వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: మోడీ కేబినెట్లోకి పురంధేశ్వరి, వెదిరే శ్రీరామ్‌ను అడ్డుకున్న బాబు, సుజన చక్రం, అందుకే?

ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ విస్తరణలో తెలుగువారికి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి హరిబాబు, తెలంగాణ నుంచి వెదిరే శ్రీరామ్ పేరు బాగా వినిపించింది. కానీ వారికి అవకాశం దక్కలేదు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrababu Naidu Blocked The Entry Of 2 Telugu Leaders Into Modi's | Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ విస్తరణలో తెలుగువారికి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి హరిబాబు, తెలంగాణ నుంచి వెదిరే శ్రీరామ్ పేరు బాగా వినిపించింది. కానీ వారికి అవకాశం దక్కలేదు.

చంద్రబాబు అడ్డుకున్నారని ప్రచారం

చంద్రబాబు అడ్డుకున్నారని ప్రచారం

మోడీ కేబినెట్లో తెలుగు వారికి చోటు దక్కకపోవడంపై ఓ ఆసక్తికర మరియు షాకింగ్ ప్రచారం సాగుతోంది. ఏపీ నుంచి ఒకరికి, తెలంగాణ నుంచి ఒకరి పేరును బిజెపి అధిష్టానం పరిశీలించిందని, కానీ సీఎం చంద్రబాబు మోకాలు అడ్డారనే ప్రచారం సాగుతోంది.

పురంధేశ్వరికి అడ్డుకున్న బాబు

పురంధేశ్వరికి అడ్డుకున్న బాబు

ఏపీ నుంచి హరిబాబు కంటే ముందు.. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి పేరును బిజెపి అధిష్టానం పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు వెంటనే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సమాచారం పంపించారని అంటున్నారు.

పొత్తు పైనే దెబ్బ పడుతుందని షాకు సుజన హెచ్చరిక

పొత్తు పైనే దెబ్బ పడుతుందని షాకు సుజన హెచ్చరిక

పురంధేశ్వరి పేరు తెరపైకి రాగానే టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి ద్వారా బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు చంద్రబాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారని సమాచారం. పురంధేశ్వరిని కేబినెట్లోకి తీసుకుంటే పొత్తు పైనే దెబ్బ పడుతుందని సుజన.. షాకు తేల్చి చెప్పారని తెలుస్తోంది.

అందుకే చంద్రబాబు అసంతృప్తిని పరిగణలోకి తీసుకున్న బిజెపి

అందుకే చంద్రబాబు అసంతృప్తిని పరిగణలోకి తీసుకున్న బిజెపి

ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి జోరు కనిపించింది. దీంతో 2019 ఎన్నికల నాటికి టిడిపికి దూరంగా జరగాలని నిన్నటి వరకు భావించిన బిజెపి, ఈ ఫలితాల తర్వాత పునరాలోచన చేసింది. ఈ నేపథ్యంలో టిడిపి అసంతృప్తిని బిజెపి పరిగణలోకి తీసుకున్నదని తెలుస్తోంది. ఆ తర్వాత హరిబాబు పేరు తెరపైకి వచ్చిందని సమాచారం.

ఏపీ వ్యతిరేకిగా వెదిరే శ్రీరామ్

ఏపీ వ్యతిరేకిగా వెదిరే శ్రీరామ్

తెలంగాణ నుంచి వెదిరే శ్రీరామ్ పేరును కూడా బిజెపి అధిష్టానం పరిశీలించింది. ఇతను ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్. అలాగే యాంటీ ఏపీగా ముద్రపడ్డారు. ఏపీకి చెందిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా ఎక్కారు.

వెదిరె శ్రీరామ్‌పై బాబు అందుకే అభ్యంతరం

వెదిరె శ్రీరామ్‌పై బాబు అందుకే అభ్యంతరం

అంతేకాదు, యూనియన్ ఇరిగేషన్ మినిస్ట్రీ సలహాదారుగా పలు నీటి పారుదల సమస్యలపై ఏపీ వ్యతిరేక వైఖరిని అవలంభించారని అంటారు. ఈ కారణంగా ఈయన పేరుపై కూడా చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేశారనే ప్రచారం సాగుతోంది. దీంతో బిజెపి ఇద్దరు తెలుగువారిని పక్కన పెట్టిందని అంటున్నారు.

English summary
It is said that Chandrababu Naidu blocked the entry of Two Telugu Leaders into Modi‘s Team. Purandeshwari from Andhra Pradesh was initially considered but Chandrababu expressed his displeasure almost immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X