వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా ఘ‌టన లో రాజ‌కీయ ల‌బ్ది దాగి ఉందా : అనుమానం బ‌ల‌ప‌డుతోంది: బాబు వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం..!

|
Google Oneindia TeluguNews

పుల్వామా దాడి ఘ‌ట‌న పై వ‌రుస‌గా రెండో రోజు ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు ..మ‌మ‌తా వ్యాఖ్య‌ల‌కు మ‌ద్దుత ఇచ్చేలా మాట్లా డారు. ప్ర‌ధాని మోదీ దేనికైనా స‌మ‌ర్దుడే అంటూ గోద్రా సంఘ‌ట‌న‌న‌ను ప్ర‌స్తావించారు.

మ‌మ‌తా వ్యాఖ్య‌ల‌కు కొన‌సాగింపుగా..
స‌రిగ్గా పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన త‌రువాత‌నే పుల్వామా దాడి ఎందుకు జ‌రిగింద‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మ‌మ‌తా బెనర్జీ ప్ర‌శ్నించారు. నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌లు ఉన్నా..ఒకే సారి 70 వాహ‌నాల శ్రేణిని ఎందుకు అను మ‌తించార‌ని..ఎన్నిక‌ల ముందే ఇది ఎందుకు జ‌రిగింద‌ని అనుమానాలు వ్య‌క్తం చేసారు. ఇదే స‌మ‌యంలో మ‌మ‌తా వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఏపి సీయం చంద్ర‌బాబు ఆ వ్యాఖ్య‌ల‌కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని మోదీ దేనికై నా స‌మ‌ర్ధుడ‌ని..గ‌తంలో జ‌రిగిన గోద్రా ఘ‌ట‌న‌న‌ను గుర్తు చేసారు. దేశ ర‌క్ష‌ణ కోసం మ‌ద్ద‌తు గా నిలుస్తామ‌ని.. జాతీయ ప్ర‌యోజనాల‌ను దెబ్బ తీస్తే మాత్రం ఉపేక్షించ‌మ‌ని హెచ్చ‌రించారు.

Chandra babu slams cnetral govt on Pulwama incident

రాజ‌కీయ ల‌బ్ది దాగి ఉందా..!
పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసిందన్నారు సీయం చంద్ర‌బాబు. ఈ విషయంలో రాజకీ య లబ్ధి దాగి ఉందా? అనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతోందని వ్యాఖ్యానించారు. పార్టీ నేత‌ల‌తో టెలికాన్ఫిరె న్స్ లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసారు. కేంద్ర ప్ర‌భుత్వ అస‌మ‌ర్ద‌త కార‌ణంగానే ఈ దాడి జ‌రిగింద‌ని ఆరోపించారు. వీటి ద్వారా రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌నుకోవ‌టం స‌రి కాద‌న్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల మీద బిజెపి నేత‌లు సీరియ‌స్ అవుతున్నారు. దేశం కోసం జ‌వాన్లు బ‌లిదానం చేస్తే..చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రి కాద‌ని ఫైర్ అవుతున్నారు.

English summary
AP CM Chandra Bbau slams PM Modi on Pulwama issue. He supported Mamatha Benerjee comments on this incident and suspected political intention. Chandra Babu also expressed hi opinion in same line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X