వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిరెడ్డి డైరెక్ష‌న్‌..కేసీఆర్ రియాక్ష‌న్ : ఎన్నిక‌ల్లో టిడిప్ వ‌ర్సెస్ కేసీఆర్ :చ‌ంద్ర‌బాబు..!

|
Google Oneindia TeluguNews

డేటా చోరీ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ వేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్ర, కుతంత్రం అన్నీ ఆధారాలతో సహా దొరికాయని చెప్పారు. దొంగతనం చేసిన వారు దొరక్కుండాపోరని చెప్పారు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై దాడులు చేయ డం చట్ట విరుద్ధమన్నారు. డేటా మొత్తం దొంగిలించుకుని పోయారని ఆరోపించారు. అంతేకాకుండా సేవా మిత్ర, ఇ న్సూరెన్స్‌ సమాచారం ఎత్తుకెళ్లారని ధ్వజమెత్తారు. వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్ కాద‌ని...కేసీఆర్ అని ఆరోపించారు.

ఇది మ‌హా కుట్ర‌..

ఇది మ‌హా కుట్ర‌..

తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు ఢిల్లీ కేంద్రంగా మ‌హాకుట్ర జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆరోపించారు. దుష్ట చ‌తుష్ట‌యం క‌లిసి రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసార‌ని విమ‌ర్శించారు. విజ‌య‌సాయిరెడ్డి.. జ‌గ‌న్‌..తెలంగాణ ప్ర‌ముఖులు క‌లిసి ఈ కుట్ర చేసారన్నారు. ఎన్నిక‌ల సంఘానికి విజ‌య సాయిరెడ్డి తొలుత ఫిర్యాదు చేసార‌ని..దానితో పాటుగా ఆ త‌రువాత తాము అమ‌లు చేయానుకున్న కార్యాచ‌ర‌ణ ప్లాన్ సైతం ఇచ్చేసి దొరికిపోయార ని వివ‌రించారు. ఐటి గ్రిడ్స్ పై ఫిర్యాదు లేకుండానే గ‌త నెల 23న దాడులు చేసార‌ని.. త‌మ డేటా దొంగిలించార‌ని సీ యం ఆరోపించారు. త‌మ‌కు ఫిర్యాదు వ‌స్తే ముందుగా మా డేటా గురించి ముందుగా ఏపి ప్ర‌భుత్వానికి తెలియ చేయా ల్సిన బాధ్య‌త లేదా అని ప్ర‌శ్నించారు.ఐటి గ్రిడ్స్ పై ఫిర్యాదు ఈ నెల 2న వ‌స్తే..ముందుగానే ఎలా దాడులు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇదంతా కుట్ర ప్ర‌కారం జ‌రిగింద‌ని వివ‌రించారు.

సాయి రెడ్డి డైరెక్ష‌న్‌..ఇక యాక్ష‌న్‌

సాయి రెడ్డి డైరెక్ష‌న్‌..ఇక యాక్ష‌న్‌

వైసిపి ఎంపి విజ‌య‌సాయ రెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు తో పాటుగా యాక్ష‌న్ ప్లాన్ సిద్ద‌మైంద‌ని.. గ‌త నెల 19న ఇచ్చిన యాక్ష‌న్ ప్లాన్ కు అనుగుణంగా తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌న్నారు. త‌మ పార్టీకి చెందిన సేవా మిత్ర‌..కార్య‌క‌ర్త‌ల భీమా స‌మాచారం దొంగిలించార‌ని ఆరోపించారు. అశోక్ కుమార్ పై దాడి చేసార‌న్నారు. హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ పిటీష‌న్ వేస్తే ఆ స‌మ‌యంలో కోర్టు త‌ప్పు బ‌ట్టిన విష‌యాన్ని గుర్తు చేసారు. ఒక పార్టీకి సంబంధించి న డేటా ఎందుకు దొంగిలించార‌ని నిల‌దీసారు. సాయి రెడ్డి యాక్ష‌న్ ప్లాన్ లో టిడిపి,,లోకేష్‌...ఐటి గ్రిడ్స్‌..బ్లూ ఫ్రాగ్స్‌, సుప్రీం కోర్టు నిబంధ‌న‌లు సాయి రెడ్డి ప్ర‌స్తావించార‌ని వివ‌రించారు. పెన్ష‌న్లు ఇస్తుంటే ఇసికి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్ట‌టాని కి లంచం ఇస్తున్నార‌ని ఫిర్యాదు చేసార‌ని..పెన్ష‌న్ల‌ను అడ్డుకుంటారా అని నిల‌దీసారు.

ఏపి ఎన్నిక‌లు టిడిపి వ‌ర్సెస్ కేసీఆర్‌

ఏపిలో వ‌చ్చే ఎన్నిక‌లు టిడిపి వ‌ర్సెస్ జ‌గ‌న్ కాద‌ని..టిడిపి వ‌ర్సెస్ కేసీఆర్ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వెయ్యి కోట్ల కోసం ఏపిని అమ్మేస్తావా అని జ‌గ‌న్ ను సీయం నిల‌దీసారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను తాక‌ట్లు పెడ‌తావా అని ప్ర‌శ్నించారు.
కేసీఆర్ నుండి జ‌గ‌న్ కు వెయ్యి కోట్లు వ‌చ్చాయని... మ‌రో వెయ్యి కోట్లు ఇస్తాడని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. చ‌ట్ట వ్య‌తి రేకంగా దాడులు చేయించి అక్క‌డి ఆంధ్రా ప్రాంత వాసుల‌ను భ‌య‌పెడుతున్నార‌ని ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం ఆం ధ్రుల ఆత్మ‌గౌర‌వానికి సంబంధించినద‌న్నారు. మీకు పోలీసు ఉంటే మాకు పోలీసు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భ‌య‌ప‌డ‌మ‌ని చెప్పారు, జ‌గ‌న్ డ‌బ్బుల కోసం కేసీఆర్ కు ఊడిగిన చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఏపి జోలికి వ‌స్తే ఖ‌బడ్దార్‌..జాగ్ర‌త్త అని హెచ్చ‌రించారు.

English summary
AP Cm Chandra Babu serious comments on KCR and Jagan and Central Govt. He says Modi, Kcr and Jagan trying to eradicate TDP in AP. On YCP leaders Direction TRS Govt acting in Data theft case. Babu saying that KCr given 1000 cr to jagan for coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X