కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్ర‌భుత్వానికి బాబు వార్నింగ్‌: టిడిపి లో చేరిక కోట్ల కుటుంబం : ఆ న‌లుగురూ..!

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యారు. విజ‌య‌సాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే తెలంగా ణ పోలీసులు త‌మ కార్యాల‌యం పై ఎలా సోదాలు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. మ‌ర్యాద కాపాడుకోవాల‌ని లేకుంటే తాము రియాక్ట్ అవుతామ‌ని హెచ్చ‌రించారు. కోట్ల కుటుంబం కోడుమూరు లో చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టిడిపిలో చేరింది.

తెలంగాణ ప్ర‌భుత్వం పై ఫైర్

తెలంగాణ ప్ర‌భుత్వం పై ఫైర్

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ర్నూలు జిల్లా స‌భ లో తెలంగాణ ప్ర‌భుత్వం పై ఫైర్ అయ్యారు. ఏపి ప్ర‌భుత్వ పధ‌కా ల ల‌బ్ది దారుల రేష‌న్ కార్డులు..ఆధార్ కార్దులు ఓ ప్ర‌యివేటు సంస్థ వ‌ద్ద ఉన్నాయ‌ని వైసిపి ఎంపి విజ‌య సాయి రెడ్డి సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. దీంతో..పోలీసులు ఆ సంస్థ లో సోదాలు చేసి అక్క‌డ ల‌బ్ది దారుల వివ‌రాల ను గుర్తించారు. దీని పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రోక్షంగా స్పందించారు. విజ‌య సాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే తెలం గాణ పోలీసులు ఎలా త‌మ కార్యాల‌యం పై దాడి చేస్తార‌ని నిల‌దీసారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఇష్టానుసారం వ్య‌వ‌హ రించ‌టం మానుకోకుంటే..తాము రియాక్ట్ అవుతామ‌ని హెచ్చ‌రించారు.

టిడిపిలో చేరిక కోట్ల కుటుంబం..

టిడిపిలో చేరిక కోట్ల కుటుంబం..

తెలుగు దేశం పార్టీలో కోట్ల కుటుంబం చేరింది. కర్నూలు జిల్లా కొడమూరు సభలో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, కోట్ల సూజాతమ్మ, కోట్ల రాఘవేంద్రరెడ్డిలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపైకి కోట్ల, కేఈ కుటుంబసభ్యులు వచ్చారు. ఈ సభలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మహత్తర కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. కర్నూలు జిల్లాలో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయని.. వాటిని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ రావాలని కోరారు. భాజపాతో కలిసి పనిచేస్తున్న వైకాపాకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని.. రైతుల కష్టాలు తీర్చే తెదేపాకు అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఆ న‌లుగురూ అంటూ..

ఆ న‌లుగురూ అంటూ..

క‌ర్నూలు జిల్లాలోని రెండు లోక్‌స‌భ‌..14 అసెంబ్లీ సీట్లు గెలిపించాల్సిన బాధ్య‌త కెఇ..కోట్ల దే అని సీయం స్పష్టం చేసా రు. జగన్‌కి ఓటేస్తే నరేంద్ర మోదీకి ఓటు వేసినట్లే. అసదుద్దీన్‌ కూడా రాష్ట్రానికి వస్తానంటున్నారు. మోదీ, జగన్‌, కేసీ ఆర్‌, అసదుద్దీన్‌ లాలూచీ పడ్డారు. రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణలో చేసుకోండని బాబు స్ప‌ష్టం చేసారు. త‌న‌ దగ్గర పెరిగిన కేసీఆర్ త‌న‌కే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని... పద్దతిలేని రాజకీయాలు చేస్తే సహించమని హెచ్చ రించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే బొబ్బిలిపులిలా తిరుగుబాటు చేస్తామ‌ని..అభినందన్‌ విషయంలో కూడా రాజకీ యాలు చేయాలని చూశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

English summary
AP CM Chadnra Babu warned Teleangan govt on police searchings in one private office who holding AP Govt schemes beneficiary's list. YCP MP Vijaya Sai reddy complaint on this to Cyberabad Polilce. Babu serious on this issue. Kotla Family joined in TDP in presence of Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X