వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ పైనే చంద్ర‌బాబుకు న‌మ్మ‌కం : పోల‌వ‌రం నిధులు మింగేసారు..ఓట‌మి ఖాయం: అమిత్ షా ఫైర్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబుకు పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉన్న న‌మ్మ‌కం భార‌త ప్ర‌ధాని పై లేద‌ని ఎద్దేవా చేసారు. ప్ర‌ధాని మోదీ..బిజెపి నేత‌ల దేశ భ‌క్తిని కాం గ్రెస్ నేత‌లు ప్ర‌శ్నించే హ‌క్కు లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఉగ్ర‌వాదుల విష‌యంలో మోదీ క‌ఠినంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చా రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మి త‌ధ్య‌మ‌ని అమిత్ షా పేర్కొన్నారు.

ఇమ్రాన్ పైనే బాబుకు భ‌రోసా..

ఇమ్రాన్ పైనే బాబుకు భ‌రోసా..

పుల్వామా దాడి త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పై బిజెపి చీఫ్ అమిత్ షా ఫైర్ అయ్యారు. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన మాట‌ల‌ను న‌మ్ముతున్న చంద్ర‌బాబు కు ఆయ‌న మీద భ‌రోసా ఉంద‌ని..అయితే భార‌త ప్ర‌ధాని పై భ‌రోసా లేద‌ని ఆరోపించారు. రాజ‌కీయంగా చంద్ర‌బాబు దిగ‌జారిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. వెన్నుపో టు ల విష‌యంలో ఆయ‌న ప్ర‌ధమ స్థానంలో నిలుస్తార‌ని పేర్కొన్నా రు. తొలుత ఎన్టీఆర్‌..ఆ త‌రువాత వాజ్‌పేయ్ ను..ఇప్పుడు మోదీని వెన్నుపోటు పొడిచార‌ని విమ‌ర్శించారు. ఏపి క‌ష్టాల కు కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీ..ఆ పార్టీ అధినేత తో చేతులు క‌లిపి వేదిక‌లు పంచుకుంటున్నార‌న్నారు. చంద్ర‌బాబు దీక్ష‌లు చేయాల్సింది ఇత‌ర ప్రాంతాల్లో కాద‌ని..ఏపి ప్ర‌జ‌ల‌కు చేసిన మోసం కార‌ణంగా టిడిపి ఆఫీసు ముందే ధ‌ర్నా చేయాల‌ని సూచించారు. ఇక‌, అమ‌రావ‌తి, పోల‌వ‌రం కోసం కేంద్రం నిధులు ఇస్తే అందులో చంద్ర‌బాబు ప్ర‌బుత్వం అవినీతికి పాల్పడింద‌ని ఆరోపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓడిపోతార‌ని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ ను నైతిక‌త ఉందా..

కాంగ్రెస్ ను నైతిక‌త ఉందా..

దేశ భ‌క్తిలో మోదీని ప్ర‌శ్నించే నైతిక హ‌క్కు కాంగ్రెస్ కు లేద‌ని బిజెపి చీఫ్ పేర్కొన్నారు. పుల్వామా ఘ‌ట‌న త‌రువాత సైనికుల‌కు మోదీ పూర్తి స్వేచ్చ ఇచ్చార‌ని..శ‌త్రువుల పై ప్ర‌తీకారానికి త‌గిన స‌మ‌యం..స్థ‌లం మీరే నిర్ణ‌యించండ‌ని చెప్పార‌ని షా గుర్తు చేసారు. ఇన్నేళ్లు గా ర‌గులుతున్న కాశ్మీర్ స‌మస్య‌కు నెహ్రూ కార‌ణ‌మ‌ని...కాంగ్రెస్ నేత‌లు స‌మ‌స్య ను పెంచాయ‌ని షా ఫైర్ అయ్యారు.ప్ర‌ధాని మోదీ వైపు దేశ ప్ర‌జ‌లంతా చూస్తున్నార‌ని..ఆయ‌న త‌న పై పెట్టిన న‌మ్మకా న్ని ఒమ్ము చేయ‌రని చెప్పారు. బిజెపి నేత‌ల ర‌క్తంలోనే దేశ భ‌క్తి ఉంద‌న్నారు. ఉగ్ర‌వాదుల పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తే వాటికి కాంగ్రెస్ వ‌క్ర‌భాష్యం చెప్పివ‌..సైనికుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించారు.

బాబు పాల‌న‌లో అవినీతి పెరిగింది..

బాబు పాల‌న‌లో అవినీతి పెరిగింది..

ఏపిలో చంద్ర‌బాబు పాల‌న‌లో అవినీతి పెరిగిపోయింద‌న్నారు అమిత్ షా. అమ‌రావ‌తి..పోల‌వ‌రం నిధుల్లో అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపికి అండ‌గా నిలిచింద‌ని వివ‌రించారు. ప‌దేళ్ల కాలంలో పూర్తి చేయా ల్సిన ప్రాజెక్టుల్లో 90 శాతం అయిదేళ్ల కాలంలోనే పూర్తి చేసామ‌ని వివరించారు. టిడిపి - వైసిపి కార‌ణంగా ఏపి కి ఎటు వంటి ప్ర‌యోజ‌నం లేద‌ని..బిజెపి మాత్ర‌మే ఏపి అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి ఓట‌మి ఖాయ‌మ‌ని అమిత్ షా జోస్యం చెప్పారు. మోసం చేయ‌టం చంద్ర‌బాబు ల‌క్ష‌ణం అని..ప్ర‌జ‌లు ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను న‌మ్మ‌ర‌ని చెప్పుకొచ్చారు. తీర ప్రాంతంలో ఇప్ప‌టికే 55 వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. చంద్ర‌బాబు కుయుక్తుల‌ను ఎవ‌రూ భ‌య‌డాల్సిన అవ‌రం లేద‌ని..ప్ర‌తీ బిజెపి కార్య‌క‌ర్త కేంద్రం ఏపి కోసం చేస్తున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు.

English summary
BJP Chief Amit Sha fire on Ap CM Chandra Babu. Shah says Chnandra babu trusts Pakistan PM Imran Khan , not Indian PM. Naidu should sit on dharna outside his party office not in other places in country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X