అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీని గాడిలో పెట్టేందుకు...నేతలపై కొరడా ఝళిపించనున్న చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించే నాయకుల పట్ల ఇక మీదట కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఈ విషయం ఆ పార్టీ సీనియర్ నేతల్లో చర్చనీయాంశంగా మారడంతో బైటకు వెల్లడయినట్లు తెలుస్తోంది.

Recommended Video

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఓ రహస్య సర్వే

ఇటీవల వరుసగా జరుగుతున్న జిల్లాలవారీ పార్టీ ముఖ్యనేతల సమావేశాల్లో చంద్రబాబు ఇదే విషయమై ఘాటు హెచ్చరికలు చేస్తున్నారట. చంద్రబాబు ఇప్పటివరకు నాలుగైదు జిల్లాల నేతలతో సమావేశం కాగా త్వరలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలతో సమావేశం అవుతారని తెలిసింది. క్రమశిక్షణ మీరిన నేతలను కేవలం హెచ్చరికలతో సరిపెట్టడం కాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట.

 చంద్రబాబు...స్ట్రాంగ్ వార్నింగ్

చంద్రబాబు...స్ట్రాంగ్ వార్నింగ్

ఇటీవల జరిగిన ఓ జిల్లా నేతల సమావేశంలో చంద్రబాబు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ...‘‘ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు...గెలవడానికి కారణమైన ప్రజలను పట్టించుకోరు...ఎమ్మెల్యే పదవి అంటే దందాలు చేసుకునేందుకే అని కొందరు భావిస్తున్నారు...ఇప్పటివరకు ఇలాంటి వ్యవహారాలపై వార్నింగ్‌లు ఇచ్చి ఊరుకునేవాళ్లం...ఇప్పటికైనా తీరుమారకపోతే ఇకపై చర్యలు తప్పవు...''...ఇదీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలకు సీఎం చంద్రబాబు చేసిన ఘాటైన హెచ్చరిక.

ఉపేక్షిస్తే...నష్టమని

ఉపేక్షిస్తే...నష్టమని

ఇప్పటివరకూ పార్టీ నేతలు ఏవైనా కారణాల చేత కార్యకర్తల, ప్రజల అసంతృప్తి కారణమైతే ఆ విషయాలు హెచ్చరించి వదిలేస్తూ వచ్చారు. అయితే ఇక ఇప్పుడు కూడా అలాగే చేస్తే అది అంతిమంగా పార్టీకి చేటుచేస్తుందని చంద్రబాబు అంచనా వేశారట. అందుకే నేతలు దందాలు, అక్రమాలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించారట. అందుకే అటువంటి నేతల కార్యకలాపాల గురించి తాజాగా మరోసారి నివేదికలు తెప్పిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ ఆరుగురు...సంకేతాలు పంపారు

ఆ ఆరుగురు...సంకేతాలు పంపారు

అయితే మిగతా అందరి విషయాలు ఎలా ఉన్నా పార్టీకి చెందిన ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం బాగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు సిఎం చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు తెలిసింది. సర్వేల్లోనే,నివేదికల్లోనూ ఆ ఆరుగురుకు సంబంధించి అదే విషయం నిర్థారణ కావడంతో వారిపై సిఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అక్రమాలతో పాటు పదవులు ఇవ్వలేదనో, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పొసగక పోవడం, మరో కారణం చేతో పార్టీ ముఖ్యనేతల గురించి, పార్టీ గురించి దుష్ప్రచారం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కూడా సిఎం దృష్టి సారించనున్నారట

ఇవి కూడా వద్దు...దిశానిర్దేశం

ఇవి కూడా వద్దు...దిశానిర్దేశం

నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువుల కార్యకలాపాలు,దందాలు, దౌర్జన్యాలపై కూడా సిఎం ప్రత్యేక నజర్ పెట్టనున్నట్లు తెలిసింది. ఈ తరహా విషయాలపై స్వయంగా సిఎంకే అనేకమంది ఫిర్యాదు చేయడంతో ఆయన ఈ విషయాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. అలాంటివారిని కట్టడి చేయకపోతే తాను వారిని వేరే రకంగా కట్టడి చేయాల్సి ఉంటుందని సిఎం తీవ్రంగా హెచ్చరించారట. నేతలే బినామీల పేర్లతో కాంట్రాక్టులు చేపట్టడం, పార్టీ కార్యకర్తలను కాదని, వైసీపీ వాళ్లకు కాంట్రాక్టులు,పనులు అప్పచెప్పడం, యువనేత పేరును వాడుకొంటూ అక్రమాలకు తెగబడటం వంటివి జరుగుతున్నట్లు నివేదికల ద్వారా సిఎంకు తెలిసిదంట. వీటిని కూడా కట్టడిచేసేందుకు గట్టి చర్యలు మొదలు కాబోతున్నట్లు వినికిడి.

English summary
Chief Minister Chandrababu has decided to deal strictly with the party leaders in coming period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X