వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెన్ష‌న్ వ‌య‌సు 65 నుండి 60 కి త‌గ్గింపు : ప‌సుపు-కుంకుమ కొన‌సాగింపు : టిడిపి మేనిఫెస్టో విడుద‌ల‌..

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : పెన్ష‌న్ వ‌య‌సు 65 నుండి 60 కి త‌గ్గింపు.. టిడిపి మేనిఫెస్టో | Oneindia

పోలింగ్ తేదీ స‌మీపిస్తోంది. ప్ర‌చారం ప‌తాక స్థాయికి చేరింది. ఉగాది రోజున వైసిపి..టిడిపి వ‌రుస‌గా త‌మ ఎన్నిక‌ల మే నిఫెస్టోల‌ను విడుద‌ల చేసారు. మీ భవిష్యత్‌.. నా బాధ్యత పేరుతో టిడిపి అధినేత చంద్ర‌బాబు మేనిఫెస్టోను ప్ర‌క‌టిం చారు. పెన్ష‌న్ల వ‌య‌సును 65 నుండి 60 ఏళ్లకే త‌గ్గిస్తామ‌ని హామీ ఇచ్చారు. ప‌సుపు-కుంకుమ‌, అన్న‌దాత సుఖీభ‌వ ప్రతీ ఏడాది అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

కౌలు రైతుల‌కూ అన్న‌దాత సుఖీభ‌వ‌..

కౌలు రైతుల‌కూ అన్న‌దాత సుఖీభ‌వ‌..

ఏపిలో ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న అన్న‌దాత సుఖీభ‌వ కౌలు రైతుల‌కూ అమ‌లు చేస్తామ‌ని టిడిపి అధినేత హామీ ఇ చ్చారు. వృద్దాప్య పెన్ష‌న్ల అర్హ‌త వ‌య‌స్సు 65 ఏళ్ల నుండి 60 ఏళ్ల‌కే త‌గ్గిస్గున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప సుపు - కుంకుమ కొన‌సాగిస్తామ‌న్నారు. ఉచితంగా ఉన్న‌త విద్య అందుబాటులో తెస్తామ‌ని.. ప్ర‌భుత్వ ప‌రిధిలోని ఉన్న ఉద్యోగాల‌న్నీ భ‌ర్తీ చేయ‌టం..అదే విధంగా ప్ర‌యివేటు రంగంలో ఉద్యోగాల క‌ల్ప‌న పై దృష్టి పెడ‌తామ‌న్నారు. ఆరోగ్య శ్రీ ప‌రిమితిని అయిదు ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు. చంద్రన్న భీమా అయిదు ల‌క్ష‌ల నుండి ప‌ది ల‌క్ష‌ల కు పెంచుతూ మేనిఫెస్టోలో ప్ర‌తిపాదించారు. పెళ్లి కానుక ల‌క్ష కు పెంచ‌టంతో పాటుగా అంద‌రికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌తీ ఎక‌రాకు నీళ్లందిస్తామ‌ని హామీ ఇచ్చారు. రైతులంద‌రికీ ఉచితంగా పంట ల భీమా ప‌ధ‌కం అమ‌లు చేస్తామ‌న్నారు.

ప‌గ‌టిపూట 12 గంట‌ల ఉచిత విద్యుత్..

ప‌గ‌టిపూట 12 గంట‌ల ఉచిత విద్యుత్..

రైతుల‌కు ప‌గటిపూట 12 గంట‌ల ఉచిత విద్యుత్ స‌ర‌ఫరా అందిస్తామ‌న్నారు. అయిదు వేల కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని.. వ్య‌వ‌సాయ పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌ల కోసం స్థిరీక‌ర‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించా రు. 40 ల‌క్ష‌ల ఎక‌రాల విస్తీర్ణం లో ఉద్యాన పంట‌ల‌ను కోటి ఎక‌రాల‌కు విస్త‌రిస్తామ‌న్నారు. యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామ‌ని.. ఇంటర్‌ పాసైతే చాలు నిరుద్యోగ భృతి ఇస్తామ‌న్నారు. ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. పేద కుటుంబాలకు పం డుగల నాడు ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామ‌న్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పదేళ్లు కొనసాగింపు..రెసిడెన్షి య ల్‌ పాఠశాలల ఏర్పాటు... కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ విదేశీ విద్య కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ప‌ది వేల కోట్ల‌తో బీసీలకు ప్ర‌త్యేక బ్యాంకు..

ప‌ది వేల కోట్ల‌తో బీసీలకు ప్ర‌త్యేక బ్యాంకు..

ఏపిలో మాదిగ, రెల్లిలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామ‌న్నారు. 10 వేల కోట్లతో బీసీల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత క‌ల్పిస్తామ‌న్నారు. ప్ర‌తి కుటుంబానికి రూ.20వేలు ఆదాయం కల్పించేలా చర్యలు తీస‌కుంటామ‌న్నారు. డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు అందిస్తామ‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేసారు. మహిళా ఉద్యోగినులకు ద్విచక్రవాహనాల కొనుగోలుకు రాయితీలు..చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ ఇచ్చాం. విదేశీ విద్య కు రూ.25 లక్షలు ఇస్తామ‌ని.. అన్ని విధాలా కాపుల్లోని పేదలను ఆదుకొనేందుకు అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

English summary
TDP chief Chandra babu released party manifest for 2019 elections. Babu announced pension age for 60 yrs. Pasupu - Kumkuma and Annadata Sukhibhava continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X