూ ఆరోప‌ణ లు చేసారు. ఇక‌, తెలంగాణ ఎన్నిక‌లు త‌రువాత కేసీఆర్ తాను చంద్ర‌బాబు కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించ‌టంతో..అప్పటి నుండి చంద్రబాబు టార్గెట్ లిస్టులో కేసీఆర్ సైతం చేరారు. ఏపి లో ఎన్నిక ల ప్ర‌చారంలో మోదీ..కేసీఆర్‌..జ‌గ‌న్ కుమ్మ‌క్కై ఏపికి ద్రోహం చేస్తున్నారంటూ ప్ర‌చారం చేసారు. ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజుల్లో విమ‌ర్శ‌లు మ‌రింత తీవ్ర‌త‌రం చేసారు.

ఇప్పుడు ఈసీ..సీయ‌స్‌..పైనా

ఇప్పుడు ఈసీ..సీయ‌స్‌..పైనా

ఎన్నిక‌ల సంఘం ఈ మ‌ధ్య కాలంలో ఏపికి సంబంధించి తీసుకున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అయ్యా యి. వైసిపి ఫిర్యాదు మేర‌కు ఇంట‌లిజెన్స్ డిజి మొద‌లు ముగ్గురు ఎస్పీలు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ని బ‌దిలీ చేయ‌టం పై చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ని బ‌దిలీ చేసే ముందు ఎవ‌రిని నియ‌మించాల‌నే అంశం పై సంప్ర‌దించ‌క పోవ‌టాన్ని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కొత్త సీయ‌స్ గా ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం నియామ‌కం పైనా ఆరోప‌ణ‌లు చేసారు. ఆయ‌న్ను కోవ‌ర్టు అని ఆరోపించ‌టంతో పాటుగా జ‌గ‌న్ సహ ముద్దాయి అంటూ విమ‌ర్శించారు. అయితే, గ‌తంలోనే కోర్టు ఆయ‌న పై ఎమ్మార్ వ్య‌వ‌హారంలో వ‌చ్చిన అభియోగాల‌ను కొట్టేసింది. ఇవియం ల స‌మ‌స్య‌ల పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. సీఈవో కార్యాల‌యం ముందు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఎన్నిక‌ల సంఘం మోదీ చేతిలో ఉందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు.

చంద్ర‌బాబు ఒంట‌రి అవుతున్నారా..

చంద్ర‌బాబు ఒంట‌రి అవుతున్నారా..

తొలి సారిగా ఎన్నిక‌ల్లో టిడిపి ఒంట‌రి పోరాటం చేసింది. పోలింగ్ జ‌రిగే స‌మ‌యంలోనే చంద్ర‌బాబు ఎన్ని క‌ల సంఘం పై ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఇక‌, పోలింగ్ ముగిసిన త‌రువాత ఎన్నిక‌ల సంఘం పై నిప్పు లు చెరిగారు. కేంద్ర‌లో మోదీ..పొరుగు రాష్ట్ర సీయం కేసీఆర్‌..ఇక ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ను పొలిటిక‌ల్ గా కార్న‌ర్ చేయ‌టం అనేది రాజ‌కీయం కోణంగా చూడ‌వచ్చు. కానీ, ఎన్నిక‌ల సంఘం పై ఆ స్థాయిలో ఆరోప ణ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉందా..ఇక‌, తాను ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా తాను ఉన్న స‌మ‌యంలో బా ధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న సీయ‌స్ పై ఆ స్థాయిలో మీడియా స‌మావేశంలో విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రి కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. రాజ‌కీయంగా అంద‌రికీ ఒక వేదిక పై తేవ‌టంలో చంద్ర‌బాబు సిద్ద హ‌స్తు లు. అటువంటిది..ఇప్పుడు అంద‌రి పైనా ఆరోప‌ణ‌లు చేస్తూ ఒంట‌రి అవుతున్నారా అనే చ‌ర్చ అన్ని వ‌ర్గాల్లోనూ జ‌రుగుతోంది.

English summary
TDP Chief Chandra babu latest comments caused for more discussions in all sections. Babu comments on Elections commission and Chief secretary. these comments leading to new equations in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X