• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ సర్కార్ టార్గెట్ గా, మేడే నాడు వారికి ఖబడ్దార్ చెప్పండన్న లోకేష్ ,కార్మికులకు అండగా.. చంద్రబాబు ట్వీట్ !

|

మే 1... ప్రపంచ వ్యాప్తంగా కార్మికులందరూ కార్మిక దినోత్సవం జరుపుకునే సందర్భం. శ్రమ జీవన సౌందర్యాన్ని ఆస్వాదించే కార్మిక లోకం, పెట్టుబడిదారుల నిరంకుశ విధానాలకు, శ్రమదోపిడికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గుర్తుగా, మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు.ఇక మేడే సందర్భంగా ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియ చేయడమే కాకుండా,తమ సందేశాన్ని ఇచ్చారు.

జగన్ మూర్ఖపు పాలకుడు, అందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు: అమరావతి ఉద్యమం గుర్తు చేసిన చంద్రబాబుజగన్ మూర్ఖపు పాలకుడు, అందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు: అమరావతి ఉద్యమం గుర్తు చేసిన చంద్రబాబు

కార్మిక సంక్షేమానికి కట్టుబడి గత టీడీపీ సర్కార్ పని చేసిందన్న చంద్రబాబు

కార్మిక సంక్షేమానికి కట్టుబడి గత టీడీపీ సర్కార్ పని చేసిందన్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మేడే సందర్భంగా యావత్ లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేసిన చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకం ద్వారా రెండున్నర కోట్ల మంది అసంఘటిత కార్మికులకు భరోసా కల్పించామని, వందలాది పరిశ్రమలను నెలకొల్పి లక్షలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. పని లేని నాడు కూడా ఏ ఒక కార్మికుడు ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేశామని చెప్పారు .

టీడీపీ హయాంలో ఉన్న కార్మిక సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏవీ లేవన్న బాబు

టీడీపీ హయాంలో ఉన్న కార్మిక సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏవీ లేవన్న బాబు

నాటి కార్మిక సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏవీ లేవంటూ చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఎందరో కార్మికులు రోడ్డున పడ్డారని, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికుల పక్షాన నిలబడి గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న కార్మికులు ,ఉద్యోగులకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

కరోనా కష్ట కాలంలో కార్మికులకు వ్యాక్సిన్లు,మందులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబు

కరోనా కష్ట కాలంలో కార్మికులకు వ్యాక్సిన్లు,మందులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబు

ఈ కష్ట సమయంలో కార్మికులకు వ్యాక్సిన్లు,మందులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. యావత్ శ్రామిక లోకానికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మేడే సందర్భంగా రాష్ట్ర పెద్దలకు ఖబడ్దార్ చెప్పాలని షాకింగ్ ట్వీట్ చేశారు. ప్రజలందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన నారా లోకేష్ నిరంకుశ పెత్తనం, శ్రమదోపిడి, అణచివేత ఎక్కువ కాలం సాగవు అని ప్రపంచానికి తెలియజెప్పిన రోజు మే డే అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర పెద్దలకు మేడే సందర్భంగా ఖబడ్దార్ చెప్పండి.. లోకేష్ ట్వీట్

రాష్ట్ర పెద్దలకు మేడే సందర్భంగా ఖబడ్దార్ చెప్పండి.. లోకేష్ ట్వీట్


త్యాగాలతో, పోరాటాలలో ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలను కాజెయ్యాలని చూసే రాష్ట్ర పెద్దలకు మేడే సందర్భంగా ఖబడ్దార్ చెప్పండి. కరోనా మూలంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలని, పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలను ఇవ్వాలని, ఆ రోజే శ్రామిక కార్మిక సోదరులకు నిజమైన మేడే అంటూ నారా లోకేశ్ స్పష్టం చేశారు.

  Ys Jagan యాక్షన్ కి లోకేష్ రియాక్షన్ | విద్యార్థుల భవిష్యత్తుకి సీఎం భరోసా || Oneindia Telugu
   ఏపీలో తాజా పరిస్థితిపై , కార్మిక వ్యతిరేక విధానాలపై లోకేష్ ఫైర్

  ఏపీలో తాజా పరిస్థితిపై , కార్మిక వ్యతిరేక విధానాలపై లోకేష్ ఫైర్

  ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని మరోసారి ప్రస్తావించారు. మేడే రోజున కూడా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు లోకేష్.

  English summary
  TDP chief Chandrababu and Nara Lokesh wished all the people of AP on the occasion of May day . Chandrababu said that during the TDP regime, many welfare programs and schemes were provided for the welfare of the workers and now they are not implemented now. At the same time, Nara Lokesh shockingly tweeted, "Tell Khabaddar on the occasion of May day to the state elders who see the sacrifices and struggles that the people have achieved in the struggles to wipe out industries like Visakhapatnam steel." Chandrababu and Lokesh demanded that the government take steps to protect the workers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X