వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి ఎగ్జిట్‌పోల్స్‌ వైసీపీకే అనుకూలం: 23న మ‌నం ఎలా గెలుస్తామంటే..: ఇదీ చంద్ర‌బాబు లెక్క‌..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి వ‌చ్చే ఎగ్జిట్ పోల్స్ గురించి పార్టీ నేత‌ల‌ను స‌మాయ‌త్తం అక్క‌డ నుండే చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి జాతీయ సంస్థ‌లు వెల్ల‌డి చేయ‌నున్న స‌ర్వేల పైనా చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో టెలికాన్ఫిరెన్స్‌లోనూ ప్ర‌స్తావించారు. ఈ రోజు కూడా కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పే అవకాశం ఉందని.. కానీ, 23న వెలువడే ఫలితాల్లో గెలుపు తెదేపాదేనని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకు కార‌ణాల‌ను వివ‌రించారు..

ఎగ్జిట్ పోల్స్ వైసీపీకే..
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ నుండి పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో టెలి కాన్ఫిరెన్స్ నిర్వ‌హించారు. అందులో ఈ సాయంత్రం విడుద‌ల అయ్యే ఎగ్జిట పోల్స్ అంచ‌నాల గురించి చ‌ర్చించారు. 2014లో కొన్ని జాతీయ ఛానళ్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పాయని, కానీ తెదేపా ఘన విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారం కూడా కొన్ని ఛానళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పే అవకాశం ఉందని.. కానీ, 23న వెలువడే ఫలితాల్లో గెలుపు తెలుగుదేశందే అని ఆయ‌న పార్టీ నేత‌ల‌కు ధైర్యం చెప్పారు. కొద్ది రోజుల క్రితం మంత్రుల‌తో సమావేశ‌మైన స‌మ‌యంలోనూ ముఖ్య‌మంత్రి ఇదే విధంగా చెప్పుకొచ్చారు. అయితే 23న వెల్ల‌డ‌య్యే ఫ‌లితాలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంటాయ‌ని చెప్ప‌టం వెనుక కార‌ణాల‌ను ఆయ‌న విశ్లేషించారు.

ఏపీలో టీడీపీ గెలిచే అవకాశముందన్న లగడపాటి జోస్యాన్ని నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండిఏపీలో టీడీపీ గెలిచే అవకాశముందన్న లగడపాటి జోస్యాన్ని నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి

Chandra Babu suggested do not believe Exit polls..but, Confident on party win..

పోలింగ్ స‌ర‌ళి స్ప‌ష్టం చేసింది..
ముఖ్య‌మంత్రి తొలి నుండి గెలుపు పైన ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఉంటాయ‌ని ఖ‌చ్చితంగా చెబుతున్న చంద్ర‌బాబు వాస్త‌వ ఫ‌లితాలు మాత్రం త‌మ‌కు అనుకూలంగా ఎలా ఉంటాయ‌ని ప్ర‌శ్నిస్తే ఆయ‌న ఓ విశ్లేష‌ణ చేస్తున్నారు. అయిదేళ్ల కాలంలో టీడీపీ ప్ర‌భుత్వంలో చేసిన సంక్షేమ‌- అభివృద్దికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని సీఎం వివ‌రిస్తున్నారు. అన్నదాతా సుఖీభవ, పింఛన్ల పెంపు వంటి పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయ‌ని.. ల‌బ్దిదారుల్లో 60 శాతానికి పైగా టీడీపీకే ఓట్లు వేసార‌ని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో చెబుతున్నారు. ఇక‌, పోలింగ్ నాడు
ఓటింగ్‌ పెద్ద ఎత్తున జరగడం, క్యూల్లో గంటల తరబడి నిలబడి మరీ ఓట్లు వేయడం మనకు సానుకూలాంశాలు. మనమే గెలుస్తున్నాం అంటూ చంద్ర‌బాబు చేస్తున్న విశ్లేష‌ణ పైన పార్టీ నేత‌లు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా విశ్లేష‌ణ చేసుకుంటున్నారు. అయితే, టీడీపీ నేత‌ల్లో మాత్రం పైకి ధీమాగా ఉన్నా..అంత‌ర్గ‌తంగా మాత్రం అనేక స‌ర్వే సంస్థ‌ల ప్ర‌తినిధుల నుండి స‌మాచారం రాబట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

English summary
TDP Chief Chandra babu confident on winning in election results which to be coming on 23rd may. Babu suggested party leaders do not believe Exit polls and confident on winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X