జగన్ ఇలాకాలో చంద్రబాబు - వైసీసీకి కౌంటర్ గా : టూర్ - పక్కా ప్లాన్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఇక..సీఎం జగన్ ఇలాకా పైన ఫోకస్ చేస్తున్నారు. మహానాడుకు ముందే జిల్లాల పర్యటనలు పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే శ్రీకాకుళం.. విశాఖ..తూర్పు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్ పాలన పైన మండిపడ్డారు. 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు.

సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు
ఇక, ఇదే సమయంలో సీఎం జగన్ సైతం పథకాల అమలు..నిధుల విడుదల కార్యక్రమాలను జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ప్రతీ సభలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు..దత్తపుత్రుడు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్..మద్దతు మీడియా పైన విరుచుకుపడుతున్నారు. నాటి చంద్రబాబు పాలన.. నేటి తన పాలన బేరీజు వేయాలని సూచించారు. అదే విధంగా తాను అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్చుకోలేకపోతున్నారంటూ చంద్రబాబు లక్ష్యంగా ఫైర్ అవుతున్నారు. దీనికి చంద్రబాబు సైతం కౌంటర్ ఇస్తున్నారు.

జగన్ ఇలాకాలో చంద్రబాబు టూర్
ఇక, తన సొంత నియోజకవర్గం కుప్పం లో మూడు రోజులు చంద్రబాబు పర్యటించారు. ఇక, వచ్చే వారం వరుసగా రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. వచ్చే వారం 18వ తేదీన కడప జిల్లాలోని కమలాపురం, 19న నంద్యాల జిల్లాలోని డోన్, 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహానాడు నిర్వహించే లోపు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ చుట్టేలా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఇప్పటికే వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్ధులను సైతం చంద్రబాబు ఖరారు చేసారు.

ఇద్దరు జిల్లాల పర్యటనలతో
వచ్చే
ఎన్నికల్లో
వైసీపీ
బలంగా
ఉన్న
నియోజకవర్గాలను
చంద్రబాబు
తన
పర్యటనల్లో
ప్రధానంగా
ఎంచుకుంటున్నారు.
జిల్లా
పర్యటనల
సమయంలోనే
పార్టీ
కార్యక్రమాల
పైన
ఫోకస్
పెడుతున్నారు.
సొంత
పార్టీ
నేతలతో
సమీక్ష
చేస్తేన్నారు.
అవసరమైన
సూచనలు
చేస్తున్నారు.
ఇక,
పొత్తుల
అంశాల
పైన
చంద్రబాబు
కొంత
కాలం
మౌనంగా
ఉండే
అవకాశం
కనిపిస్తోంది.
ఇక,
సీఎం
సొంత
జిల్లాలో
చంద్రబాబు
పర్యటన
సమయంలో
రాజకీయంగా
ఎటువంటి
వ్యాఖ్యలు
చేస్తారనేది
ఆసక్తి
కరంగా
మారుతోంది.