వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీపై చ‌ంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వార్! మోదీ ఓట‌మి ఖాయం.. మ‌రో 6రోజులు ఆగితే ఏమ‌వుతుంది?

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి ప్ర‌ధాని మోదీ..ఎన్నిక‌ల సంఘం లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఇప్పటి వ‌ర‌కూ పార్టీ స‌మావేశాలు..మీడియా తో మాట్లాడే స‌మ‌యంలో ఆరోప‌న‌లు చేసిన చంద్ర‌బాబు..ఇప్పుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ ప్ర‌క‌టించారు. దేశ ప్ర‌జ‌లు ప్ర‌ధానిగా మోదీని తిర‌స్క‌రించ‌టం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు.

మోదీని తిర‌స్క‌రించం ఖాయం..
తాజా ఎన్నిక‌ల్లో బీజీఏ ఓడిపోతారంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు జోస్యం చెప్పారు. మే 23న దేశ ప్రజలు ప్రధానిగా మోదీని..ఆయ‌న‌ టీమ్‌ను తిరస్కరించడం ఖాయమని చంద్రబాబు ట్విట్టర్లో స్పష్టం చేశారు. అంపైర్లు లేకుండా చేసి... రిఫరీ సిస్టమ్‌నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ టీమ్‌కు పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్‌ను ప్రజలే ఎంపిక చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని పేర్కొన్నారు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదని, అధికారుల వివక్షతపై, పక్షపాత ధోరణిపైనేనని మరో మారు ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేసారు.

Chandra Babu tweet war on Modi and Election commission : Demanded VVpats counting..

మ‌రో ఆరు రోజులు ఆగితే ఏమ‌వుతుంది..
అంద‌రినీ ఒకే ర‌కంగా చూడాల్సిన ఎన్నిక‌ల సంఘం.. మోదీ.. అమిత్‌ షాలపై మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ను ఈసీ అమలు చేయకపోవడంపైనే తమ పోరాటమన్నారు. ఎప్పుడో చ‌నిపోయిన నాయ‌కుల గురించి..వారి కుటుంబ స‌భ్యులను కించ‌ప‌రిచేలా మోదీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. ర‌క్షణ విభాగాల‌ను..సైన్యాన్ని వాడుకుంటూ మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు రాజ‌కీయ నాయ‌క‌త్వాన్ని చంపేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ప్ర‌ధాని త‌మ‌కు నీతి వ్యాఖ్య‌లు చెబుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల షెడ్యూల్ కు 73 రోజులు స‌మ‌యం తీసుకున్న ఎన్నిక‌ల సంఘానికి 50 శాతం వీవీ ప్యాట్‌ల లెక్కింపుల‌ను మ‌రో ఆరు రోజుల స‌మ‌యం తీసుకోవాటానికి ఎందుకు అభ్యంత‌ర‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాల‌ని ప్ర‌తిప‌క్షాల‌న్ని ఎన్నిక‌ల సంఘాన్ని డిమాండ్ చేస్తే మోదీకి ఆ విష‌యంలో ఏం సంబంధ‌మ‌ని..ఆయ‌న ఎందుకు ఉలిక్కి పడుతున్నార‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శ్నించారు.

English summary
AP Cm Chandra Babu Naidu once again fire on Modi and Elections commission. Babu questioned Modi by tweets. He again demanded for 50 percent vvpats counting. mobile summary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X