వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఈఓ బ్లాక్ ఎదుట చ‌ంద్ర‌బాబు ధ‌ర్నా : ఎన్నిక‌ల సంఘం మోదీ అదేశాల‌తో ప‌ని చేస్తోంది..నిర‌స‌న‌గా..!

|
Google Oneindia TeluguNews

మ‌రి కొద్ది గంట‌ల్లో ఏపిలో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యంలో టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌ధానాధి కారి కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. తొలుత ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాలను నిర‌సిస్తూ రాసిన లేఖ‌ను ఏపి ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదికి అంద‌చేసారు. ఆ వెంట‌నే ఆయ‌న కార్యాల‌యం ఎదుట ధ‌ర్నాకు దిగారు..

<strong>ఇసి పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం: సీఈసి కి ఘాటు లేఖ: స‌్పందించ‌కుంటే నిర‌స‌న‌కు స‌మాయ‌త్తం..!</strong>ఇసి పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం: సీఈసి కి ఘాటు లేఖ: స‌్పందించ‌కుంటే నిర‌స‌న‌కు స‌మాయ‌త్తం..!

ఇసి కార్యాల‌యం ఎదుట చంద్ర‌బాబు ధ‌ర్నా..

ఇసి కార్యాల‌యం ఎదుట చంద్ర‌బాబు ధ‌ర్నా..

ఎన్నిక‌ల స‌మ‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ వైసిపి నేత‌ల జేబు సంస్థ‌గా మారింద ని ఆరోపించారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ‌దిలీల స‌మ‌యంలో క‌నీపం వివ‌ర‌ణ కూడా తీసుకోవటం లేద‌న్నారు. ఎన్నిక ల కోడ్ అమ‌ల్లో ఉన్న స‌మ‌యంలో ఐటి దాడులు ఎలా జ‌రుగుతాయ‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ చెబుతాడు..మోదీ క్లియ‌రెన్స్ ఇస్తాడు..ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు ఇస్తుంద‌ని వివ‌రించారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టానికి ఏంత దూర‌మైనా వెళ్తామ ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల కార్యాల‌యం వ‌ద్ద మెట్ల మీద‌నే కూర్చొని ధ‌ర్నా కొన‌సాగించారు.

టిడిపిని ఇబ్బంది పెట్టేందుకు ఏక‌మ‌య్యారు..

టిడిపిని ఇబ్బంది పెట్టేందుకు ఏక‌మ‌య్యారు..

ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపిని ఇబ్బంది పెట్టేందుకే మోదీ..జ‌గ‌న్ కు స‌హ‌క‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే రిటైర్డ్ సీనియ‌ర్ అధికారులు కేంద్ర ఎన్నిక‌ల సంఘ నిర్ణ‌యాల పై రాష్ట్రప‌తి ని క‌లిసి ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యాన్ని గు ర్తు చేసారు. దేశంలో ఎప్ప‌డూ ఏ ముఖ్య‌మంత్రి ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసిన సంద‌ర్భాలు లేవ‌ని చెప్పుకొచ్చారు. వైసిపి లో అవినీతి ప‌రులు లేరా..ఆ పార్టీ నేత‌ల పై ఎందుకు దాడులు జ‌ర‌గ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. రాత్రి స‌మ‌యం లో టిడిపి అభ్య‌ర్దుల పై సోదాలు ఎందుకు చేస్తున్నార‌ని నిల‌దీసారు. ఎన్నిక‌ల కోడ్ ఉన్న స‌మ‌యంలో ఐటి దాడులు ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ హైద‌రాబాద్ లో కూర్చ‌ని మానిట‌రింగ్ చేస్తున్నార‌న్నారు.

దేశం పై పెత్త‌నం చేస్తున్నారు ..!

దేశం పై పెత్త‌నం చేస్తున్నారు ..!

దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాల‌నేదే త‌న ఉద్దేశ‌మ‌ని వివ‌రించారు చంద్ర‌బాబు. ప‌శ్చిమ బెంగాల్ లో తొలుత బాధ్య‌త‌లు అప్పించిన కెకె శ‌ర్మ ను అక్క‌డ ప్ర‌భుత్వం వ్య‌తిరేకించ‌టం తో ఆయ‌న్ను ఏపికి బ‌దిలీ చేసార‌న..ఆరెస్సెస్ తో సంబంధాలు ఉన్న అధికారిని ఇక్క‌డి నుండి త‌ప్పించాల‌ని కోరారు. తెలంగాణ లో 25 లక్ష‌ల ఓట్లు తొలిగిస్తే సారి చెప్పి త‌ప్పించుకున్నార‌ని గుర్తు చేసారు. ఎలాంటి ఫిర్యాదు లేక‌పోయినా క‌డ‌ప ఎస్పీని ఎందుకు బ‌దిలీ చేసారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. తెలంగాణ‌లో 8 కోట్లు ప‌ట్టుబ‌డినా చ‌ర్య‌లు లేవ‌ని..ఎన్నిక‌ల సంఘం వైసిపి జేబు సంస్థ‌గా మారిదంటూ సీరియ‌స్ అయ్యారు.

English summary
TDP Chief Chandra babu protest against Election commission decisions and sit before CEO office. Babu says election commission working with directions of Modi. EC giving priority for YCP complaints. But, ignoring TDP complaints.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X