శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు ఎన్నిక‌ల శంఖారావం: నేడు లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితా : పార్టీ నేత‌ల‌తో..ప్ర‌జ‌ల్లోకి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

నేడే టిడిపి లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితా ! | Oneindia Telugu

టార్గెట్ 150 ప్లస్‌. టిడిపి అధినేత చంద్రబాబు ల‌క్ష్యం ఇదే. ఇప్ప‌టికే అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసిన చంద్ర‌బాబు ఎన్నిక ల శంఖారావం పూరించ‌నున్నారు. ముందుగా తిరుమ‌ల చేరుకొని శ్రీవారిని ద‌ర్శించుకుంటారు . అనంత‌రం తిరుప‌తి వేదిక‌గా ఎన్నిక‌ల స‌మ‌ర శంకం పూరిస్తారు. వ‌రుస‌గా అన్ని జిల్లాల కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించిన త‌రువాత ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

<strong>పీఏ ల‌ను పెట్టుకోవాల‌టే చీద‌ర‌..! అందుకే త‌న‌ ప‌నులు తానే చేసుకుంటానంటున్న లోకేష్..!</strong>పీఏ ల‌ను పెట్టుకోవాల‌టే చీద‌ర‌..! అందుకే త‌న‌ ప‌నులు తానే చేసుకుంటానంటున్న లోకేష్..!

తిరుప‌తి నుండి ప్రారంభం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. అంతకు ముందుగా ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం కుటుంబ స‌భ్యుల‌తో కలిసి ఉదయం 11 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారక రామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తల సమావేశాలకు హాజరవుతారు. సోమవారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ, మంగళవారం అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ సీఎం పర్యటిస్తారు. అన్ని జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలను కలిశాక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

Chandra Babu start election campaign today from Tirupathi

పెండింగ్ లిస్టు పై క‌స‌ర‌త్తు..
టిడిపిలో ఇప్ప‌టి వ‌ర‌కు 126 మంది అసెంబ్లీ అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల చేసారు. మిగిలిన అసెంబ్లీ స్థానాల‌తో పాటు గా లోక్‌స‌భ అభ్య‌ర్దుల క‌స‌ర‌త్తు ఓ కొలిక్కి ఇస్తోంది. ముందుగా లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితాను ముఖ్య‌మంత్రి తిరుప‌తి వేదిక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ నుండి టిడిపి లో చేరిన ప‌నబాక లక్ష్మి టిడిపి అభ్య‌ర్దిగా తిరుప‌తి లోక్‌స‌భ నుండి పోటీ చేయ‌నున్నారు. అదే విధంగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, ఏలూరు, గుంటూరు, న‌ర్స‌రావుపేట‌, చిత్తూరు, హిందూపురం నుండి సిట్టింగ్ ఎంపీలే తిరిగి బ‌రిలోకి దిగ‌నున్నారు. ఇక‌, విశాఖ నుండి బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు భ‌ర‌త్ ప‌రు ప‌రిశీల‌న‌లో ఉంది. రాజ‌మండ్రి నుండి మాగంటి రూప‌, ఒంగోలు నుండి సిద్దా రాఘ‌వ‌రావు, నెల్లూరు నుండి బీదా మ‌స్తాన‌రావు, నంద్యా ల నుండి శివానంద‌రెడ్డి, కాకినాడ నుండి సునీల్‌, అమ‌లా పురం నుండి హ‌ర్ష‌కుమార్‌, క‌ర్నూలు నుండి కోట్ల సూర్య‌ప్ర‌కావ్ రెడ్డి, అనంత‌పురం నుండి జేసి ప‌వ‌న్‌. రాజంపేట నుండి డికె స‌త్య‌ప్ర‌భ పేర్లు దాదాపు ఖ‌రార‌య్యాయి.

English summary
TDP Chief Chandra babu starting his election campaign from Tirupati. Babu family visit Tirumala and announce Loksabha candidates list. After tirupathy Cm go to Srikakulam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X