అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌లా నేను అడ్డంగా దొర‌క‌ను:పాలిచ్చే ఆవును వ‌ద‌లి..త‌న్నే..తెచ్చిపెట్టుకున్నారు: బాబు పైర్‌..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. త‌న అవినీతి గురించి ప్ర‌తీ రోజు సీ ఎం మాట్లాడుతున్నార‌ని..అవినీతిని వెలికి తీయండి అంటూ అధికారుల పైన ఒత్తిడి చేస్తున్నారంటూ మండి ప‌డ్డారు. తాను జ‌గ‌న్ లాగా అడ్డంగా దొరికిపోయే వాడిని కాద‌ని..నీతి నిజాయితీతో పాల‌న చేసాన‌ని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఎన్నిక‌ల్లో ఓట‌మి షాక్ నుండి ఇంకా తేరుకోలేద‌న్నారు. తాను ఇచ్చిన నీళ్లు తాగి ఓట్లు మాత్రం త‌న‌కు వేయ‌లేద‌ని వివ‌రించారు. పాలిచ్చే ఆవును వ‌దిలి..త‌న్నే...తెచ్చిపెట్టుకున్నారంటూ కీల‌క కామెంట్ చేసారు. త‌న భ‌ద్ర‌త‌తోనే ప్ర‌భుత్వం అడుకుంటోందంటూ వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్‌లా అడ్డంగా దొర‌క‌ను..

జ‌గ‌న్‌లా అడ్డంగా దొర‌క‌ను..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తాను జ‌గ‌న్ త‌ర‌హాలో అడ్డంగా దొర‌క‌న‌ని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా అయిదేళ్లు ఉన్నార‌ని..ముఖ్య‌మంత్రి అయి రెండు నెల‌లు అయింద‌న్నారు. ఈ మొత్తం కాలంలో ఆయ‌న త‌న అవినీతి గురించే ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్త‌న్నార‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌తీ విష‌యంలో అవినీతిని వెలికితీయండి అంటూ అధికారుల పైన ఒత్తిడి చేస్తున్నార‌ని ఆరోపించారు. తాను జ‌గ‌న్‌లాగా అవినీతి చేయ‌లేద‌ని..ముఖ్య‌మంత్రిగా నీతి నిజాయితీగా ప‌ని చేసాన‌ని చెప్పుకొచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయ‌టానికి కేంద్రం త‌మ‌కు అప్ప‌గించింద‌ని..దాదాపు 71 శాతం ప‌నులు పూర్తి చేసామ‌ని వివ‌రించారు. ఇప్పుడు పోల‌వ‌రం ప‌నులు నిలిపివేసి మొత్తంగా ప్రాజెక్టును ముంచేసే ప‌రిస్థితి తీసుకొచ్చార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీగా మార్చేసార‌ని మాజీ ముఖ్య‌మంత్రి ఆరోపించారు.

నా క‌ష్టాన్ని ప్ర‌జ‌లు గుర్తించ‌లేదు..

నా క‌ష్టాన్ని ప్ర‌జ‌లు గుర్తించ‌లేదు..

అయిదేళ్ల పాటు నిద్ర‌హారాలు లేకుండా రాష్ట్రం కోసం కష్ట‌ప‌డ్డానంటూ చంద్ర‌బాబు వివిరించారు.అయితే, ప్ర‌జ‌లు త‌న క‌ష్టాన్ని గుర్తించ‌లేద‌నే భాద అప్పుడ‌ప్పుడు క‌లుగుతూ ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. అయినా స‌రే..తాను చివ‌రి దాకా ప్ర‌జ‌ల కోస‌మే పోరాడుతాన‌ని స్ప‌ష్టం చేసారు. పాలిచ్చే అవును కాద‌ని..త‌న్నే .... ను తెచ్చుకున్న‌ట్లుగా ఉందంటూ చంద్ర‌బాబు కామెంట్ చేసారు. తాను ఇచ్చిన పట్టిసీమ నీరు తాగార‌ని..త‌న‌కు మాత్రం ఓట్లు వేయ‌లేద‌ని వాపోయారు.

ఆరు అధికారంలోకి వ‌స్తే టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఊరు వ‌దిలి వెళ్లాలా అని ప్ర‌శ్నించారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల మీద కేసులు పెడితే తిరిగి పెట్టాల‌ని సూచించారు. పోలీసులు కేసులు స్వీక‌రించ‌క‌పోతే కోర్టుల్లో ప్ర‌యివేటు కేసులు దాఖలు చేయా ల‌ని చంద్ర‌బాబు నిర్ధేశించారు. చివ‌ర‌కు త‌న భ‌ద్ర‌త‌తో కూడా వైసీపీ ప్ర‌భుత్వం ఆడుకుంటుందోంటూ చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు.

కేసీఆర్‌తో క‌లిసి శ్రీశైలంకు నీరు తెస్తార‌ట‌..

కేసీఆర్‌తో క‌లిసి శ్రీశైలంకు నీరు తెస్తార‌ట‌..

కార్య‌క‌ర్త‌ల‌కు ఏం జ‌రిగినా తాను అండ‌గా ఉంటాన‌ని చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు. ఎన్నిక‌ల ముందు కొన్ని చోట్ల కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని..అన్నింటినీ స‌రి దిద్దుకొని పార్టీ కోసం ప‌ని చేయాల‌ని సూచించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో క‌లిసి జ‌గ‌న్ శ్రీశైలంకు నీరు ఇస్తారంట అంటూ ఎద్దేవా చేసారు. వీరిద్ద‌రు ఇప్పుడు క‌లిసి ఉన్నార‌ని నిర్ణ యం తీసుకుంటే..భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు వస్తే ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటాలు చేయాల‌ని చంద్రబాబు పార్టీ నేత‌ల‌కు నిర్ధేశించారు.

English summary
TDP Chief Chandra babu serious comments on Cm Jagan. Babu says he did not any corruption in his five years administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X