వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నాని పై సీయం గురి : టిడిపి అభ్య‌ర్ది ప్ర‌క‌ట‌న: గుడివాడ లో నానిని ఓడిస్తారా..!

|
Google Oneindia TeluguNews

ముందు నుండి అంచ‌నా వేస్తున్న విధంగానే కొడాలి నాని పై టిడిపి అధినేత గురి పెట్టారు. ఎలాగైనా ఈ సారి ఎన్నిక ల్లో కొడాలి నానిని ఓడించాల‌నే ల‌క్ష్యంతో టిడిపి ఉంది. దీని కోసం అనేక త‌ర్జ‌న -భ‌ర్జ‌న ల త‌రువాత గుడివాడ నుండి పోటీ చేసే టిడిపి అభ్య‌ర్ధిని అధికారికంగా ఖ‌రారు చేసారు. ఈ అభ్య‌ర్ది ని రంగంలోకి దించ‌టం ద్వారా నాని ని ఓడిస్తామ నే ధీమా టిడిపి నేత‌ల్లో క‌నిపిస్తోంది. గుడివాడ‌లో నానిని ఓడిస్తారా...ఏం జ‌రుగుతోంది..

ఆ సిట్ ల‌తో సంబంధం లేదు : ఏపికి రెండు హెలికాఫ్ట‌ర్లు కావాలి : సీఈఓ ద్వివేదీ..!ఆ సిట్ ల‌తో సంబంధం లేదు : ఏపికి రెండు హెలికాఫ్ట‌ర్లు కావాలి : సీఈఓ ద్వివేదీ..!

టార్గెట్ కొడాలి నాని..

టార్గెట్ కొడాలి నాని..

టిడిపి నుండి రాజకీయ రంగ ప్ర‌వేశం చేసి ఆ త‌రువాతి రాజ‌కీయ ప‌రిణాల్లో టిడిపికి స‌వాల్ గా మారిన కొడాలి నాని పై టిడిపి ప్ర‌త్యేక దృష్టి సారించింది. టిడిపి కంచుకోట అయిన గుడివాడ‌లో కొడాలి నాని టిడిపి కి ఇప్పుడు కొర‌క‌రాని కొయ్య గా మారారు. 2014 ఎన్నిక‌ల్లో గుడివాడ నుండి వైసిపి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీ సారీ ముఖ్య‌మంత్రిని లక్ష్యంగా చేసుకొని ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ తో స‌న్నిహిత సంబంధాలు ఉన్న కొడాలి నాని..నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం స‌మ‌యంలోనూ ఆ కుటుంబానికి అండ‌గా నిలిచారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ త‌న వంతు బాధ్య‌త నిర్వ‌ర్తించారు.

టిడిపి కంచుకోట గుడివాడ‌..

టిడిపి కంచుకోట గుడివాడ‌..

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరగ్గా కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ యేతర పార్టీలు ఇక్కడ గెలుపొందాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ గెలుపొందింది. ఈసారి ఎలాగైనా గుడివాడలో టీడీపీ జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంతో టీడీపీ పెద్దలు ఉన్నారు. గుడివాడ నియోజకవర్గం నుంచి 3వ పర్యాయం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కొడాలి నాని దూకుడుకు ఎలాగైనా కళ్లెం వేయాలని టీడీపీ నిర్ణయిం చింది. అందులో భాగంగా గతంలో నానిపై పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు కు సీటు నిరాక‌రించింది. ఆయ‌నకు సీటు ఇవ్వ‌కుండా అదే జిల్లాకు చెందిన ఒ యువ నేత‌ను రంగంలోకి దించింది.

బ‌రిలోకి దేవినేని అవినాశ్‌..

బ‌రిలోకి దేవినేని అవినాశ్‌..

అవినాష్‌ 18వ ఏట విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తండ్రి స్థాపించిన యూఎస్‌వో కార్య క్రమాలతోపాటు సమైఖ్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2012లో లండన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అనంతరం ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తొలి యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యువత తొలి అధ్యక్షుడిగా కూడా అవినాష్‌ బాధ్యతలు చేపట్టడం గమనార్హం.ఇప్పుడు గుడివాడ టిడిపి అభ్య‌ర్దిగా అధినేత అవినాశ్ పేరు అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో.. తొలి సారి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న అవినాశ్‌..స్థానికంగా గ‌ట్టి ప‌ట్టు ఉన్న కొడాలి నాని పై ఎటువంటి పోటీ ఇస్తార‌నే ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఏపి వ్యాప్తంగా ఇప్పుడు ఈ సీటు పై ఆస‌క్తి నెల‌కొని ఉంది.

English summary
TDP chief Chandra babu Fainalised the candidate for Gudivada Assembly. Babu announced Telugu yuvatha state president Devineni Avinsh as TDP candidate for Gudivada. TDP wants to defeat Kodali Nani from this constituency. Now this contest in Gudivada became more interesting in up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X